makara sankranthi
-
దర్శనమిచ్చిన మకరజ్యోతి..అయ్యప్ప భక్తుల పరవశం
తిరువనంతపురం: అయ్యప్ప భక్తులు ఏడాదిపాటు ఎదురు చూసిన క్షణం మళ్లీ వచ్చింది. మకర సంక్రాంతి పర్వదినమైన మంగళవారం(జనవరి14) సాయంత్రం 6గంటల 44 నిమిషాలకు కేరళలోని శబరిమల ఆలయ సమీపంలోని పొన్నాంబళమేడు కొండపై మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. జ్యోతి రూపంలో అయ్యప్పస్వామి దర్శనమిచ్చిన సందర్భంగా శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి. జ్యోతి దర్శనానికి ముందు అయ్యప్పస్వామిని తిరువాభవరణలతో అలంకరించారు.జ్యోతి దర్శనానికి ట్రావెన్కోర్ దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శబరిమల కొండల్లోని పంబ, హిల్‌టాప్, సన్నిధానం సహా పలు చోట్ల భక్తుల కోసం వ్యూపాయింట్లు ఏర్పాటు చేసింది. జ్యోతిని సుమారు లక్షన్నర మంది దాకా అయ్యప్ప భక్తులు ప్రత్యక్షంగా జ్యోతిని వీక్షించినట్లు సమాచారం. జ్యోతిని దర్శించుకునేందుకు భక్తుల కోసం ట్రావెన్కోర్ ఆలయ బోర్డు ప్రత్యేక వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. పరోక్షంగా టీవీలు, యూ ట్యూబ్‌లో కొన్ని కోట్ల మంది జ్యోతిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా దర్శనం చేసుకున్నారు. జ్యోతి దర్శనం కోసం నియమ నిష్టలతో అయ్యప్ప మాల ధరించిన స్వాములు భారీ సంఖ్యలో శబరిమలకు విచ్చేశారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు శబరిమల కొండపై దర్శనమిచ్చిన మకర జ్యోతిని కనులారా వీక్షించి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. . ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమల ఆలయంలో మకరజ్యోతి లేదా మరళవిక్కు కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మకర సంక్రాంతి నాడు దర్శనమిచ్చే జ్యోతి కావడంతో దీనిని శబరిమల మకరవిళక్కు లేదా శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు. -
Mahakumbh-2025: మకర సంక్రాంతి వేళ.. అమృత స్నానానికి పోటెత్తిన జనం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పుష్య పూర్ణిమ స్నానంతో మహా కుంభమేళా ప్రారంభమైంది. తొలిరోజు సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 1.65 కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ నుండి భక్తులపై పూల వర్షం కురిపించారు. ఇందుకోసం 20 క్వింటాళ్ల గులాబీ రేకులను వినియోగించారు. #WATCH | The first Amrit Snan of #MahaKumbh2025 will begin with Mahanirvani Panchayati Akhara taking holy dip in Triveni Sangam on the auspicious occasion of Makar SankrantiSadhus of the 13 akhadas of Sanatan Dharm will take holy dip at Triveni Sangam - a sacred confluence of… pic.twitter.com/xgN3urCEUI— ANI (@ANI) January 14, 2025మహా కుంభమేళా నగరం భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికే ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలతో పాటు అమెరికా, రష్యా, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఈక్వెడార్ తదితర దేశాల నుండి వచ్చిన జనం ఇక్కడి సనాతన సంస్కృతికి ఆకర్షితులవుతున్నారు. సంగమంలో స్నానం చేసి, నుదుటిపై తిలకం పూసుకుని ఆధ్యాత్మిక ఆనందంలో మునిగితేలుతున్నారు.#WATCH | Prayagraj, Uttar Pradesh: On former Apple CEO Steve Jobs' wife Laurene Powell Jobs, Spiritual leader Swami Kailashanand Giri says, "She is in my 'shivir'. She has never been to such a crowded place. She has got some allergies. She is very simple...All those people who… pic.twitter.com/1bQXP2lId7— ANI (@ANI) January 14, 2025కుంభమేళాలో మొదటి అమృత స్నానం మకర సంక్రాంతి శుభ సందర్భంగా జరిగింది. ఇది మహానిర్వాణి పంచాయితీ అఖాడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడంతో మొదలయ్యింది. గంగా, యమున, మర్మమైన సరస్వతి నదుల పవిత్ర త్రివేణి సంగమంలో సనాతన ధర్మంలోని 13 అఖాడాలకు చెందిన సాధువులు ఈరోజు పవిత్ర స్నానం ఆచరించనున్నారు.