
తిరువనంతపురం: శబరిమలలోని పొన్నాంబలమేడు కొండల్లో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. భక్తుల నామస్మరణతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. మకర జ్యోతిని దర్శించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అన్న శరణు ఘోషతో కొండ ప్రాంతం మార్మొగుతుంది. కోవిడ్ నేపథ్యంలో.. కరోనా నిబంధలను పాటిస్తూ భక్తులకు ఆలయ కమిటీ దర్శనం కల్పించింది. ఈనెల 20న తిరిగి ఆలయం మూసివేయనున్నారు.
చదవండి: ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి కన్నుమూత