darshanam
-
తొక్కిసలాట ఎఫెక్ట్: వైకుంఠ ద్వార దర్శనానికి భారీగా తగ్గిన భక్తులు
సాక్షి, తిరుపతి: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు భారీగా తగ్గారు. దశాబ్ద కాలంలో అత్యల్పంగా వైకుంఠ ద్వార దర్శనాలు జరిగాయి. తిరుపతి తొక్కిసలాట(Tirupati stampede)తో భక్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులను టీటీడీ(TTD) భయబ్రాంతులకు గురిచేయడంతో కూటమి ప్రభుత్వంపై భక్తుల్లో అనుమానాలు కలుగుతున్నాయి. 70 వేలు టోకెన్లు విడుదల చేయగా కేవలం 53 వేల మంది భక్తులే దర్శనాలు చేసుకున్నారు. టీటీడీ వైఫల్యంతో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు దక్కలేదు. పోలీసులు దురుసు ప్రవర్తనశ్రీనివాసం గెస్ట్‌హౌస్ వద్ద పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దర్శనానికి వచ్చే భక్తులపై పోలీసులు చేయి చేసుకున్నారు. భక్తుల పట్ల సంయమనం పాటించాలని చెప్పున్నా పోలీసులు వినడం లేదు. దర్శనం టికెట్లకు క్యూలైన్లోకి వెళ్లేవారిని అడ్డగించడంపై భక్తుడు నిలదీశాడు.శనివారం రాత్రి నుంచి రెండో విడత టోకెన్ల జారీ ప్రారంభమైంది. భయంభయంగానే.. మొదటి విడత వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన భక్తులను కలవరపాటుకు గురిచేస్తోంది. శనివారం నుంచి రెండో విడత టోకెన్ల జారీ చేస్తుండడంతో పలువురు క్యూలైన్లోకి వెళ్దామా? వద్దా? అనే సందిగ్ధంలో పడ్డారు. తిరుపతి నగరంలో శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు నాటి చేదు ఘటన గురించే చర్చించుకుంటున్నారు. తొక్కిసలాట ఘటన విషయంలో ప్రభు త్వం, టీటీడీ తీసుకున్న చర్యలపైనా విమర్శలు గుప్పిస్తున్నారు.ఇదీ చదవండి: ఏడు చేపల కథ! -
TTD : శ్రీవాణి, ఎస్ఈడీ టికెట్ల విడుదల తేదీల మార్పు
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్లోకి అనుమతిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు శ్రీవారిని 65,299 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,863 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.75 కోట్లు.మార్చి నెల శ్రీవాణి, ఎస్ఈడీ కోటా విడుదల తేదీలో మార్పుతిరుమల, 2024 డిసెంబర్ 20: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.అలాగే పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబరు 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరుగుతుంది.ఈ నేపథ్యంలో మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలను మార్పు చేయడమైనది.డిసెంబరు 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.డిసెంబరు 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తారు.ఈ మార్పును గమనించి టీటీడీ వెబ్ సైట్లో https://ttdevasthanams.ap.gov.in/home/dashboardలో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు తెలియజేయడమైనది. -
టీడీపీ నేతలకే తిరుమల వెంకన్న సేవలు
-
August 30: ఆధ్యాత్మిక సమాచారం..
శ్రీవారి దర్శనానికి 18 గంటలు..తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 19 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 76,772 మంది స్వామివారిని దర్శించుకోగా 30,293 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.82 కోట్లు సమరి్పంచారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.ఆగమోక్తంగా గురుదక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు..శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురుదక్షిణామూర్తికి గురువారం ఆగమోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గురుదక్షిణామూర్తికి పలు రకాల అభిõÙక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమరి్పంచారు. భక్తులు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.అప్పన్నకు స్వర్ణ పుష్పార్చన..సింహాచలం: సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఉదయం స్వర్ణపుష్పార్చన వైభవంగా జరిగింది. ఆలయ బేడా మండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను కొలువుదీర్చారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అషో్టత్తర శతనామావళి పూజ నిర్వహించారు.కనకమహాలక్షి్మకి త్రికాల పంచామృతాభిషేకం..డాబాగార్డెన్స్: శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా విశాఖలోని బురుజుపేట కనకమహాలక్ష్మి దేవస్థానంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు గురువారం 25వ రోజుకు చేరాయి. అమ్మవారికి విశేష పూజలు, త్రికాల పంచామృతాభిషేక సేవ, విశేష హోమాలు నిర్వహించారు. విశిష్ట శ్రావణలక్ష్మీ పూజలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు.ఘనంగా పైడితల్లి అమ్మవారి జాతర..కిర్లంపూడి: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని జపగతినగరంలో వేంచేసిన పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఆలయం వద్ద నాట్య ప్రదర్శన, కోలాటం వంటి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించారు. పండితులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.నేటితో ముగియనున్న వరలక్ష్మీ వ్రతాలు..సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోటలోని బాలత్రిపుర సుందరి సమేత చాళుక్య కుమార రామభీమేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న సామూహిక వరలక్ష్మీ వత్రాలు శుక్రవారంతో ముగియనున్నాయి. ఈ సామూహిక వ్రతాల్లో తమ పేర్లు నమోదు చేయించుకున్న మహిళలు ఉదయం 9 గంటలకు ఆలయానికి హాజరుకావాలన్నారు.ఘనంగా సామూహిక సత్య దత్త వ్రతాలు..పిఠాపురం: స్థానిక శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో శ్రావణ బహుళ ఏకాదశి సందర్భంగా గురువారం సామూహిక సత్య దత్త వ్రతాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామికి ప్రత్యేక అభిõÙకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సామూహిక సత్య దత్త వ్రతాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.నిత్యార్జిత కల్యాణం సేవా టికెట్ పెంపు.. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమలలోని శ్రీవారి నిత్యార్జిత కల్యాణం సేవా టికెట్ రుసుము సెపె్టంబరు ఒకటో తేదీ నుంచి పెరగనుంది. ప్రస్తుతం రూ.1,500గా ఉన్న ఈ టికెట్ ధరను రూ.2 వేలకు పెంచుతున్నటుŠట్ ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు గురువారం వెల్లడించారు. స్వామివారికి జరిగే నిత్య కల్యాణానికి ఎంతో విశిష్టత ఉంది. కోరిన కోర్కెలు తీరిన భక్తులు, కోర్కెలు తీరాలని మొక్కుకున్నవారు ఈ సేవలో ఎక్కువగా పాల్గొంటారు. ప్రస్తుతం సాధారణ రోజుల్లో 70 నుంచి 100 మంది, ప్రతి శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో 230 నుంచి 250 మంది వరకు దంపతులు ఈ సేవలో పాల్గొంటున్నారు. -