#WATCH | Prayagraj | Preparations are underway for the first Amrit Snan of #MahaKumbh2025 The first Amrit Snan of #MahaKumbh2025 will begin with Mahanirvani Panchayati Akhara taking holy dip in Triveni Sangam on the auspicious occasion of #MakarSankranti pic.twitter.com/fIlzfygkos— ANI (@ANI) January 13, 2025మాజీ ఆపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ ఆధ్యాత్మిక గురువు స్వామి కైలాశానంద గిరి మీడియాతో మాట్లాడుతూ ‘లారెన్ పావెల్ జాబ్స్ నా శిబిరంలో ఉన్నారు. ఆమె ఏనాడూ ఇంత రద్దీగా ఉండే ప్రదేశానికి వెళ్లలేదు. ఆమెకు కొన్ని అలెర్జీలున్నాయి. మన సంప్రదాయాన్ని ఎప్పుడూ చూడని వారుకూడా మాతో చేరాలని కోరుకుంటున్నాం’ అన్నారు.#WATCH | Prayagraj | Devotees take holy dip on the first Amrit Snan of #MahaKumbh2025 on the auspicious occasion of #MakarSankranti #MahaKumbh2025 began yesterday with a record gathering of over 1.5 cr devotees on the first day pic.twitter.com/3MAk0yKD8y— ANI (@ANI) January 13, 20252025 మహా కుంభమేళా అమృత స్నానానికి ముందస్తు సన్నాహాలు చేశారు. మహాసంక్రాంతి శుభ సందర్భంగా మొదటి అమృత స్నానం మహానిర్వాణి పంచాయతీ అఖాడాలోని త్రివేణి సంగమంలో జరిగే పవిత్ర స్నానాలతో ప్రారంభమయ్యింది.#WATCH | Gorakhpur | Uttar Pradesh CM Yogi Adityanath says, "I extend my best wishes to all on the occasion of Makar Sankranti - it's a festival and a celebration to express gratitude towards lord Sun. Followers of Sanatan Dharm celebrate this festival with different names in… pic.twitter.com/HJukhqOpWo— ANI (@ANI) January 13, 2025మకర సంక్రాంతి శుభ సందర్భంగా మొదటి అమృత స్నానాన్ని భక్తులు ఆచరించారు. మొదటి రోజు రికార్డు స్థాయిలో 1.5 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు.#WATCH | Prayagraj | Sadhus of Mahanirvani Panchayati Akhara will be the first to take the holy dip at the first Amrit Snan of #MahaKumbh2025 on the auspicious occasion of Makar Sankranti as Sadhus of the 13 akhadas of Sanatan Dharm will take holy dip at Triveni Sangam - a sacred… pic.twitter.com/0lM8c1jbVP— ANI (@ANI) January 13, 2025ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ‘మకర సంక్రాంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది సూర్యభగవానునికి కృతజ్ఞతలు తెలిపే పండుగ. ఈ పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో భిన్నంగా జరుపుకుంటారన్నారు.#WATCH | Mahamandleshwar Swami Chidambaranand of Mahanirvani Panchayati Akhara, says, "I extend my best wishes to all on the occasion of #makarsankranti2025. Mahanirvani Panchayati Akhara will be the first to take holy dip on today's Amrit Snan - the first of #MahaKumbh2025..." https://t.co/0deSPAtEEe pic.twitter.com/Wftc0Nz3dO— ANI (@ANI) January 13, 2025మకర సంక్రాంతి శుభ సందర్భంగా సనాతన ధర్మానికి చెందిన 13 అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.#WATCH | #MahaKumbh2025 | Prayagraj, Uttar Pradesh: "I come from the US but I live in Lisbon, Portugal. I was travelling in the South. I came here via Varanasi yesterday... I like how the energy is very calm and peaceful, and everyone is very friendly. It feels very good to be… pic.twitter.com/z45G1rGxER— ANI (@ANI) January 13, 2025మహానిర్వాణి పంచాయతీ అఖాడాకు చెందిన మహామండలేశ్వర్ స్వామి చిదంబరానంద మకరసంక్రాంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.సనాతన ధర్మంలోని 13 అఖాడాల క్రమాన్ని మహా కుంభమేళా పరిపాలన విభాగం ఖరారు చేసింది. ప్రతి అఖాడాకు సమయాన్ని షెడ్యూల్ చేశారు.ఇది కూడా చదవండి: Maha Kumbh-2025: ఒక్కో ఘాట్‌కు ఒక్కో ప్రత్యేకత.. విశేష ఫలితం -
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
-
సందళ్లే సందళ్లే.. సంక్రాంతి సందళ్లే..!
