Makara jyothi: దర్శనమిచ్చిన మకర జ్యోతి.. పరవశించిన అయ్యప్ప భక్తులు | Sakshi
Sakshi News home page

దర్శనమిచ్చిన మకర జ్యోతి.. పరవశించిన అయ్యప్ప భక్తులు

Published Mon, Jan 15 2024 5:25 PM

Makara Jyothi Darshanam At S​habarimala On Jan 15 2024 - Sakshi

తిరువనంతపురం: కోట్లాది మంది భక్తులు ఏడాది పాటు ఎదురు చూసే క్షణం రానే వచ్చింది. మకర సంక్రాంతి పర్వదినమైన సోమవారం సాయంత్రం 6.47 గంటలకు కేరళలోని  శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నాంబళమేడుపై మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. మొత్తం మూడుసార్లు జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనమిచ్చిన సందర్భంగా శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి.

జ్యోతి దర్శనానికి 50 వేల మంది భక్తులకు ట్రావెన్‌కోర్‌ బోర్డు అనుమతిచ్చినప్పటికీ సుమారు 4 లక్షల మంది ప్రత్యక్షంగా జ్యోతిని వీక్షించారు. భక్తులు జ్యోతిని దర్శించుకునేందుకు ట్రావెన్‌కోర్‌ ఆలయ బోర్డు ప్రత్యేక వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. పరోక్షంగా టీవీలు, యూ ట్యూబ్‌లో కొన్ని కోట్ల మంది జ్యోతి దర్శనం చేసుకున్నారు.

జ్యోతి దర్శనం కోసం నియమ నిష్టలతో అయ్యాప్ప మాల ధరించిన స్వాములు భారీ సంఖ్యలో శబరిమలకు విచ్చేశారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు కందమల శిఖరంపై దర్శనమిచ్చిన మకర జ్యోతిని కనులారా వీక్షించి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.

హరిహర తనయుడు అయ్యప్పస్వామి కొలువైన క్షేత్రం కేరళ శబరిమల. ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమల ఆలయంలో మకరజ్యోతి/మరళవిక్కు కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మకర సంక్రాంతి నాడు దర్శనమిచ్చే జ్యోతి కావడంతో దీనిని శబరిమల మకరవిళక్కు లేదా శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు.

ఇదీచదవండి.. రాముడు కలలోకొచ్చాడు.. 22న అయోధ్యకు రాడట

Advertisement
 
Advertisement
 
Advertisement