ఆధ్యాత్మిక సమాచారం
శ్రీవారి దర్శనానికి 14 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 14 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 71,153 మంది స్వామివారిని దర్శించుకోగా 25,863 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.32 కోట్లు సమరి్పంచారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 14 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. ముక్కంటి హుండీ ఆదాయం రూ.1.97 కోట్లు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయం రూ.1,97,72,140 వచి్చనట్లు ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఆలయ ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీలను ఆలయంలోని గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద లెక్కించారు. బంగారు 98 గ్రాములు, వెండి 605 కిలోలు, విదేశీ కరెన్సీ నోట్లు 233 వచ్చాయి. సింహగిరిపై రేపు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు సింహాచలం: శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈ నెల 30న సింహగిరిపై పెద్ద ఎత్తున సామూహిక వరలక్ష్మీవ్రతాలు నిర్వహించనున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి బుధవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. వ్రతాల్లో పాల్గొనే మహిళలకు పూజాసామగ్రి, ప్రతిమ, రవిక, ప్రసాదం దేవస్థానం ఉచితంగా అందిస్తుందన్నారు. శ్రీవారి క్షేత్రంలో నేత్రపర్వంగా ఉట్ల పండుగ ద్వారకాతిరుమల: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల చిన వెంకన్న దివ్య క్షేత్రంలో బుధవారం సాయంత్రం ఉట్ల పండుగ, స్వామివారి తిరువీధి సేవలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రాజాధిరాజ వాహనంపై ఉంచి అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి వాహనం ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. శ్రీవారి కల్యాణ మండపం వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన ఉట్టిని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు యువకులకు అందించారు. అనంతరం యువకులు దాన్ని ఉత్సహంగా కొట్టారు. 30న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ఆఖరి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈనెల 30న సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని అనివేటి మండపంలో ఆరోజు ఉదయం 9.30 గంటల నుంచి జరిగే ఈ వేడుకలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనాలని ఆయన కోరారు. కనుల పండువగా చెన్నకేశవుని కల్యాణం పెనగలూరు: అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం కొండూరులో నూతనంగా నిరి్మంచిన చెన్నకేశవస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. మూడు రోజులపాటు ప్రత్యేక యాగశాలలో వివిధ రకాల హోమాలు నిర్వహించి విగ్రహ ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా చెన్నకేశవ ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి వారి కల్యాణం కనుల పండువగా జరిపారు. వైభవంగా వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ కొత్తపేట: అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లిలో నూతనంగా నిరి్మంచిన శ్రీ, భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహాల ప్రతిష్ఠాపనను బుధవారం వైభవంగా నిర్వహించారు. తిరుపతిలో ప్రముఖ శిల్పులతో తయారుచేయించిన దేవతామూర్తుల విగ్రహాలను తీసుకువచ్చి సోమవారం నుంచి గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన నేమాని భాస్కరరామం పర్యవేక్షణలో ఆగమ శాస్త్ర పండితులు మూడు రోజుల పాటు విశేష పూజలు నిర్వహించారు. పంచ మఠాల్లో ప్రత్యేక పూజలు శ్రీశైలం: శ్రీశైల క్షేత్ర పరిధిలోని వీరశైవ జగద్గురు పరంపరకు సంబంధించిన పంచ మఠాల్లో ప్రతిష్టమైన లింగాలకు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చిన్న సిద్ధరామ శివాచార్య స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో క్షేత్రంలో ఉన్న ఘంటా మఠం, విభూతి, రుద్రాక్ష, భీమశంకర, సారంగధర మఠాల్లో విశేష అభిõÙకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆయా మఠాల్లో లోక కళ్యాణార్థం అభిõÙకాది అర్చనలు చేశామని స్వామి తెలిపారు. -
ఆధ్యాత్మిక సమాచారం
శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 76,910 మంది స్వామివారిని దర్శించుకోగా 30,320 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.26 కోట్లు సమరి్పంచారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.బ్రహ్మోత్సవాలను జయప్రదం చేద్దాం..కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకంలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌లు పేర్కొన్నారు. కాణిపాకం ఈవో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ద్వారకాతిరుమలలో కృష్ణాష్టమి శోభ ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న దివ్యక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మంగళవారం నేత్రపర్వంగా జరిగాయి. కొండపైన గోసంరక్షణశాలలో, అలాగే ఆలయ తూర్పు ప్రాంతంలోని సప్తగోకులంలో పెద్ద ఎత్తున భక్తులు గోవులకు పూజలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం శ్రీవారి క్షేత్రంలో ఉట్లు పండుగను వైభవంగా జరుపనున్నట్టు ఆలయ ఈఓ తెలిపారు. అప్పన్నకు విశేషంగా గరుడసేవ సింహాచలం: సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి మంగళవారం గరుడసేవ విశేషంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఆలయ కల్యాణ మండపంలో వెండి గరుడవాహనంపై వేంచేపుచేశారు. అషో్టత్తర శతనామావళి పూజ నిర్వహించారు. విశేష హారతులిచ్చారు. ఘనంగా శ్రావణలక్ష్మి పూజలు డాబాగార్డెన్స్: విశాఖ నగరంలోని బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా శ్రీలక్ష్మి పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకు శ్రీలక్ష్మి పూజలు ప్రారంభించారు. ఆదిత్యుని హుండీ ఆదాయం రూ.70.96 లక్షలు శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ హుండీ కానుకల ద్వారా రూ.70,96,186 ఆదాయం లభించినట్లు ఈఓ డీఎల్వీ రమేష్‌బాబు తెలిపారు. జూన్ 10 నుంచి ఈనెల 27 వరకూ మొత్తం 77 రోజులకు గాను ఈ మేరకు ఆదాయం లభించినట్లు ఆయన తెలిపారు. -