ఉద్యోగాల పేరుతో ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి ఉన్నా..ఈ పండగకి మాత్రం తమ సొంతూళ్లకి చేరి చేసుకునే గొప్ప పండుగా సంక్రాంతి. అందర్నీ ఒక చోటకు చేర్చే పండుగ. ఎంత వ్యయప్రయాసలు కోర్చి అయినా.. ఈ పండగకి సోంతూరికి వెళ్తేనే ఆనందం. అలాంటి ఈ పండుగ విశిష్టత ఏంటి, దేశమంతా ఏఏ పేర్లతో ఈ పండగను జరుపుకుంటుంది తదితరాల గురించి చూద్దామా..!.సంక్రాంతి పండగా ప్రకృతికి కృతజ్ఞత చెబుతూ జరుపుకునే సంబరం. ఈ పండుగ నాటికి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ఇంటికి చేరుతుంది. అందుకే సంతోషంతో ఈ పండుగ చేసుకుంటారు. పురాణ కథనం ప్రకారం తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భువిపైకి ఆహ్వానిస్తాడు. అది సరిగ్గా మకర సంక్రాంతి పండుగ రోజునే. అందుకే ఈరోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 14న(మంగళవారం) మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయానం పూర్తి చేసుకుని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. ఈ పర్వదినంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల సుఖసంతోషాలతో హాయిగా ఉంటామని విశ్వసిస్తారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు. మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేస్తారు. అంత మహిమాన్వితమైన మకర సంక్రాంతిని దేశమంతా ఏఏ పేర్లతో ఎలా జరుపుకుంటుందో చూద్దామా..!.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతిని "మకర సంక్రాంతి" అని పిలుస్తారు. అక్కడ పెద్దల పేరు చెప్పి భోజనం పెట్టడం లేదా ఏవైన దానధర్మాలు చేయడం వంటివి చేస్తారు. వరి దుబ్బులు తీసుకొచ్చి పక్షులకు ఆహారం పెట్టడం వంటివి చేస్తారు.తమిళనాడులో మకర సంక్రాంతిని పొంగల్‌గా జరుపుకుంటారు. అక్కడ ఈ రోజున రైతులు తమ ఎద్దులను అలంకరించి పూజిస్తారు. వాళ్లు ఈ పండగను వ్యవసాయ ఉత్పాదకత, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు.కేరళలో మకర సంక్రాంతి పేరు మకరవిళక్కు. ఈ రోజున శబరిమల ఆలయం దగ్గర ఆకాశంలో మకర జ్యోతి కనిపిస్తుంది. ప్రజలు దానిని సందర్శిస్తారుకర్ణాటకలో ఈ పండుగను ఎల్లు బిరోధు అని పిలుస్తారు. ఈ రోజున మహిళలు కనీసం 10 కుటుంబాలతో చెరకు, నువ్వులు, బెల్లం, కొబ్బరితో చేసిన వస్తువులను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు.పంజాబ్‌లో మకర సంక్రాంతిని మాఘిగా జరుపుకుంటారు. మాఘి నాడు శ్రీ ముక్తసర్ సాహిబ్‌లో ఒక ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు ఈ రోజున నృత్యం చేసి ఆడి, పాడతారు. ఈ రోజున కిచిడి, బెల్లం, ఖీర్ తినే సంప్రదాయం ఉంది. గుజరాత్లో మకర సంక్రాంతిని ఉత్తరాయణ పుణ్య కాలంగా జరుపుకుంటారు. ఆ రోజున గాలిపటాల పండుగ జరుగుతుంది. అలాగే ఉండియు, చిక్కీ వంటకాలు తింటారు.హిమాచల్ ఫ్రదేశ్లో ఈ పండుగను మాఘాసాజీ అని పిలుస్తారు. సాజి అనేది సంక్రాంతికి పర్యాయపదం. కొత్త నెల ప్రారంభం… మాఘమాసం కూడా నేటినుంచే ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం ప్రారంభ సూచికగా ఈ పండుగ చేసుకుంటారు.ఉత్తరాఖండ్‌లోని కుమావున్ ప్రాంతంలో మకర సంక్రాంతి గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. అక్కడ ఈ రోజున నేతిలో వేయించి తీసిన పిండి పదార్ధాలను కాకులకు ఆహారంగా పెడతారు. ఒడిషాలో ప్రజలు మకర చౌలా పేరుతో సంక్రాంతిని జరుపుకుంటారు. కొత్తబియ్యం, బెల్లం, నువ్వులు. కొబ్బరి వంటి వాటితో చేసిన ఆహార పదార్ధాలను తయారు చేస్తారు ముఖ్యంగా కోణార్కో లోని సూర్యదేవాలయానికి ఈరోజు భక్తులు పోటెత్తుతారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యభగవానుడిదర్శనం చేసుకుంటారు.పశ్చిమ బెంగాల్లో పౌష్ సంక్రాంతి పేరుతో ఈ పండుగ జరుపుకుంటారు. ప్రజలు గంగానది బంగాళా ఖాతంలో కలిసే ప్రదేశంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దీన్ని పౌష్ పర్బన్ అనే పేరుతో కూడాజరుపుకుంటారు. ఇక్కడి ప్రజలు ఖర్జూర పండును ఎక్కువగ ఉపయోగిస్తారు. కొత్త బియ్యం, కొబ్బరి, బెల్లం ఖర్జూరాలతో తయరు చేసిన ఖీర్ వంటివి ఆరగిస్తారు.,డార్జిలింగ్ లోని హిమాలయ ప్రాంతాల్లో ఈరోజున ప్రజలు శివుడిని ఆరాధిస్తారు.బీహార్,జార్ఖండ్‌లలో ఈ రోజున ఉత్సాహంగా గాలిపటాలు ఎగరేసి ఆనంద డోలికల్లో మునిగిపోతారు. సాయంత్రం వేళ ప్రత్యేక ఖిచిడీని తయారు చేసి పాపడ్, నెయ్యి, కూరగాయలతో చేసిన వంటకాన్ని బంధువులు స్నేహితులతో కలిసి సామూహికంగా ఆరగిస్తారు.ఇతర దేశాల్లో..నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, కాంబోడియా వంటి దేశాల్లోనూ ఈ పండగ కనిపిస్తుంది. అక్కడ ప్రజలు నది -సముద్రం కలిసే సంగమ ప్రదేశంలోనూ పుణ్యస్నానాలు ఆచరిస్తారట. అలాగే పతంగులు, తీపి వంటలు ప్రధానంగా ఉంటాయట.(చదవండి: Sankranti 2025 : అసలు భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా?) -
సంక్రాంతి అంటే పతంగుల పండుగ కూడా..!
