Makara Jyothi
-
దర్శనమిచ్చిన మకరజ్యోతి..అయ్యప్ప భక్తుల పరవశం
తిరువనంతపురం: అయ్యప్ప భక్తులు ఏడాదిపాటు ఎదురు చూసిన క్షణం మళ్లీ వచ్చింది. మకర సంక్రాంతి పర్వదినమైన మంగళవారం(జనవరి14) సాయంత్రం 6గంటల 44 నిమిషాలకు కేరళలోని శబరిమల ఆలయ సమీపంలోని పొన్నాంబళమేడు కొండపై మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. జ్యోతి రూపంలో అయ్యప్పస్వామి దర్శనమిచ్చిన సందర్భంగా శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి. జ్యోతి దర్శనానికి ముందు అయ్యప్పస్వామిని తిరువాభవరణలతో అలంకరించారు.జ్యోతి దర్శనానికి ట్రావెన్కోర్ దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శబరిమల కొండల్లోని పంబ, హిల్టాప్, సన్నిధానం సహా పలు చోట్ల భక్తుల కోసం వ్యూపాయింట్లు ఏర్పాటు చేసింది. జ్యోతిని సుమారు లక్షన్నర మంది దాకా అయ్యప్ప భక్తులు ప్రత్యక్షంగా జ్యోతిని వీక్షించినట్లు సమాచారం. జ్యోతిని దర్శించుకునేందుకు భక్తుల కోసం ట్రావెన్కోర్ ఆలయ బోర్డు ప్రత్యేక వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. పరోక్షంగా టీవీలు, యూ ట్యూబ్లో కొన్ని కోట్ల మంది జ్యోతిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా దర్శనం చేసుకున్నారు. జ్యోతి దర్శనం కోసం నియమ నిష్టలతో అయ్యప్ప మాల ధరించిన స్వాములు భారీ సంఖ్యలో శబరిమలకు విచ్చేశారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు శబరిమల కొండపై దర్శనమిచ్చిన మకర జ్యోతిని కనులారా వీక్షించి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. . ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమల ఆలయంలో మకరజ్యోతి లేదా మరళవిక్కు కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మకర సంక్రాంతి నాడు దర్శనమిచ్చే జ్యోతి కావడంతో దీనిని శబరిమల మకరవిళక్కు లేదా శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు. -
Makara jyothi: దర్శనమిచ్చిన మకర జ్యోతి.. పరవశించిన అయ్యప్ప భక్తులు
తిరువనంతపురం: కోట్లాది మంది భక్తులు ఏడాది పాటు ఎదురు చూసే క్షణం రానే వచ్చింది. మకర సంక్రాంతి పర్వదినమైన సోమవారం సాయంత్రం 6.47 గంటలకు కేరళలోని శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నాంబళమేడుపై మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. మొత్తం మూడుసార్లు జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనమిచ్చిన సందర్భంగా శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి. జ్యోతి దర్శనానికి 50 వేల మంది భక్తులకు ట్రావెన్కోర్ బోర్డు అనుమతిచ్చినప్పటికీ సుమారు 4 లక్షల మంది ప్రత్యక్షంగా జ్యోతిని వీక్షించారు. భక్తులు జ్యోతిని దర్శించుకునేందుకు ట్రావెన్కోర్ ఆలయ బోర్డు ప్రత్యేక వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. పరోక్షంగా టీవీలు, యూ ట్యూబ్లో కొన్ని కోట్ల మంది జ్యోతి దర్శనం చేసుకున్నారు. జ్యోతి దర్శనం కోసం నియమ నిష్టలతో అయ్యాప్ప మాల ధరించిన స్వాములు భారీ సంఖ్యలో శబరిమలకు విచ్చేశారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు కందమల శిఖరంపై దర్శనమిచ్చిన మకర జ్యోతిని కనులారా వీక్షించి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. Makara jyothi sighted.. worshiped by pilgrims at Sabarimala Temple in Kerala Swamiye Saranam Ayyappa...🙏 @TigerRajaSingh @bandisanjay_bjp @BJP4Telangana @narendramodi @myogiadityanath pic.twitter.com/r01oVSwcWg — Dinesh kumar 🇮🇳 (@Dineshdinnu86) January 15, 2024 హరిహర తనయుడు అయ్యప్పస్వామి కొలువైన క్షేత్రం కేరళ శబరిమల. ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమల ఆలయంలో మకరజ్యోతి/మరళవిక్కు కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మకర సంక్రాంతి నాడు దర్శనమిచ్చే జ్యోతి కావడంతో దీనిని శబరిమల మకరవిళక్కు లేదా శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు. ఇదీచదవండి.. రాముడు కలలోకొచ్చాడు.. 22న అయోధ్యకు రాడట -
Sabarimala: నేడు మకరజ్యోతి దర్శనం