ఆధ్యాత్మిక సమాచారం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ లైన్ టీబీసీ వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 84,060 మంది స్వామివారిని దర్శించుకోగా 34,985 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.01 కోట్లు సమరి్పంచారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఆగమోక్తంగా మృత్యంజయస్వామికి ప్రత్యేక పూజలు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మృత్యుంజయస్వామికి సోమవారం ఆగమోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గణపతిపూజ, కలశ స్థాపన పూజలు చేశారు. అనంతరం స్వామివారికి చందనం, నారికేళ, పసుపు, కుంకుమ, విభూథి వంటి వాటితోఅభిõÙకాలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులుచెల్లించుకున్నారు. కనులపండువగా రాధాకృష్ణుల కల్యాణం రాపూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు సమీపంలోని మద్దెలమడుగులో ఉన్న రాధాసమేతర గోపాలకృష్ణమందిరంలో సోమవారం కృష్ణాష్టమినిపురస్కరించుకుని రాధా కృష్ణుల కల్యాణం రంగరంగవైభవంగా నిర్వహించారు.శ్రీమఠంలో గోకులాష్టమి వేడుకలు మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాతి్మక కేంద్రమైన కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో గోకులాష్టమి వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. శ్రీమఠం ఊంజల మంటపంలో అక్షోభ్య మఠం ఉప పీఠాధిపతి అక్షోభ్య రామప్రియ తీర్థులు ఆశీస్సులతో వేడుకలు నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడి వేషధారణలో కనువిందు చేశారు. శా్రస్తోక్తంగా గోపూజ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులంలో గోపూజ నిర్వహించారు. ప్రతినిత్యం ఆలయంలో ప్రాతఃకాల సమయంలో నిత్యసేవగా గోపూజ నిర్వహించబడుతున్నప్పటికీ, కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం నిత్యసేవతో పాటు విశేషంగా గోపూజ జరిపించారు. నేడు సింహగిరిపై కృష్ణాష్టమి సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మంగళవారం శ్రీకృష్ణాష్టమిని వైభవంగా నిర్వహించనున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ సంద«ర్భంగా సాయంత్రం 6 గంటల వరకే స్వామివారి దర్శనాలు భక్తులకు లభిస్తాయని పేర్కొన్నారు. నేడు అష్టదళ పద్మారాధన డాబాగార్డెన్స్ : ఉత్తరాంధ్ర కల్పవల్లి, విశాఖ వాసుల ఆరాధ్యదైవం కనక మహాలక్ష్మికి 108 స్వర్ణ పుష్పాలతో మంగళవారం అష్టదళ పద్మారాధన నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు నిర్వహించనున్న ప్రత్యేక పూజలో పాల్గొనదలచే భక్తులు రూ.1,116 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు 0891 2711725, 2566514లో సంప్రదించాలి. నేడు ద్వారకా తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు ద్వారకాతిరుమల: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈఓ తెలిపారు. బుధవారం క్షేత్రంలో ఉట్ల పండుగను, స్వామివారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పంచారామ క్షేత్రంలో భక్తుల కిటకిట సామర్లకోట: శ్రావణ మాసం సోమవారం పురస్కరించుకుని కాకినాడ జిల్లాలోని పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కిటకిటలాడారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న శివలింగానికి నీటితోను, పాలతోను స్వయంగా అభిషికాలు చేశారు. ధ్వజ స్తంభం, పెద్ద నంది, ఉప ఆలయాలు, మూల విరాట్లతో పాటు స్వామివారిని, అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. -
రూ.300 ఎస్ఈడీ నకిలీ టికెట్లతో మోసం
తిరుమల: ఏపీ టూరిజం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లతో మోసగిస్తున్న దళారుల ముఠాకు చెందిన ముగ్గురిని సోమవారం రాత్రి టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుమల టూటౌన్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. పాత నేరసుడు ∙అమృత యాదవ్, తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రూ.300 ఎస్ఈడీ టికెట్ స్కానింగ్ కౌంటర్లో పనిచేసే రుద్రసాగర్, అదే విభాగంలో గతంలో పనిచేసిన నవీన్ తేజ, నారాయణ అనే వారితో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. చెన్నైకి చెందిన మోహన్ రాజ్ అనే భక్తుడు సోమవారం దళారి అమృత యాదవ్‌ను టికెట్ల కోసం సంప్రదించారు. అతను 4 పాత∙టికెట్లు కలర్ జిరాక్స్ తీసి సీరియల్ నంబరు మార్చి రూ.11వేలకు విక్రయించాడు. క్యూ కాంప్లెక్స్‌లో తనిఖీల్లో ఆ టికెట్లు నకిలీవని తేలింది. స్కానింగ్ కేంద్రంలో పనిచేసే రుద్రసాగర్ నకిలీ ఎస్ఈడీ రూ.300 టికెట్లను స్కానింగ్ చేసినట్లు నటిస్తూ మోసగిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు రుద్రసాగర్, నవీన్ తేజ, ట్రావెల్ డ్రైవర్ పెరియస్వామిని అదుపులోకి తీసుకున్నారు. -
గుట్టపైనే అన్ని సేవలు..!
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్టపైనే అన్ని సేవలు పునరుద్ధరించాలని భక్తజనులు కోరుతున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా భక్తుల నుంచి వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన ఆలయ విస్తరణ, అభివృద్ధితో భక్తులు కోరుకునే మహిమాన్విత పవిత్ర సేవలను కొండపైనుంచి కిందికి తరలించారు. దీంతో పుణ్యక్షేత్రంలో ప్రాశస్త్యం లోపిస్తుందని భక్తులు అంటున్నారు. దీనికి తోడు కొండపైన వసతుల లేమి భక్తులకు ఇబ్బందిగా మారింది. అన్నీ గుట్ట కిందనే...: కొండపైన ఆలయ విస్తరణ, అభివృద్ధికి ముందు యాదగిరిగుట్టలో భక్తులకు అన్ని వసతులు కొండపైనే ఉండేవి. వేలాది మంది భక్తులు ఎంతో దూరం నుంచి వచ్చి అన్ని రకాల సేవలను కొండపైనే పొందేవారు. రాత్రి నిద్ర గుట్టపైనే చేసేవారు. ప్రధానంగా కల్యాణకట్ట(తలనీలాలు సమరి్పంచడం), సత్యనారాయణస్వామి వ్రతాలు, విష్ణుపుష్కరిణి (స్నాన గుండం), రాత్రి నిద్ర చేయడం, అన్నప్రసాద వితరణ సేవలను కొండకిందకు మార్చారు. దీంతో కొండపైన సేవలందకపోవడంతో భక్తి భావం కొరవడిందంటున్నారు. డార్మెటరీ హాల్ నిర్మాణం: కొండపైన గతంలో బాలాలయం ఉన్నచోట డార్మెటరీ హాల్ నిర్మిస్తే రాత్రి నిద్ర చేయవచ్చని భక్తులు కోరుతున్నారు. కొండపైన నిర్మించిన రెండు భవనాల్లో అన్నదానం, సత్యనారాయణస్వామి వ్రతాలు కొనసాగించవచ్చు. కొండపైన మరో చోట కల్యాణ కట్ట ఏర్పాటు చేసి ఎంతో