సంక్రాంతి వస్తోందంటే వాకిట రంగవల్లులు, తెల్లవారు జామున హరిదాసులు, తెల్లవారిన తర్వాత గొబ్బియల్లో పాటలు, మధ్యాహ్నానికి పతంగులు గాల్లో ఎగురుతాయి. ఇవన్నీ పండుగ రాకను సూచించే ఉల్లాసాలు. సంక్రాంతి పండుగకు ఇంతే ఉల్లాసంగా ఉత్సవాలు కూడా జరుపుకుంటాం. సంక్రాంతి పండుగకు మనదేశంలో, గుజరాత్లో జరిగే పతంగుల ఉత్సవం అంటే విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఉరకలు వేస్తూ వస్తారు. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ వేడుకలకు నవంబర్ నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. నగరం డిసెంబర్ నాటికే పూర్తి స్థాయిలో ముస్తాబవుతుంది.తోకలేని గాలిపటాలుఅహ్మదాబాద్లో ‘ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2025’ను ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అహ్మదాబాద్‌లో ప్రారంభమవుతుంది. కేవాడియా, రాజ్‌కోట్, వడోదరా, శివరాజ్ పూర్, ధోర్డో, సూరత్‌లలో కూడా వేడుకలు నిర్వహిస్తారు. గాలిపటం అంటే తోక ప్రధానం, కానీ తోకలేని గాలిపటాలు కూడా ఈ వేడుకల్లో కనిపిస్తాయి. నక్షత్ర పతంగులు, చేపలు, పులుల ఆకారంలో ప్రత్యేకమైన కాన్సెప్ట్‌లతో రూపొందిన గాలిపటాలను చూడవచ్చు. దేశవిదేశాల నుంచి పర్యాటకులు ఈ ఫెస్టివల్‌కి వస్తారు. అహ్మదాబాద్, కచ్, సూరత్, సాఉతారా, రాజ్‌కోట్, పోర్బందర్, గాంధీధామ్, అమ్రేలి, భావ్‌నగర్‌లలో గతంలో నిర్వహించిన ఫెస్టివల్లో పాల్గొన్న గాలిపటాల ఫొటో గ్యాలరీ స్టాల్ కూడా ఉంటుంది. ఏకకాలంలో ఐదు వందల పతంగులు గాల్లో ఎగురుతుంటే చూడడానికి రెండు కళ్లు చాలవనే మాట చాలా చిన్నది. అహ్మదాబాద్ లో1989 నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతోంది. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో ముందు ఒకటి రెండు రోజుల నుంచి తర్వాత మరో రోజు వరకు మొత్తం నాలుగు రోజులు నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్‌కి పతంగి తయారీదారులు ప్రత్యేకంగా నెల రోజుల ముందు నుంచే చేరుకుంటారు. మలేషియా, ఇండోనేషియా, యూఎస్, జ΄ాన్, చైనా, ఇటలీ వంటి అనేక దేశాల నుంచి పతంగులు చేసే నిపుణులు, పతంగులను ఎగురవేసే ఉత్సాహవంతులు నగరానికి చేరుకుంటారు. ప్రత్యేకమైన పతంగులను తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలు కూడా వేడుకలో పాల్గొంటాయి.కాంతులీనే పతంగులురంగురంగుల పతంగులను పగలంతా ఎగురవేస్తారు. వెలుగులు విరజిమ్మే తెల్లటి పతంగులను రాత్రి పూట ఎగురవేస్తారు. అవి ఆకాశంలో చంద్రుడికి పోటీగా విహరిస్తుంటాయి. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ని సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్నప్పటికీ ఇందులో మతపరమైన ధార్మిక నియమాలేవీ ఉండవు. వేడుకలో అన్ని మతాల వాళ్లూ సంతోషంగా పాల్గొంటారు. బంధువులు, స్నేహితులు కుటుంబాలతోపాటుగా కలిసి వేడుకలకు హాజరవుతుంటారు. ఇది ఊరంతా కలిసి నిర్వహించుకునే వేడుకన్నమాట. రంజాన్ సమయంలో చార్మినార్ నైట్ బజార్లాగ అహ్మదాబాద్ నగరంలోని పతంగిబజార్ డిసెంబర్ మూడోవారం నుంచి జనవరి రెండు వారాల వరకు మొత్తం నెలరోజుల పాటు రోజూ 24 గంటలూ తెరిచే ఉంటుంది. ఎన్నివేల పతంగులు అమ్ముడవుతాయో లెక్క అందదు. మాంజాకు గాజు పొడి అద్దే దుష్టసంప్రదాయాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నియమాన్ని కచ్చితంగా పాటించేటట్లు గట్టి నిఘా కూడా ఉంటుంది.పెద్దల కేరింతలుమన తెలుగువాళ్లు సంక్రాంతికి ప్రతి ఇంట్లో పతంగులు ఎగురవేస్తారు. హైదరాబాద్ ఆకాశం కూడా పతంగులతో కనువిందు చేస్తుంది. కానీ ఇక్కడ పిల్లలు పతంగులతో ఆనందిస్తుంటే పెద్దవాళ్లు పిల్లలను చూసి ఆనందిస్తుంటారు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో పెద్దవాళ్లు చిన్న పిల్లలైపోతారు. పరుగులు తీస్తూ మాంజాను జాడిస్తూ పతంగి పైకి ఎగిరే కొద్దీ కెవ్వున కేరింతలు కొడుతూ ఉంటే వాళ్లను చూసి పిల్లలు చప్పట్లు కొడుతూ ఈ వేడుకను ఎంజాయ్ చేస్తారు. (చదవండి: -
Makara jyothi: దర్శనమిచ్చిన మకర జ్యోతి.. పరవశించిన అయ్యప్ప భక్తులు
తిరువనంతపురం: కోట్లాది మంది భక్తులు ఏడాది పాటు ఎదురు చూసే క్షణం రానే వచ్చింది. మకర సంక్రాంతి పర్వదినమైన సోమవారం సాయంత్రం 6.47 గంటలకు కేరళలోని శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నాంబళమేడుపై మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. మొత్తం మూడుసార్లు జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనమిచ్చిన సందర్భంగా శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి. జ్యోతి దర్శనానికి 50 వేల మంది భక్తులకు ట్రావెన్కోర్ బోర్డు అనుమతిచ్చినప్పటికీ సుమారు 4 లక్షల మంది ప్రత్యక్షంగా జ్యోతిని వీక్షించారు. భక్తులు జ్యోతిని దర్శించుకునేందుకు ట్రావెన్కోర్ ఆలయ బోర్డు ప్రత్యేక వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. పరోక్షంగా టీవీలు, యూ ట్యూబ్‌లో కొన్ని కోట్ల మంది జ్యోతి దర్శనం చేసుకున్నారు. జ్యోతి దర్శనం కోసం నియమ నిష్టలతో అయ్యాప్ప మాల ధరించిన స్వాములు భారీ సంఖ్యలో శబరిమలకు విచ్చేశారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు కందమల శిఖరంపై దర్శనమిచ్చిన మకర జ్యోతిని కనులారా వీక్షించి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. Makara jyothi sighted.. worshiped by pilgrims at Sabarimala Temple in Kerala Swamiye Saranam Ayyappa...🙏 @TigerRajaSingh @bandisanjay_bjp @BJP4Telangana @narendramodi @myogiadityanath pic.twitter.com/r01oVSwcWg — Dinesh kumar 🇮🇳 (@Dineshdinnu86) January 15, 2024 హరిహర తనయుడు అయ్యప్పస్వామి కొలువైన క్షేత్రం కేరళ శబరిమల. ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమల ఆలయంలో మకరజ్యోతి/మరళవిక్కు కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మకర సంక్రాంతి నాడు దర్శనమిచ్చే జ్యోతి కావడంతో దీనిని శబరిమల మకరవిళక్కు లేదా శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు. ఇదీచదవండి.. రాముడు కలలోకొచ్చాడు.. 22న అయోధ్యకు రాడట -
మకర సంక్రాంతికి ఏ రాష్ట్రంలో ఏంచేస్తారు?