తిరువనంతపురం: శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం కానుంది. ఈ నేపథ్యంలో స్వాములు భారీగా తరలి వస్తున్నారు. శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మారుమోగుతున్నాయి. మకర జ్యోతి దర్శనానికి 50 వేల మంది భక్తులకు అనుమతి ఉంటుందని ట్రావెన్కోర్ బోర్డ్ ప్రకటించింది. కానీ, నాలుగు లక్షల మంది దాకా వీక్షించే అవకాశం ఉండొచ్చని ఒక అంచనా. హరిహర తనయుడు అయ్యప్ప స్వామి కొలువైన క్షేత్రం కేరళ శబరిమల. శబరిమల మకరజ్యోతి/మకరవిళక్కు ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున...శబరిమల ఆలయంలో నిర్వహించే కార్యక్రమం. మకర సంక్రాంతి నాడు ఈ జ్యోతి దర్శనం ఇస్తుంది కాబట్టి శబరిమల మకరవిళక్కు/ శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు. #WATCH | Kerala: Devotees throng Sabarimala Temple in large numbers to offer prayers to Lord Ayyappa ahead of the Makaravilakku festival. pic.twitter.com/n2UXCMOkTP — ANI (@ANI) January 14, 2024 మకర జ్యోతి దర్శన నేపథ్యంలో.. నియమ నిష్టలతో అయ్యప్ప మాల ధరించిన స్వాములు స్వామి దర్శనం కోసం శబరిమలకు పోటెత్తుతున్నారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున కనిపించే మకర జ్యోతిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు కందమల శిఖరంపై దర్శనమిచ్చే మకర జ్యోతి కోసం ఎదురుచూస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 నుంచి 7.00 గంటల మధ్య ఉంటుంది ఆలయ బోర్డు ప్రకటించింది. భక్తుల కోసం ప్రత్యేకంగా వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. -
శబరిమలకు పోటెత్తిన భక్తులు.. మకరజ్యోతి దర్శనంపై కీలక నిర్ణయం
తిరువనంతపురం: కేరళలోని శబరిమల దర్శనానికి అయ్యప్ప భక్తులు పోటెత్తారు. శబరిమలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో అయ్యప్ప దర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది. అయ్యప్ప దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారు. వివరాల ప్రకారం.. శబరిమలలో అయ్యప్ప దర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది. పంబా నుంచి శబరి పీఠం వరకు భక్తులు కిక్కిరిసిపోయారు. దీంతో, గంటల తరబడి భక్తులు క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు.. భక్తుల రద్దీ విషయంలో దేవస్థానం ట్రస్ట్(ట్రావెన్కోర్ దేవస్థానం) కీలక నిర్ణయం తీసుకుంది. మకరజ్యోతి సందర్శనం రోజున దర్శనాలపై కొత్త నిబంధనలను విధించింది. మకరజ్యోతి వీక్షణం కోసం 50వేల మందికే అనుమతి ఇస్తామని ట్రస్ట్ పేర్కొంది. మకరజ్యోతి దర్శనానికి మహిళలు, పిల్లలు రావొద్దని అలర్ట్ చేసింది. అలాగే, ఈనెల 14వ తేదీన 40వేల మందికి, 15వ తేదీన 50వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్టు ట్రస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ రెండు రోజుల్లో ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికే దర్శనం అని స్పష్టం చేసింది. சபரிமலை செல்வோர் கவனத்திற்கு.. திடீரென வந்த அறிவிப்பு - ''இதை மீறினால்..' எச்சரிக்கை.. #NewsTamil24x7 | #sabarimala | #kerala | #sabarimalai | #viralvideo | #sabarimalatemple pic.twitter.com/AFxlvutGRr — News Tamil 24x7 | நியூஸ் தமிழ் 24x7 (@NewsTamilTV24x7) January 4, 2024 ఇక ఈసారి శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. నవంబర్ 17 వ తేదీ నుంచి డిసెంబరు 27 వ తేదీ వరకూ 40 రోజుల్లోనే దాదాపు 32 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. దీంతో ఏకంగా రూ.241 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే గతేడాది కంటే రూ.18.72 కోట్లు అధికంగా వచ్చినట్లు పేర్కొన్నాయి. @CMOKerala @TheKeralaPolice @BJP4Keralam In Sabarimala Devasthanam this time the crowd has gathered in large numbers and no proper action has been taken for that most of the devotees have faced great hardship as there is no toilet. Action should be taken #Kerala #sabarimalai pic.twitter.com/hBUYcK7DL3 — தயா (Social Worker) (@PresidencyDhaya) January 3, 2024 -
మకరజ్యోతి దర్శనంతో పులకించిన అయ్యప్ప భక్తులు
-
కేరళ: శబరిమలలో మకరజ్యోతి దర్శనం