విశి ష్టత కలిగిన విష్ణు పుష్కరిణిలో భక్తుల స్నానాలు చేసేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. యాదాద్రి క్షేత్రంపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం భక్తుల మనోభావాలను గౌరవించాలని కోరుతున్నారు. భక్తుల వసతులకు ప్రాధాన్యం ప్రభుత్వం భక్తుల మనోభావాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. కొండపైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు అధికారులతో సమీక్ష నిర్వహించాం. రూ.20 కోట్లతో డార్మెటరీ భవనం నిర్మించాలని నిర్ణయించాం. కొండపైన వసతులు కల్పిస్తాం. ఆలయ ప్రాశస్త్యం కొనసాగిస్తాం. – బీర్ల అయిలయ్య, ఆలేరు ఎమ్మెల్యే తలనీలాల సమర్పణ కొండపైనే ఉండాలి యాదాద్రి పునరి్నర్మాణం తర్వాత మొదటిసారిగా దర్శించుకున్నాం. పాతగుడి ఉన్నప్పుడు ఒకసారి వచ్చాం, అప్పుడు తలనీలాలు గుడిపైనే తీసేవారు. ఇప్పుడు మాత్రం తలనీలాలను కొండ కింద తీస్తున్నారు. తలనీలాలు అర్పించి కొండపైకి దర్శనానికి రావడానికి ఇబ్బందికరంగా ఉంది. దేవుని కొండపైన తలనీలాలను ఏర్పాటు చేస్తేనే స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ భక్తులకు కావాల్సిన కనీస వసతులు కనబడడం లేదు. బాత్రూమ్లు కూడా సరిగ్గా లేవు. – మేతరి దశరథ, భక్తుడు, నిజామాబాద్ ప్రాంగణంలో నిద్రిస్తే ప్రశాంతత ఉండేది లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం వస్తాం. గతంలో దర్శనానికి వచ్చినప్పుడు నారసింహుడి సన్నిధిలో కొండపైన రాత్రి వేళల్లో నిద్రపోయే వాళ్లం. మాకు ఆధ్యాతి్మక భావన కలిగేది. ఇప్పుడు కొత్త గుడి కట్టాక అన్ని వసతులు మార్చేశారు. అసలు కొండపైన నిద్రపోవడానికి అనుమతి లేకుండా పోయింది. కిందనే నిద్రించి పైకి రావడానికి అవస్థలు పడుతున్నాం. అసలే నడవలేని స్థితిలో ఉన్న నాలాంటి వారు కింద బస చేసి, మళ్లీ పైకి రావాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. – ఎస్.బుచ్చమ్మ, భక్తురాలు, హైదరాబాద్ కొండపైనే పుష్కరిణి ఉండాలి గుట్టలో రాత్రి బస చేశాం. ఉదయం ఆలయానికి బస్సులో పోమ్మని చె ప్పారు. బస్సెక్కాక మమ్మల్ని ఆల య బస్టాప్ దగ్గర దింపి గుండంకిందనే ఉంటుందని, అక్కడే స్నానం చేయాలని సూచించారు. దీంతో గుండం వద్దకి వెళ్లి స్నా నాలు చేసి అనంతరం కొండపైకి వెళ్లి దర్శనాలు పూర్తిచేసుకున్నాం. పుష్కరిణి కింద ఉండటంతో చాలా అవస్థలు పడ్డాం. గతంలో మాదిరిగా కొండపైనే పుష్కరిణి ఉంటే అక్కడే స్నానం చేసి, దైవ దర్శనానికి వెళ్తే పుణ్యం దక్కుతుంది. – సత్యనారాయణ. భక్తుడు, శంషాబాద్ -
తిరుమల: సర్వదర్శనానికి 18 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు నేటితో ముగియనున్నాయి. దీంతో రేపటి నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరిస్తారు. ఇక నిన్న(సోమవారం, ఆగష్టు 28) 68,263 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లుగా తేలింది.తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 28, 355గా తేలింది. ద్వారకాతిరుమలలో పవిత్రోత్సవాలు ఏలూరు: నేటి నుంచి ద్వారకాతిరుమలలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. 30వ తేదీన పవిత్రాదివాసం, 31వ తేదీన పవిత్రావరోహణ నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తారు. -
TTD: శ్రీవారి ఉచిత దర్శనానికి 18 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ గత రెండ్రోజులతో పోల్చితే కొద్ది మేర తగ్గింది. టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి(ఉచిత) 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 19 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీ వేంకటేశ్వరస్వామిని 75,871 మంది దర్శించుకున్నారు. అదే సమయంలో 32,859 మంది తలనీలాల మొక్కు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.3.27 కోట్ల ఆదాయం లభించింది. 🙏 అప్పలాయగుంటలో నేటి నుంచి ప్రసన్న వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. మిధున లగ్నంలో ధ్వజారోహణం తో ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాలు. నేటి నుంచి జూన్ 8 వరకు వైభవంగా జరగనున్నాయి అప్పలాయగుంట బ్రహ్మోత్సవాలు. 🙏 నారాయణవనం శ్రీపద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం తో ప్రారంభం అయ్యాయి. ఈరోజు నుంచి జూన్ 8 వరకు నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. -
శ్రీ వారి సేవలో శాకుంతలం మూవీ టీమ్
-
విశిష్ట దర్శనానికి వేళాయే..
-
ఆర్టీసీ టికెట్ కొంటే శ్రీవారి దర్శన భాగ్యం
సాక్షి, హైదరాబాద్: తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం అంత సులభం కాదు. నిత్యం వేలాదిమంది భక్తులు పోటెత్తుతుంటారు. సిఫారసు లేఖలు పట్టుకుని పరుగులు పెడుతుంటారు. ఆ ప్రయత్నంలో సఫలమయ్యేవారు కొందరే.. మిగతావారికి మిగిలేది నిరాశే. మరి అలాంటి తరుణంలో దర్శన టోకెన్లు సిద్ధంగా ఉన్నా, భక్తులు రాక వృథా అవుతున్నాయంటే నమ్మశక్యం కాకున్నా నిజమే. నిత్యం సగటున దాదాపు 600 టోకెన్లు భక్తులు తీసుకోక మిగిలిపోతున్నాయి. తిరుమల వెంకన్న దర్శనాన్ని సులభంగా కల్పించాలన్న ఉద్దేశంతో ఇటీవల తెలంగాణ ఆర్టీసీ బృహత్తర ప్రయత్నంతో ప్రయాణికుల ముందుకొచ్చింది. తిరుపతి వెళ్లే భక్తులు, ఆన్లైన్ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్ బుక్ చేసుకుంటే వారికి తిరుమల శ్రీవారి దర్శన టోకెన్‌ను కూడా అందుబాటులో ఉంచుతోంది. ఆసక్తి ఉన్నవారు రూ.300 విలువైన ఆ దర్శన టోకెన్‌ను పొంది ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీనివాసుని దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలోచన వచ్చిందే తడువు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకుని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పలుమార్లు చర్చించి దానికి ఆమోదం కల్పించారు. ఈమేరకు టీటీడీ నిత్యం తెలంగాణ ఆర్టీసీకి వేయి టోకెన్లు అందిస్తోంది. ఆన్లైన్లో బస్ టికెట్ బుక్ చేసుకునేప్పుడే, టీటీడీ టోకెన్ కావాలా అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేసి ఆ మేరకు ఛార్జి కూడా చెల్లించి ఆధార్ నమోదు చేస్తే బార్‌కోడ్‌తో ఉన్న టోకెన్ అందుతుంది. ఆ రోజు తిరుపతి వెళ్తే బస్టాండ్‌లో ఆర్టీసీ సిబ్బంది దగ్గరుండి మరీ వారికి కొండమీదకు తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయిస్తారు. దర్శన టోకెన్ కోసం నానా ప్రయత్నాలు చేయాల్సిన శ్రమ లేకుండా సులభంగా వేంకటేశ్వరుడి దర్శనం కలుగుతుంది. మిగిలిపోతున్న టోకెన్లు గత కొన్ని రోజులుగా సగటున రోజుకు 400 టోకెన్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. ఆదిసోమవారాల్లో మాత్రం ఆ సంఖ్య 800 నుంచి 950 మేర ఉంటోంది. మిగతా రోజుల్లో దాదాపు 600 టోకెన్లు మిగిలిపోతున్నాయి.