దేశవ్యాప్తంగా నేడు మకర సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన ఈ తరుణం నుంచి హిందువులు శుభకార్యాలను ప్రారంభిస్తారు. మకర సంక్రాంతి నాడు చేసే గంగాస్నానం, దానధర్మాలు, పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మకరసంక్రాంతి నాడు ఏ రాష్ట్రాల్లో ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పంజాబ్ పంజాబ్‌లో మకర సంక్రాంతిని మాఘీగా జరుపుకుంటారు. తెల్లవారుజామున నదీస్నానం చేస్తారు. ఈ రోజున నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని, పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. మాఘి నాడు శ్రీ ముక్త్సార్ సాహిబ్‌లో భారీ జాతర నిర్వహిస్తారు. తమిళనాడు దక్షిణ భారతదేశంలో మకర సంక్రాంతిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీనిని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. నాలుగు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు భోగి పొంగల్, రెండవ రోజు సూర్య పొంగల్, మూడవ రోజు మట్టు పొంగల్, నాల్గవ రోజు కన్యా పొంగల్ నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో ఈ పండుగ సందర్భంగా గంగాసాగర్ వద్ద జాతర నిర్వహిస్తారు. స్నానం చేసిన తర్వాత నువ్వులను దానం చేస్తారు. ఈ రోజున యశోదమాత.. శ్రీ కృష్ణుడిని దక్కించుకునేందుకు ఉపవాసం చేశారని చెబుతారు. అలాగే ఈ రోజునే గంగామాత భగీరథుడిని అనుసరిస్తూ, గంగా సాగర్‌లోని కపిలముని ఆశ్రమాన్ని చేరిందని అంటారు. కేరళ కేరళలో సంక్రాంతిని మకర విళక్కు పేరుతో నిర్వహిస్తారు. శబరిమల ఆలయానికి సమీపంలో ఆకాశంలో మకర జ్యోతిని భక్తులు సందర్శిస్తారు. కర్ణాటక కర్నాటకలో సంక్రాంతిని ‘ఏలు బిరోదు’ అనే పేరుతో జరుపుకుంటారు. స్థానిక మహిళలు.. చెరకు, నువ్వులు, బెల్లం, కొబ్బరిని ఉపయోగించి చేసిన వంటకాన్ని చుట్టుపక్కలవారికి పంచిపెడతారు. గుజరాత్ మకర సంక్రాంతిని గుజరాతీలో ఉత్తరాయణం అని అంటారు. రెండు రోజుల పాటు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. గాలిపటాలను ఎగురవేస్తారు. ప్రత్యేక వంటకాలను తయారుచేస్తారు. ఇది కూడా చదవండి: మొదలైన జల్లికట్టు.. తమిళనాట సందడే సందడి! -
గంగా నదిలో స్నానానికి పోటెత్తిన జనం!
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ధార్మిక నగరమైన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుండే వివిధ గంగా ఘాట్ వద్ద స్నానాలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. మకర సంక్రాంతి వేళ గంగాస్నానానికి ఎంతో విశిష్టత ఉంది. మకర సంక్రాంతి పండుగ రోజున సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనితోపాటు దక్షిణాయణం నుండి ఉత్తరాయణంలోకి మారతాడు. అందుకే మకర సంక్రాంతి నాడు స్నానం చేయడం విశేషమైనదిగా భావిస్తారు. పురాణాలలో పేర్కొన్న వివరాల ప్రకారం ఉత్తరాయణ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాయణ పర్వదినాన మరణించిన వారికి మరుజన్మ ఉండదని చెబుతారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినంతనే ఉత్తరాయణ పర్వదినం ప్రారంభమవుతుంది. సంక్రాంతి పండుగ దేశంలోని వివిధ రాష్ట్రాలలో పలు పేర్లతో జరుపుకుంటారు. కొన్నిచోట్ల మకర సంక్రాంతిగా, కొన్నిచోట్ల పొంగల్‌గా, మరికొన్ని చోట్ల ఉత్తరాయణ పండుగగా జరుపుకుంటారు. ఉత్తరాయణంలో పూర్వీకులకు పిండప్రదానం చేస్తే, వారు సంతృప్తి చెందుతారని పండితులు చెబుతారు. ఇది కూడా చదవండి: ‘బుల్డోజర్ బాబా’ పతంగులకు డిమాండ్! -
తొలి గాలిపటాన్ని ఎవరు తయారు చేశారు? ఎందుకు ఉపయోగించారు?