కేరళ: శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో నుంచి భక్తులకు మూడు సార్లు మకరజ్యోతి కనిపించింది. మకరజ్యోతి దర్శనం కాగానే ‘స్వామియే శరణం అయ్యప్ప’ నామస్మరణతో శబరిమల సన్నిధానం మార్మోగింది. జ్యోతి దర్శనంతో భక్తులు ఆనంద పరవశానికి లోనయ్యారు. జ్యోతి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శబరిమల తరలివచ్చారు. లక్షలాది అయ్యప్ప భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మకర సంక్రాంతి పర్వదినాన జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తాడని భక్తులు నమ్ముతారు. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జ్యోతి దర్శనానికి ముందు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతి నిచ్చారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శ్రేణుల నుంచి జ్యోతి దర్శనమైంది. కాగా శబరిమలకు ఈశాన్య దిశలో నాలుగు కిలోమీటర్ల దూరంలో పొన్నంబలమేడు కొండలు ఉన్నాయి. సముద్ర మట్టానికి 914 మీటర్ల ఎత్తులో.. 18 కొండల మధ్య అయ్యప్ప స్వామి కొలువై ఉన్నాడు. -
శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం |
-
శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం
తిరువనంతపురం: శబరిమలలోని పొన్నాంబలమేడు కొండల్లో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. భక్తుల నామస్మరణతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. మకర జ్యోతిని దర్శించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అన్న శరణు ఘోషతో కొండ ప్రాంతం మార్మొగుతుంది. కోవిడ్ నేపథ్యంలో.. కరోనా నిబంధలను పాటిస్తూ భక్తులకు ఆలయ కమిటీ దర్శనం కల్పించింది. ఈనెల 20న తిరిగి ఆలయం మూసివేయనున్నారు. చదవండి: ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి కన్నుమూత -
దర్శనమిచ్చిన మకర జ్యోతి
శబరిమల : కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నాంబళంమేడు కొండల్లో బుధవారం సాయంత్రం మకర జ్యోతి దర్శనమిచ్చింది. భారీ సంఖ్యలో ఇప్పటికే జ్యోతి దర్శనం కోసం శబరిమలకు చేరుకున్న భక్తులు జ్యోతిని చూసి ఆనంద పరవశులయ్యారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ శబరిమల సన్నిధానం మారుమోగింది. మకరజ్యోతి దర్శనానికి విచ్చేసిన అయ్యప్ప స్వాములతో పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. పంబ, నీలికల్, పులిమేడ్ ప్రాంతాలను జ్యోతిని వీక్షించేందుకు ట్రావెన్స్కోర్ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. మరోవైపు పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. అంతకుముందు మకరజ్యోతి వీక్షించేందుకు వచ్చిన అయ్యప్ప స్వాములతో శబరిమల సన్నిధానం కిక్కిరిసిపోయింది. మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమల సన్నిధానం నుంచి పంబ వరకు బారులు తీరారు. కేరళతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు తరలివెళ్లారు. స్వామి కోసం పందళ రాజ వంశీకులు తీసుకువచ్చిన ప్రత్యేక ఆభరణాలను అయ్యప్ప స్వామికి అలంకరించారు. ఆ తర్వాత సాయంత్రం 6.50 గంటల సమయంలో పొన్నాంబలమేడు కొండపై జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చింది. -
శబరిమలలో మకరజ్యోతి దర్శనం..పోటెత్తిన భక్తులు
సాక్షి, శబరిమల : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతిని అయప్పభక్తులు దర్శించుకున్నారు. పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతిని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇవ్వడంతో భక్తులు తన్మయత్వంతో పులకించి పోయారు.‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ భక్తుల శరణుఘోషతో శబరిగిరులు మార్మోగాయి. మకరజ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు పెద్దసంఖ్యలో శబరిమల చేరుకున్నారు. సుమారు 18 లక్షల మంది శబరిమలకు వచ్చినట్లు సమాచారం. మకరజ్యోతి దర్శనం నిమిత్తం ట్రావెన్ కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. దర్శనం కోసం పంపా నది, సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా వద్ద ఏర్పాట్లు చేశారు. భక్తులు ఈనెల 19వరకు అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వీలు కల్పించారు. ఈనెల 20న పందళ రాజవంశీకులు స్వామివారి దర్శనం తర్వాత ఆలయం మూసివేస్తారు. -
శబరిమలలో కనిపించిన మకర జ్యోతి
-
శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి
సాక్షి, శబరిమల : శబరిమలలో మకర జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు శబరిమలకు తరలివచ్చారు. ఆదివారం సాయంత్రం 6.45 నుండి 7 గంటల మధ్యలో మకర జ్యోతిని దర్శించుకున్న భక్తజనం పులకించిపోయారు. జ్యోతి దర్శనం సమయంలో స్వామియే శరణమయ్యప్ప అంటూ శబరిమల క్షేత్రం మారుమోగింది. రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మకరజ్యోతి దర్శనం సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పులిమేఢు, నీలికాల్, పరియణా వట్టం, పంబా ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి ఆలయానికి మరికొద్దిసేపట్లో ఆభరణాలు చేరుకోనున్నాయి. -
శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి
కొచ్చి: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నాంబళంమేడు కొండల్లో శనివారం సాయంత్రం మకర జ్యోతి దర్శనమిచ్చింది. భారీ సంఖ్యలో ఇప్పటికే జ్యోతి దర్శనం కోసం శబరిమలకు చేరుకున్న భక్తులు జ్యోతిని చూసి ఆనంద పరవశులయ్యారు. స్వామియే శరణం అయ్యప్పా అన్న నినాదాలు మిన్నంటాయి. అయ్యప్పను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో శబరిమలకు చేరుకున్నారు. అయ్యప్పల నామస్మరణతో శబరిమల మార్మోగిపోయింది. మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమల సన్నిధానం నుంచి పంబ వరకు బారులు తీరారు. కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు తరలివెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా లక్షలాదిమంది అయ్యప్ప భక్తులు మాలను ధరించి మకరజ్యోతి దర్శనం కోసం వెళ్తారు. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో తరలివెళ్లారు. గతంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మకరజ్యోతి దర్శనాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. అయ్యప్ప స్వామి మాలను ధరించిన భక్తులు నియమ నిష్టలతో దీక్షను ఆచరించి దర్శనానికి వెళ్తారు. -
శబరిగిరిలో మకరజ్యోతి దర్శనం
-
శబరిగిరిలో మకరజ్యోతి దర్శనం
కేరళ: శబరిమలైలో శుక్రవారం సాయంత్రం మకరజ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతిని దర్శించుకునేందుకు వచ్చిన లక్షలాది మంది అయ్యప్ప భక్తులతో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి. ఈ ఏడాది మకరజ్యోతి మూడు సార్లు దర్శినమిచ్చింది. అయ్యప్ప నామస్మరణలతో శబరిగిరులు మారుమ్రోగాయి. మకరజ్యోతి దర్శనంతో దేశవ్యాప్తంగా భక్తులు పులకించిపోయారు. -
నేడు మకరజ్యోతి దర్శనం
-
శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. అశేష సంఖ్యలో శబరిలో ఉన్న భక్తులతో పాటు.. కోట్లాది మంది భక్తులు టీవీ చానళ్ల ద్వారా కూడా మకరజ్యోతిని దర్శించుకున్నారు. పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతి దర్శనభాగ్యం భక్తులకు కలిగింది. బుధవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మకరజ్యోతి కనిపించడంతో భక్తుల శరణుఘోషతో శబరి కొండలు ప్రతిధ్వనించాయి. మిరుమిట్లు గొలిపేలా బాణాసంచా కూడా కాల్చి జ్యోతి కనిపించిన ఆనందాన్ని భక్తులు పంచుకున్నారు. -
జ్యోతి రూపంలో అయ్యప్ప దర్శనం?
-
శబరిమలైలో మకరజ్యోతి దర్శనం
-
శబరిమలైలో మకరజ్యోతి దర్శనం
అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలైకు పోటెత్తారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మకరజ్యోతి దర్శనం కోసం బారులు తీరారు. మంగళవారం సాయంత్రం మకరజ్యోతి దర్శనభాగ్యం లభించింది. అయ్యప్పల శరణు ఘోషతో శబరిమలై మార్మోగిపోయింది. మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమలై సన్నిధానం నుంచి పంబ వరకు బారులు తీరారు. కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు తరలివెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఏటా లక్షలాదిమంది భక్తులు మాలను ధరించి మకరజ్యోతి దర్శనం కోసం వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో వచ్చారు. భక్తులకు అసౌకర్యం ఏర్పడినా జ్యోతి దివ్య దర్శనం కోసం ఓపిగ్గా ఎదురు చూశారు. గత రెండు రోజులుగా మొత్తం పదిలక్షల మంది స్వామిని దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. మంగళవారం మరింత భారీ సంఖ్యలో తరలివచ్చారు. మకరజ్యోతి దర్శనాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. అయ్యప్ప స్వామి మాలను ధరించిన భక్తులు నియమ నిష్టలతో దీక్షను ఆచరించి దర్శనానికి వస్తుంటారు. గతేడాదితో పోలిస్తే దేవస్థానం అధికారులు ఈ సారి భక్తులు మెరుగైన సౌకర్యాలు కల్పించారు. అయినా కొండప్రాంతం కావడంతో భక్తుల సంఖ్యకు తగినట్టు ఏర్పాట్లు చేయడం కష్టతరంగా మారుతోంది. గతంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.