ఈనెల 1వ తేదీన 330, 2వ తేదీన 273, 3న 404, 4న 370 మాత్రమే అమ్ముడయ్యాయి. ఆదివారం అయిన 6వ తేదీన 882, 7న 607 అమ్ముడయ్యాయి. వారం రోజుల ముందే బుక్ చేయాల్సి రావటంతో.. టీటీడీ వారం రోజుల ముందు దర్శన టోకెన్లు విడుదల చేస్తోంది. అంటే తిరుమల వెళ్లాలనుకున్న రోజుకు వారం ముందు ఆర్టీసీ బస్ టికెట్తోసహా దర్శన టోకెన్‌ను రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రయాణికులకు బస్ టికెట్ విషయంలో రెండుమూడు రోజుల ముందు మాత్రమే టికెట్ రిజర్వ్ చేసుకునే అలవాటు ఉంది. రైలు టికెట్ కోసం నెల రోజుల ముందు ప్రయత్నించేవారు కూడా బస్ టికెట్లు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయన్న ఉద్దేశంతో రెండుమూడు రోజుల ముందు రిజర్వ్ చేసుకుంటుంటారు. ఇక్కడే సమస్య ఎదురవుతోంది. వారం కంటే తక్కువ వ్యవధిలో బుక్ చేస్తే తిరుమల దర్శన టోకెన్ ఉండదు. వారం ముందే బుక్ చేసుకోవాలన్న విషయం ఇంకా జనంలోకి బలంగా చేరలేదు. దానిపై చాలినంత ప్రచారం లేదు. నెలరోజులు ముందు నుంచి ప్రయత్నిస్తున్నా స్వామి దర్శన టోకెన్ దొరకని పరిస్థితిలో.. టీఎస్ఆర్టీసీ వద్ద నిత్యం వేయి దర్శన టోకెన్లు ఉంటున్నా.. చాలామంది భక్తుల దరి చేరటం లేదు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ కోరుతోంది. -
శ్రీశైలంలో భక్తులకు దశవిధహారతుల దర్శనం
శ్రీశైలం టెంపుల్: పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం. ఈ మాసంలో శివుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. కార్తీకమాసోత్సవాల్లో భాగంగా ప్రతి సోమవారం శ్రీగిరిలో లక్షదీపోత్సవం, ఆలయ పుష్కరిణి వద్ద దశవిధ హారతుల కార్యక్రమాన్ని ఆలయాధికారులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే దశవిధహారతులు వాటి వల్ల కలిగే పుణ్య ఫలం గురించి శ్రీశైల ఆలయ ప్రధాన అర్చకులు జె.వీరభద్రయ్యస్వామి మాటల్లోనే.. ఓంకార హారతి : పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరమే ఓంకారం. ఓంకారహారతిని దర్శించడం వలన కష్టాలన్నీ నివారించబడి సకల శుభాలు కలుగుతాయి. నాగహారతి: నాగహారతిని దర్శించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయి. సంతానం కలుగుతుంది. త్రిశూలహారతి: త్రిశూలహారతిని దర్శించడం వలన అకాలమరణం తొలగిపోతుంది. గ్రహదోషాలు నివారించబడతాయి. నందిహారతి: నందిహారతిని దర్శించడం వలన భయం, దుఃఖము ఉండదు. ఆనందం, ఉత్సాహం లభిస్తాయి. సింహహారతి: సింహహారతిని దర్శించడం వలన శత్రుబాధలు తొలగుతాయి. మనోధైర్యం కలుగుతుంది. సూర్యహారతి: సూర్యహరతిని దర్శించడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. దీర్ఘాయుష్షు లభిస్తుంది. చంద్రహారతి: చంద్రహారతిని దర్శించడం వలన మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ ద్వేషాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుంభహారతి: కుంభహారతిని దర్శించడం వలన కొరుకున్న కోరికలు నెరవేరుతాయి. సంపదలు కలుగుతాయి. నక్షత్రహారతి: నక్షత్రహారతిని దర్శించడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది. కర్పూర హారతి: కర్పూరహారతిని దర్శించడం వలన పాపాలన్నీ తొలగిపోతాయి. యజ్ఞఫలంతో పాటు అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. (క్లిక్ చేయండి: హరిహరులకు ఎంతో ప్రీతికరం.. కార్తీక మాసం) -
మేల్ చాట్ వస్త్ర సేవ ఎప్పుడు ప్రారంభమైంది?
శ్రీవారి ఆలయంలో స్వామివారికి నిర్వహించే సేవలు అన్నింటిలోనూ విశిష్టమైనది ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేక సేవ. ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఒక మరపురాని దివ్యానుభూతిని కలిగిస్తుంది అంటే అతిశయోక్తి కాదేమో. ఆలయంలో స్థలాభావం దృష్ట్యా ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేక సేవలో ప్రత్యక్షంగా పాల్గొనే మహద్భాగ్యం 130 నుంచి 140 మంది భక్తులకు మాత్రమే లభిస్తుంది. అభిషేకం జరిగే సమయంలో నిత్య కళ్యాణ శోభితుడైన స్వామివారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది. సాధారణంగా స్వామివారిని పుష్పాలతో, ఆభరణాలతో, పట్టువస్త్రాలతో అలంకరణ చేసిన తర్వాతనే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అభిషేక సేవ సమయంలో మాత్రం ఇవేమీ లేకుండా స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది. అది శ్రీవారి భక్తులకు ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పుకోవచ్చు. 1980 కి పూర్వం స్వామి వారికి ఇప్పటిలా ప్రతి శుక్రవారం నూతన మేల్ చాట్ వస్త్రంతో అలంకరణ జరిగేది కాదు. ఏడాదికి నాలుగు సందర్భాలలో మాత్రమే స్వామివారికి నూతన పట్టువస్త్రాలను సమర్పించేవారట. దీనితో ప్రతి శుక్రవారం నూతన పట్టువస్త్రాన్ని స్వామి వారికి సమర్పించాలని అప్పటి ఈవో పీవీఆర్ కే ప్రసాద్ తలచారట. ఇది టీటీడీకి ఆర్థికంగా కాస్త భారమైన అంశం కావడంతో భక్తుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారట. అప్పట్లోనే స్వామివారి అలంకరణకు వినియోగించే వస్త్రం విలువ ఎనిమిదివేల రూపాయలు కావడంతో టీటీడీ నూతనంగా 8 వేల రూపాయలు చెల్లించిన భక్తులు పాల్గొనేందుకు మేల్ చాట్ వస్త్రం టికెట్లను ప్రారంభించింది. మేల్ చాట్ వస్త్రం టికెట్లు కలిగిన భక్తులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో పాటు అత్యంత సమీపం నుంచి స్వామివారి అభిషేక దర్శనం వీక్షించగలుగుతారు. ఈ సేవను ప్రవేశపెట్టిన మొదటి సంవత్సరంలో ప్రతి శుక్రవారం ఎవరో ఒక భక్తుడు మాత్రమే ముందుకు వచ్చే సంప్రదాయం ఉండగా అటు తర్వాత క్రమంగా మేల్ చాట్ వస్త్రానికి ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ఎంతలా అంటే ఒకదశలో మేల్ చాట్ వస్త్రాన్ని ముందస్తుగా కొన్ని సంవత్సరాల ముందుగానే భక్తులు కొనుగోలు చేసేవారు. ఒకే కుటుంబానికి చెందిన వారే కొన్ని వందల టికెట్లను కొనుగోలు చేయడంతో టీటీడీ పునరాలోచనలో పడింది. దీంతో ఏడాదికి ఒక్కో కుటుంబానికి ఒక టికెట్నే పరిమితం చేస్తూ మిగిలిన టికెట్లను రద్దు చేసి వాటిని లక్కీడిప్ విధానంలో భక్తులకు కేటాయించే విధానాన్ని టీటీడీ 2009 నుంచి ప్రారంభించింది. (క్లిక్ చేయండి: ఆనతినీయరా స్వామీ... నిత్య హారతికి) -
శ్రీనివాసుని ఏ వారం దర్శించుకుంటే ఏ ఫలితం...
అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తారు భక్తులు. నిత్యం వేలాది భక్తులు శ్రీనివాసుని దర్శనార్థం తిరుమలకు తరలి వస్తుంటారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడిని కళ్లారా దర్శించుకోవాలన్నది భక్తులందరి కోరిక. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులు ఏడుకొండలకు చేరుకుంటారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండి, క్షణకాలం మాత్రమే లభించే శ్రీవారి దివ్యమంగళ రూప దర్శనం కోసం తహతహలాడతారు. కేవలం క్షణమైనా సరే, శ్రీవారి దర్శనం దక్కితే చాలు తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తారు. ఇదివరకు వారాంతంలో తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండేది. మంగళ, బుధవారాలలో భక్తుల తాకిడి అతి తక్కువగా ఉండేది. గురువారం నుంచి భక్తుల రద్దీ క్రమంగా పుంజుకుని శుక్ర, శని, ఆదివారాల్లో బాగా పెరిగేది. తిరిగి సోమవారం నుంచి కాస్త తగ్గుముఖం పట్టేది. రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతూ వస్తూండడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు రోజులతో సంబంధం లేకుండా, ప్రతిరోజూ వేలాదిగా తరలి వస్తున్నారు. దీంతో వారాంతం స్థాయిలో కాకున్నా, మిగిలిన రోజుల్లో కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటోంది. శ్రీవారి ఆలయంలోని పరిస్థితుల కారణంగా ఏరోజు దర్శనం చేసుకుంటే, ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయన్న అంశంపై భక్తులు దృష్టి పెట్టకుండా, స్వామివారి దర్శనభాగ్యం దక్కితే చాలన్నట్లుగా ఎప్పుడు కుదిరితే అప్పుడే భక్తులు వస్తున్నారు. అయితే, శ్రీవారిని ఏ రోజు దర్శించుకుంటే, ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం... శ్రీనివాసుడిని ఆదివారం దర్శించుకుంటే రాజానుగ్రహం, ప్రభుత్వాధి నేతల దర్శనం, అధికార కార్యానుకూలత, శత్రునాశనం, నేత్ర, శిరోబాధల నుంచి ఉపశమనం వంటి ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. సోమవారం శ్రీవారిని దర్శించుకుంటే, స్త్రీసంబంధంగా పనుల సానుకూలత, తల్లికి, సోదరీమణులకు శుభం, వారి నుంచి ఆదరణ, భార్యతో అన్యోన్యత కలుగుతాయి. పౌర్ణమినాడు గరుడవాహనంపై శ్రీవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మంగళవారం శ్రీవారిని దర్శించుకుంటే భూమికి సంబంధించిన వ్యవహారాలలో కార్యసిద్ధి, భవన నిర్మాణ పనులకు అవరోధాలు తొలగి, కార్యానుకూలత కలుగుతాయి. బుధవారం దర్శించుకుంటే విద్యాప్రాప్తి, విదేశీయానం, సామాజిక గౌరవం లభిస్తాయి. గురువారం దర్శించుకుంటే ఉత్తమ జ్ఞానలాభం, వాక్శుద్ధి, గురువుల ఆశీస్సులు లభిస్తాయి. శుక్రవారం దర్శించుకుంటే సమస్త భోగభాగ్యాలు, వాహన సౌఖ్యం, ఇష్టకార్యసిద్ధి వంటి ఫలితాలు కలుగుతాయి. ఇక శనివారం శ్రీవారిని దర్శించుకుంటే రుణపీడ, ఈతిబాధలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి. -
దర్శనానికి మూడు గంటల సమయం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్‌తో పాటు వివిధ రాష్ట్రాల ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఉదయం నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. సుమారు 30 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాలకు గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. వివిధ పూజల ద్వారా రూ.33,81,486 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
తిరుమల: భక్తులకు గుడ్ న్యూస్
తిరుమల: దాదాపు రెండేళ్ల తర్వాత వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తుల ప్రత్యేక దర్శనాలను టీటీడీ పునరుద్ధరించింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్లైన్లో ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల చేసింది. టికెట్లు పొందిన భక్తులకు శనివారం ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. శ్రీవారి ఆలయం పక్కనున్న తిరుమల నంబి ఆలయం వద్ద ప్రత్యేక క్యూ ఏర్పాటు చేసింది. అలాగే రాంభగీచా నుంచి ప్రత్యేక క్యూ వరకు వెళ్లేందుకు శ్రీవారి సేవకులతోపాటు బ్యాటరీ వాహనాలు, వీల్‌చైర్స్‌ను ఏర్పాటు చేసింది. రెండేళ్ల తర్వాత శ్రీవారిని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం అర్ధరాత్రి వరకు 75,775 మంది స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే 36,474 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో భక్తులు రూ.3.70 కోట్ల మేర కానుకలు వేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తీసుకురావాలని కోరారు. మరోవైపు తిరుమలలో కోవిడ్ కారణంగా మూసివేసిన టీటీడీ ఉచిత అన్నప్రసాద కేంద్రాలు తిరిగి ఆదివారం నుంచి ప్రారంభమయ్యా యి. కాగా, క్యూలైన్లలో కూడా త్వరలోనే అన్నప్రసాదం అందించనున్నట్లు సమాచారం. -
రాజన్న దర్శనం.. భక్తుల వద్ద హోంగార్డు చేతివాటం
వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రధాన ద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ప్రదీప్ భక్తుల నుంచి డబ్బు తీసుకుని నేరుగా భారీకేడ్ జరిపి ఆలయంలోకి అనుమతించిన వైనం సెల్‌ఫోన్ కెమెరాకు చిక్కింది. ఎస్పీఎఫ్ సిబ్బంది ఈ విషయాన్ని ఈవో రమాదేవి దృష్టికి తీసుకెళ్లారు. సదరు హోంగార్డుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈవో ఆదేశించారు. (చదవండి: మంత్రుల ఆదేశాలు బేఖాతర్.. కోళ్లను, మేకలను ఎక్కడపడితే అక్కడే) -
శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం
తిరువనంతపురం: శబరిమలలోని పొన్నాంబలమేడు కొండల్లో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. భక్తుల నామస్మరణతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. మకర జ్యోతిని దర్శించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అన్న శరణు ఘోషతో కొండ ప్రాంతం మార్మొగుతుంది. కోవిడ్ నేపథ్యంలో.. కరోనా నిబంధలను పాటిస్తూ భక్తులకు ఆలయ కమిటీ దర్శనం కల్పించింది. ఈనెల 20న తిరిగి ఆలయం మూసివేయనున్నారు. చదవండి: ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి కన్నుమూత -
యాదాద్రిలో పూజవేళల్లో మార్పులు
సాక్షి, యాదగిరిగుట్ట (నల్లగొండ): నూతన సంవత్సరానికి యాదాద్రి ఆలయం లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలి పారు. యాదాద్రి కొండపైన ఉన్న తన కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జనవరి 1వ తేదీన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందన్నారు. ఇందు కోసం పూజల వేళల్లో మార్పులు చేశామని వెల్లడించారు. ఉదయం 3గంటలకు ఆలయాన్ని తెరిచి రాత్రి 9.45 గంటలకు ద్వార బంధనం చేయనున్నట్లు చెప్పా రు. భక్తుల కోసం 100 గ్రాముల లడ్డూలు, అభిషేకం లడ్డూలు మొత్తం కలిపి 60 వేలు తయారీ చేసి అందుబాటులో ఉంచుతామని వివరించారు. అలాగే 13న వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు స్వామివారిని దర్శించుకునేందు కు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అదే రోజున అధ్యయనోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. పాతగుట్టలోనూ నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశికి ఏర్పా ట్లు చేస్తామన్నారు. సమావేశంలో ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు పాల్గొన్నారు. -