దేశంలోని వివిధ ప్రాంతాలలో మకర సంక్రాంతిని అక్కడి ఆచార సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. అయితే సంక్రాంతి అనగానే ముందుగా గాలిపటాలు గుర్తుకువస్తాయి. జైపూర్, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో సంక్రాతి సందర్భంగా కైట్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. మకర సంక్రాంతి సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు గాలిపటాలు ఎగరేస్తూ ఎంతగానో ఆనందిస్తారు. అయితే గాలిపటం అనేది భారతదేశంలో ఆవిష్కృతం కాలేదు. గాలిపటాన్ని చైనాలో కనుగొన్నారు. క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో చైనాలో గాలిపటాన్ని ఆవిష్కరించారని చెబుతుంటారు. ప్రపంచంలోనే మొట్టమొదటి గాలిపటాన్ని చైనీస్ తత్వవేత్త హువాంగ్ హెంగ్ తయారు చేశారు. చైనాలో గాలిపటాలు దూరాలను కొలవడానికి, గాలిని పరీక్షించడానికి, సైనిక కార్యకలాపాలలో ఉపయోగించేందుకు కనుగొన్నారు. అయితే గాలిపటం భారతదేశంలో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. భారతదేశంలో నాటి కాలపు రాజులు, చక్రవర్తులు కూడా గాలిపటాలు ఎగురవేసేవారు. ఇది కాలక్రమేణా ప్రజాదరణ పొందింది. ప్రస్తుత రోజుల్లో సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకూ అందరూ గాలిపటాలు ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా గాలిపటాలు ఎగురవేయడం అంటే ఎంతో ఇష్టం. ఆయన వీలు చిక్కినప్పుడు గాలిపటాలు ఎగురవేస్తుంటారు. మకర సంక్రాంతి నాడు దేశంలోని జైపూర్, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో గాలిపటాల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పతంగులు ఎగురవేసేందుకు, వాటిని చూసేందుకు పలు దేశాల టూరిస్టులు భారత్‌కు వస్తుంటారు. సంక్రాంతి నాడు ఆకాశం గాలిపటాలతో నిండిపోతుంది. దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల పతంగుల వ్యాపారం జరుగుతుండగా, జైపూర్, అహ్మదాబాద్, ముంబైలలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. పతంగుల తయారీ వలన లక్షలాది మందికి ఉపాధి కూడా లభిస్తుంది. గాలిపటం ఎగురవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. కొన్నిసార్లు గాలిపటం ఎగురవేసేటప్పుడు దాని దారం విద్యుత్ తీగలకు చిక్కుకుపోతుంది. ఇటువంటి సందర్భంలో ఆ దారాన్ని లాగితే షాక్ తగిలే అయ్యే ప్రమాదం ఉంది. చాలా మంది పిల్లలు గాలిపటాలు ఎగురవేసేటప్పుడు ప్రమాదాల బారినపడుతుంటారు. ఇటువంటి సందర్భాల్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ మరింత అవసరం. -
సంక్రాంతి సంబరాలతో పల్లెసీమలు
ఎన్నాళ్లకెన్నాళ్లకో అచ్చమైన సంక్రాంతి సంబరాలతో పల్లెసీమలు కళకళలాడుతున్నాయి. పంటల దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా చేతికి సొమ్ము అందడంతో పేదలు, లావాదేవీలు జోరందుకోవడంతో వ్యాపారులు.. వెరసి అన్ని వర్గాల ప్రజల్లో కొంగొత్త సం‘క్రాంతి’ కనిపిస్తోంది. ఉద్యోగ, వ్యాపారాల కోసం పట్టణాలు, నగరాలకు వెళ్లి స్థిరపడిన వారంతా అయినవారి మధ్య పండుగ జరుపుకోవడం కోసం స్వగ్రామాలకు తరలిరావడంతో పల్లెల్లో సందడి నెలకొంది. ఏలూరులో గంగిరెద్దును ఆడిస్తున్న దృశ్యం సాక్షి, అమరావతి: నగర, పట్నవాసులు పల్లెబాట పట్టారు. అల్లుళ్లు, ఆడపడుచులు, బంధుమిత్రుల రాకతో పల్లెల్లో కొంగొత్త సంక్రాంతి కళ సంతరించుకుంది. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం పట్నాలు, నగరాలకు వెళ్లి స్థిరపడిన వారంతా అయిన వారందరితో ఆనందంగా పండుగ జరుపుకోవడం కోసం స్వగ్రామాలకు చేరుకున్నారు. ప్రతి ఇంటి ముంగిటా సస్తవర్ణశోభితమైన రంగవల్లులు భోగి పండుగకు స్వాగతం పలికాయి. కొక్కొరోకో అంటూ... తొలి కోడి కూయగానే పల్లెల్లో నువ్వు ముందా.. నేను ముందా.. అని పోటీ పడిన చందంగా భోగి మంటలు వెలిగించారు. చలి వాతావరణంలో భోగి మంటల వద్ద ఆనందంగా గడిపారు. సూర్యోదయానికి ముందే మహిళలు ఇళ్ల ముందు కల్లాపు చల్లి ముత్యాల ముగ్గులు వేసి రంగులద్దారు. రంగవల్లుల మధ్యలో గోవు పేడతో చేసిన గొబ్బమ్మలను ఉంచి పుష్పాలతో అలంకరించారు. మకర సంక్రాంతికి స్వాగతం పలుకుతూ పక్షం రోజులుగా డూడూ బసవన్నలు (గంగిరెద్దులు) పల్లెల్లో సందడి చేస్తున్నాయి. ధనుర్మాసం కావడంతో ఉదయమే నుదుట నామాలు ధరించిన హరిదాసుల సంకీర్తనలు వీనుల విందు గొలుపుతున్నాయి. పట్టణాలు, నగరాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన వారితో పల్లెల్లో కార్ల సందడి నెలకొంది. నవరత్నాల ప్రభావం వైఎస్ జగన్ సర్కారు అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ ప్రభావం సంక్రాంతిపై స్పష్టంగా కనిపిస్తోంది. నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న వినూత్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల అల్పాదాయ వర్గాలకు లబ్ధి కలగడంతో పండుగకు కొత్త కళ వచ్చింది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 పెట్టుబడి సాయం, అమ్మ ఒడి పథకం కింద ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు అకౌంట్లో ఏటా రూ.15,000 జమ చేస్తుండటం గమనార్హం. తాజాగా ఈనెల 11న 44.48 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి కింద ప్రభుత్వం రూ.6,673 కోట్లు జమ చేసింది. డ్వాక్రా మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు అందించింది. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.2,250 పింఛను అందిస్తోంది. 30.76 లక్షల మందికి నివాస స్థల పట్టాలు ఇచ్చి, 28 లక్షల మందికి ఇళ్లు కట్టించే బృహత్తర కార్యక్రమానికి గత నెల 25న శ్రీకారం చుట్టింది. పట్టాల పంపిణీతో ఈ ఏడాది పల్లెల్లో ముందే సంక్రాంతి కళ సంతరించుకుంది. వర్షాలు పడటంతో పంటలు బాగా పండుతున్నాయి. కూలీలకు చేతి నిండా పని లభిస్తోంది. డబ్బు చేతికి అందినందున ప్రతి కుటుంబం ఉన్నంతలో ఆనందంగా సంక్రాంతి జరుపుకుంటోంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సూర్యారావుపేటలో భోగి మంట వద్ద యువతుల సందడి భోగి మంటలతో కొత్త వెలుగులు పెద్దల పండుగ, కనుమ నేపథ్యంలో రంగవల్లులతో ఇళ్లు నూతన శోభ సంతరించుకున్నాయి. భోగభాగ్యాలు పంచే భోగి పండుగ సందర్భంగా తెల్లవారుజామునే ప్రతి గడప ముంగిటా భోగి మంటలు వేయడంతో పల్లెల్లో మబ్బులోనే వెలుగులు చిమ్మాయి. పిల్లల తలపై రేగి పండ్లు, చిల్లర నాణేలను పోసి ముత్తయిదువులు దీవించారు. ఈ ఏడాది ఉద్యోగులకు సంక్రాంతి భాగా కలిసొచ్చింది. దాదాపు వారం రోజులు సెలవు లభించినట్లయింది. ఇంటింటా ఘుమఘుమలు గ్రామ వీధుల్లో పిండి వంటలు ఘుమఘుమలు వెదజల్లుతున్నాయి. అరిసెలు, లడ్డూ, కర్జికాయలు, గారెలు, సున్నుండలు, బొబ్బట్లు, కాజాలు, పూతరేకులు, లడ్డూ, లాంటి రకరకాల పిండి వంటలు సిద్ధం చేస్తున్నారు. వ్యాపారుల మోముల్లో సంక్రాంతి జోష్ వస్త్ర, కిరాణా దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. తెలుగువారికి ఇదే పెద్దపండుగ కావడంతో ఆడపడుచులకు, అల్లుళ్లకు దుస్తులు పెట్టి సత్కరించే సంప్రదాయం ఉంది. దీంతో ఈ ఏడాది ఊహించిన దానికంటే రెట్టింపు వ్యాపారం జరుగుతుండటం పట్ల వస్త్ర వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం సంక్రాంతి పర్వదినం సందర్భంగా గురువారం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీనిని మకర సంక్రాంతి అని అంటారు. అనగా సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే శుభప్రదమైన రోజని అర్థం. ఈ సందర్భంగా పెద్దలకు దుస్తులు పెట్టుకుని తర్పణాలు వదిలేందుకు పల్లె జనం సంప్రదాయబద్ధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఊరూరా సందడే సందడి ► రాష్ట్రంలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఇంటింటా బంధు మిత్రుల కోలాహలం కనిపిస్తోంది. దేవతా మూర్తుల ఊరేగింపులు, ముగ్గుల పోటీలు, కోలాటాలు, ఆటల పోటీలతో ఎటు చూసినా సందడి నెలకొంది. గుంటూరు రూరల్ మండలంలోని చల్లావారిపాలెంలో హోమాలు, ప్రత్యేక పూజల మధ్య పుట్టలమ్మతల్లి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ► పెదకూరపాడు మండలం బలుసుపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో మన ఊరు–మన సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు తరలివచ్చారు. నెహ్రూనగర్‌లో కర్రసాము, కోలాటం, గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ► ‘ఓలేటి’ ఇంటి పేరు ఉన్న 30 మంది కుటుంబ సభ్యులు గుంటూరు పోస్టల్‌కాలనీలో ఓలేటి పున్నమ్మ–అప్పయ్య చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం భోగి, సంక్రాంతి సంబరాలను జరుపుకొన్నారు. ► రాయలసీమ జిల్లాలు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో బండలాగుడు, ఎడ్ల బండ్ల పందేలు నిర్వహించారు. కలర్లు, రంగు పేపర్లు, బెలూన్లు, మెడ గంటలు, ప్రభలతో అలంకరించి మెరవణి (ఊరేగింపు)కి సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లాలో పొంగళ్ల నైవేద్యం సమర్పించారు. విశాఖ జిల్లాలో ఈ ఏడాది గిరిజనులు పెద్ద సంఖ్యలో సంక్రాంతిని జరుపుకుంటున్నారు. నెల్లూరులో పెన్నానది తీరంలో గొబ్బెమ్మల నిమజ్జనానికి మహిళలు సిద్ధమవుతున్నారు. గోదావరి జిల్లాల్లో పందేల జోరు ► తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంగరంగ వైభవంగా సాగుతోంది. ఆట పాటలతో గ్రామాల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. కోడి పందేలను చూసేందుకు వివిధ నగరాల్లో స్థిరపడిన వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులూ పాల్గొన్నారు. బరుల వద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని మహంకాళీ ఆలయాల్లో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అత్తిలిలో