కోవిడ్ ఎఫెక్ట్: 90 రోజుల వరకు శ్రీవారి దర్శన అవకాశం
సాక్షి, తిరుమల: ఆన్లైన్లో రూ.300 టికెట్ బుక్ చేసుకుని ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు తిరుమల శ్రీవారి దర్శనానికి రావాల్సిన భక్తులు.. కోవిడ్ కారణంగా రాలేని పరిస్థితుల్లో ఉంటే వచ్చే 90 రోజుల వరకు వారు దర్శన అవకాశాన్ని వినియోగించుకోవచ్చని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ కేసులు పెరిగిన నేపథ్యంలో టీటీడీ పలు నిర్ణయాల ను తిరిగి అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే తిరుపతిలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీని నిలిపేసింది. దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తిరుమలలో దివ్యప్రబంధ పారాయణం రామానుజాచార్యుల వారి 1,005వ అవతార మహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల పెద్దజీయర్ మఠంలో ఆదివారం రామానుజ నూట్రందాది దివ్యప్రబంధ పారాయణాన్ని నిర్వహించారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. మానవాళికి కరోనా ముప్పు తొలగించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టీటీడీ చేపడుతోన్న కార్యక్రమాల్లో భాగంగా ఈ పారాయణాన్ని నిర్వహించారు. పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాములు, వారి శిష్యబృందం, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి ఆచార్య కె.రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం
-
రేపటి నుంచి తిరుమల శ్రీవారి దర్శనం
సాక్షి, తిరుమల: ట్రయల్ రన్ దర్శనంలో భాగంగా బుధవారం శ్రీవారిని 7200 మంది స్థానికులు దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. నేడు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 20 85 లక్షలు వచ్చినట్లు టీటీడీ పేర్కొంది. ఇక రేపటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపింది. కంటైన్మెంట్, రెడ్ జోన్లలో ఉన్నవారు రావొద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. అలిపిరి వద్ద భక్తులకు థర్మల్ స్ర్కీనింగ్ చేయనున్నట్లు పేర్కొంది. భక్తుల్లో ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఉంటే క్వారంటైన్‌కు పంపుతామని టీటీడీ అధికారులు తెలిపారు. ఉదయం 6:30 నుంచి రాత్రి 7:30 వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా పూర్తైందని, ఆన్లైన్లో 60 వేల టికెట్లను 30 గంటల్లో భక్తులు కొనుగోలు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అదే విధంగా ఉదయం 6:30 నుంచి గంటపాటు వీఐపీలు శ్రీవారిని దర్శించుకోవచ్చని టీటీడీ పేర్కొంది. లాక్డౌన్ నింబంధనలు పాటిస్తూ సోమవారం నుంచి ఆలయాలు తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
కొనసాగుతున్న శ్రీవారి దర్శనాల ట్రయల్ రన్
సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనాల ట్రయల్ రన్ రెండో రోజు ప్రారంభమయింది. నేడు కూడా టీటీడీ ఉద్యోగులతో రాత్రి 7 గంటల వరకు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. నిన్న శ్రీవారిని 6,360 మంది దర్శించుకోగా, నేడు మరో ఆరువేల మంది టీటీడీ ఉద్యోగులు దర్శించుకోనున్నారు. రేపు స్థానికులకు అవకాశం కల్పించనున్నారు. 11 నుంచి సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించేలా టీటీడీ యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. సోమవారం నుంచి స్వామివారి దర్శనం పునఃప్రారంభం కాగా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ముందుగా దర్శించుకున్నారు. ఆలయంలో టీటీడీ అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టింది. క్యూలైన్లలో నాలుగు చోట్ల శానిటైజర్లు ఏర్పాటు చేశారు. (దర్శనానికి వేళాయె) దర్శన క్యూలైన్లతో పాటు అన్న ప్రసాద కేంద్రంలో కూడా ఫుట్ ఆపరేటడ్ కుళాయిలను టీటీడీ ఏర్పాటు చేసింది. శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించే భక్తులు నాన్ ఆల్కహాలిక్ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు దగ్గరగా విధులు నిర్వహించే సిబ్బందికి పీపీఈ కిట్లు పంపిణీ చేయడంతో పాటు, ప్రతి రెండు గంటలకు ఒకసారి లడ్డూ ప్రసాదాల విక్రయ కౌంటర్లను మార్చేవిధంగా చర్యలు చేపట్టారు. టీటీడీ ఆలయ పరిసరాలు, దర్శన క్యూలైన్లు, లడ్డూ కౌంటర్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో ప్రతి రెండు గంటలకు శానిటైజ్ చేస్తున్నారు భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టలో పీపీఈ కిట్లతో క్షురకులు విధులు నిర్వహిస్తున్నారు. భక్తులు భౌతికదూరం పాటించేలా బస్టాండ్ వద్ద ఏర్పాట్లు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాలైన వకుళామాత, యోగ నరసింహస్వామి దర్శనాలను నిలిపివేశారు. తిరుమలలోని దర్శనీయ ప్రదేశాలైన శిలాతోరణం, శ్రీవారి పాదాలు, పాపవినాశనం, జపాలి, ఆకాశగంగకు అనుమతి లేదు. కాణిపాకంలో రెండో రోజు ట్రయల్ రన్ చిత్తూరు: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నేడు రెండో రోజు ట్రయల్ దర్శనాలు కొనసాగుతున్నాయి. సోమవారం 3100 మంది స్వామివారిని దర్శించుకున్నారు.నేడు ఉద్యోగులు,స్థానికులు, ఉభయ దారులను దర్శనానికి అనుమతించనున్నారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకు ప్రమాణాలు చేయించడం లేదని, స్వామివారికి నిర్వహించే అర్జిత సేవలకు 30 శాతం భక్తులను అనుమతి ఇస్తామని ఆలయ అధికారులు తెలిపారు. -
తిరుమల శ్రీవారి దర్శనం షురూ
-
తిరుమలలో నేటి నుంచి దర్శనాలు పునఃప్రారంభం
-
తిరుమల శ్రీవారి దర్శనం షురూ
శ్రీవారి దర్శనభాగ్యం కోసం వేయి కనులతో ఎదురుచూస్తున్న భక్తులకు ఇది నిజంగా శుభవార్తే. వారి ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన తిరుమల ఏడుకొండల వాడి దర్శనం సోమవారం నుంచి పునః ప్రారంభం కానుంది. సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లాక్డౌన్ కారణంగా దాదాపు రెండున్నర నెలల పాటు ఆలయం మూతపడిన విషయం విదితమే. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ట్రైల్ రన్ నిర్వహించనున్నారు. టీటీడీ ఉద్యోగులు, స్థానికులను దర్శనానికి అనుమతించనున్నారు. 