కావిడి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. లక్షలాది మంది రైతులు చేతికందిన పంటను ఒబ్బిడి చేసుకుని సంప్రదాయబద్ధంగా కనుమ పండుగ జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. స్వీట్స్ ఆర్డర్లు బాగా పెరిగాయి సంక్రాంతి నేపథ్యంలో స్వీట్స్ విక్రయాలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, వైజాగ్, గుంటూరు, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద సంస్థలతో పాటు వ్యక్తిగత ఆర్డర్లు బాగా వచ్చాయి. ఇళ్లలో చేసుకునే తీరిక లేనివారు, అలాగే పట్టణాల నుంచి వచ్చే బంధువుల కోసం సంప్రదాయ పిండి వంటలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. – పోలిశెట్టి మల్లిబాబు, సురుచి ఫుడ్స్ అధినేత, తాపేశ్వరం, తూర్పుగోదావరి జిల్లా వ్యాపారాలకు సంక్రాంతి శోభ వస్త్ర వ్యాపారాన్ని కరోనా ఈ ఏడాది దారుణంగా దెబ్బతీసింది. చాలా రోజుల తర్వాత సంక్రాంతి రూపంలో కొత్త శోభ చేకూరింది. ఈ సంక్రాంతి పండుగ కొనుగోళ్లతో మా వస్త్ర వ్యాపారులకు ఊరట లభించింది. పెళ్లి ముహూర్తాలు ముగిసిన తర్వాత రావడంతో భారీగా కాకపోయినా ఆశించిన స్థాయిలో వ్యాపారం సాగింది. మొత్తం మీద మా వస్త్ర వ్యాపారులకు ఈ పండుగ కొంచెం ఊపిరి పీల్చుకునేలా చేసింది. – బచ్చు వెంకట ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఏపీ టెక్స్టైల్ ఫెడరేషన్, పోకూరి గంగా ఎస్ వెంకట రమేష్, విజయవాడ వస్త్రలత వ్యాపారుల సంఘం ఇది జగనన్న సంక్రాంతి కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన మా కుటుంబం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఈ క్రమంలో అమ్మఒడి డబ్బులు అందడం కొండంత సంబరం నింపింది. స్కూల్ ఫీజుకు సగం డబ్బులు పోగా, మిగతా సొమ్ముతో కొత్త దుస్తులు కొనుక్కున్నాం. అందరి లాగే స్వీట్లు చేసుకుని పండుగ జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి జగనన్న వల్లే మాకు ఈ ఆనందం కలుగుతోంది. అందువల్ల ఈ పండుగను జగనన్న సంక్రాంతిగా జరుపుకుంటున్నాం. – ఈటీ గజలక్ష్మి, తిరుపతి, చిత్తూరు జిల్లా ఆనందకర సంక్రాంతి ప్రతి కుటుంబానికి నాలుగైదు ప్రభుత్వ పథకాలు అందడం వల్ల ఈ ఏడాది మాతోపాటు అందరూ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారు. నాకు వృద్ధాప్య పింఛను వస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా కింద డబ్బు అందింది. నా భార్య లక్ష్మికి వైఎస్సార్ చేయూత కింద సాయం అందింది. మా ఇద్దరు కుమారుల్లో ఒకరికి ఇంటి స్థలం వచ్చింది. నా భార్యతోపాటు కోడళ్లకు డ్వాక్రా ద్వారా రుణ మాఫీ ప్రయోజనం లభించింది. ఈ ఆనందకర సంక్రాంతికి మనసున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ఉండటమే కారణం. – పూడి అప్పారావు, మాకవరపాలెం మండలం, విశాఖపట్నం జిల్లా. -
తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
-
శ్రీగిరిలోసంక్రాంతి
శ్రీశైలం, న్యూస్‌లైన్: మకర సంక్రమణ బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీశైలాయం సంక్రాంతి శోభను సంతరించుకుంది. ఆదివారం పంచాహ్నిక దీక్షతో ఆరంభమైన ఉత్సవాల్లో భాగంగా ఉదయం 9.15 గంటలకు దేవస్థానం ఈవో చంద్రశేఖర్ఆజాద్ దంపతులు, ఆలయ అర్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి గణపతి, కంకణ, తదితర ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల యాగశాలలో లోక కల్యాణార్థం చేపట్టిన విశేష పూజల సందర్భంగా చండీశ్వరునికి కంకణధారణ చేశారు. దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా, సకాలంలో తగినంత వర్షాలు కురిసి పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలని సంకల్పం చెప్పారు. అనంతరం దీక్షావస్త్రాలకు విశేష పూజలను చేసి ఉత్సవాల్లోపాల్గొనే వేదపండితులు, అర్చకులు భజంత్రీలకు, సంబంధిత ఆలయ సిబ్బందికి ఈవో అందజేశారు. రాత్రి 7 గంటల నుంచి భేరిపూజ, భేరితాండన, సకల దేవతాహ్వానా పూర్వక ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంతవైభవంగా చేపట్టారు. మకర సంక్రమణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 8.15 గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటావిష్కరణ చేశారు. అంతకుముందు ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరున్ని పల్లకీలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు చేర్చారు. అక్కడ వేదమంత్రోచ్ఛారణలతో భేరి, సన్నాయిలకు వేదపండితులు, అర్చకులు విశేషపూజలు చేశారు. ధ్వజారోహణలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆధ్వర్యం వహించాల్సిందిగా బ్రహ్మదేవున్ని ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రాజశేఖర్, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు, అర్చకులు, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.