11వ తేదీ నుంచి సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించేలా టీటీడీ యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలతోనే.. కరోనా వైరస్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. కచ్చితంగా భౌతికదూరం పాటించాల్సిన ఆవశ్యకత ఉండడంతో క్యూలలో ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికీ ఆరు అడుగుల దూరం ఉండేలా మార్కింగ్ వేశారు. తప్పనిసరిగా మాసు్కలు, గ్లౌజులు ధరించేలా నిబంధనలు విధించారు. గంటకు 500 మంది భక్తులకు మాత్రమే దర్శనం కలి్పంచనున్నారు. ట్రైల్ రన్ కింద టీటీడీ ఉద్యోగులను రెండు రోజులు, ఒక రోజు తిరుమల స్థానికులను దర్శనానికి అనుమతించనున్నారు. దర్శనం సమయంలో ఎదురయ్యే లోటుపాట్లను గుర్తించి, వాటిని సరిచేసుకుని 11వ తేదీ నుంచి సాధారణ భక్తులను అనుమతించనున్నారు. ప్రతిరోజూ ఆరువేల మందికి మాత్రమే దర్శనం భాగ్యం కలగనుంది. ఉదయం 6.30 గంటలకు స్వామివారి దర్శనాన్ని ప్రారంభించి గంట పాటు వీఐపీ బ్రేక్ దర్శనానికి అనుమతించి, అటు తర్వాత సాయంత్రం వరకు సామాన్య భక్తులను అనుమతించనున్నారు. తీర్థ ప్రసాదాలు రద్దు శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాలలో దర్శనానికి భక్తులను అనుమతించకూడదని నిర్ణయించడంతో పాటు తీర్థం, శఠారీలను కూడా టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు ముందుగానే టైంస్లాట్ టోకెను పొందితేనే తిరుమలకు టీటీడీ అనుమతిస్తుంది. ఇందుకోసం అలిపిరి వద్ద ప్రతి నిత్యమూ 3 వేల సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను జారీ చేయనుంది. భక్తులు ముందురోజే టోకెన్లను పొందేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ కు సంబంధించి ప్రతి నిత్యమూ 3 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 8వ తేదీ నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి తేనుంది. భక్తుడు దర్శనం స్లాట్‌ను బుక్ చేసు కు నే సమయంలోనే తిరుమలలో గదిని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. గదికి ఇద్దరు భక్తులు మాత్రమే ఉండేలా నిబంధనలు తేవడంతో పాటు 24 గంటలకు మించి గది కేటా యించకుండా కొత్త విధానాన్ని టీటీడీ అమల్లోకి తెచ్చింది. దర్శనం టికెట్ ఉంటేనే తిరుమలకు.. దర్శన స్లాట్ కలిగిన భక్తులను అలిపిరి కాలిబాట మార్గంలో ఉదయం 6నుంచి సాయంత్రం 4గంటల వరకే అనుమతిస్తారు. శ్రీవారిమెట్టు మార్గంలో కొన్ని రోజుల పాటు భక్తులను అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. కోవిడ్ నిబంధనల ప్రకారం 65 ఏళ్ల వృద్ధులు, 10 ఏళ్ల లోపు చిన్నారులు, కంటైన్మెంట్, రెడ్‌జోన్‌లోని భక్తులను దర్శనానికి అనుమతించేది లేదని టీటీడీ వెల్లడించింది. ఘాట్ రోడ్డులో వాహనాలను ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతించనున్నారు. ప్రతి భక్తుడికీ అలిపిరి వద్ద థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. వాహనాలను, లగేజీలను శానిటైజేషన్ చేస్తారు. తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ వద్ద ర్యాండమ్‌గా ప్రతిరోజూ 200 నుంచి 300మంది భక్తుల నుంచి శాంపిల్స్ సేకరించి, కరోనా టెస్టులు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. కల్యాణకట్ట ఉద్యోగులు తప్పనిసరిగా పీపీఈ కిట్ ధరించాల్సి ఉంటుంది. అన్నప్రసాద సముదాయంలో రెండు గంటలకొకసారి శానిటైజేషన్ చేసేలా చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ప్రభుత్వ ఆదేశాల అమలు తీరును పర్యవేక్షించేందుకు సీని యర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ లోటుపాట్లను సరిచేయనుంది. తిరుమలలో నిత్యం భక్తులు సంచరించే ప్రాంతాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. శ్రీవారి ఆర్జిత సేవలన్నింటినీ ఏకాంతంగా నిర్వహిస్తారు. క్యూలో భక్తులు భౌతిక దూరం పాటించేలా గీసిన గీతలు స్వామివారి దర్శనం నిలిచిపోవడం ఇది రెండోసారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కారణంగా ముందు జాగ్రత్తగా టీటీడీ మార్చి 20వ తేదీ నుంచి శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసింది. దేశవ్యాప్తంగా మార్చి 24 నుంచి లాక్డౌన్ అమలులోకి రాగా టీటీడీ నాలుగు రోజులు ముందుగానే తిరుమలలో అమల్లోకి తెచ్చింది. శ్రీవారి ఆలయంలో 1892లో రెండు రోజుల పాటు స్వామివారి దర్శనం నిలిచిపోయింది. అప్పట్లో జీయంగార్లు, పరిపాలన చూస్తున్న మహంతుల మధ్య ఆలయ తాళాలకు సంబంధించి వివాదం రావడంతో రెండు రోజులు ద్వారాలను మూసేశారు. అటు తర్వాత శ్రీవారి ఆలయంలో సుదీర్ఘ సమయం దర్శనం నిలిచిపోవడం ఇదే. కరోనా వైరస్ కారణంగా 80 రోజులు పాటు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిచిపోయింది. అడిషనల్ ఈఓ తనిఖీలు తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు ప్రయోగాత్మకంగా దర్శనం కల్పించేందుకు చేసిన ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం టీటీడీ అడిషనల్ ఈఓ ఏవీ.ధర్మారెడ్డి తనిఖీ చేశారు. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో 80 రోజుల తర్వాత స్వామివారి దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఉన్నతాధికారులతో కలిసి అదనపు ఈఓ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని క్యూలను, ఇతర ఏర్పాట్లను తనిఖీ చేశారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేసిన మార్కింగ్, శానిటైజర్లు, హుండీ దగ్గర చేసిన ఏర్పాట్లు, భక్తులకు సూచనలు ఇచ్చేందుకు చేయాల్సిన ప్రకటనలు తదితరాలను పరిశీలించారు. కాణిపాకం, బోయకొండ ఆలయాల్లో.. కాణిపాకం, బోయకొండ గంగమ్మ ఆలయాల్లో సోమవారం నుంచి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. -
అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు
-
27న శ్రీవారి దర్శనం నిలిపివేత
సాక్షి, తిరుమల: తిరుమలలోని వరాహస్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కారణంగా 27న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు తిరుమల జేఈఓ కేఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. ఈ నెల 23 నుంచి 27 వరకు జరగనున్న ఈ మహాసంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తైనట్లు చెప్పారు. 22న అంకురార్పణ, 23 నుంచి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 23న రాత్రి 8 గంటల సమయంలో కళాకర్షణం ఉంటుందని చెప్పారు. అప్పటి నుంచి 27న మహాసంప్రోక్షణ వరకు భక్తులను దర్శనానికి అనుమతించబోమని తెలిపారు. 24న యాగశాల కార్యక్రమాలు, 25న వరాహస్వామివారి మూలమూర్తి పాదపీఠిక వద్ద అష్టబంధన కార్యక్రమం, 26న మధ్యాహ్నం 3 గంటలకు అభిషేకం ఉంటుందన్నారు. 27న ఉదయం 11.07 నుంచి మధ్యాహ్నం 1.16 గంటల వరకు మహాసంప్రోక్షణ చేయనున్నట్లు చెప్పారు. అదేరోజు మధ్యాహ్నం 3:30 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు వెల్లడించారు. -
అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ప్రారంభం
తిరుపతి: తిరుమలలో ఆదివారం నుంచి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ప్రారంభమైంది. ఈ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని మూలవర్లతో పాటు అన్ని ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేస్తారు. మూలవిరాట్టులోని 64 కళల్లో 63 కళల్ని కంభంలోకి అర్చకులు ఆవాహన చేయనున్నారు. శ్రీవారి శక్తిని కుంభంలోకి ఆవాహన చేసిన అనంతరం బాలాలయం ప్రారంభం అవుతుంది. తిరుమల శ్రీవారిని ఆదివారం సుమారు 28 వేల మంది దర్శించుకునే అవకాశం ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. -
తెలంగాణ వచ్చిన సంతోషం ఒక్కరిలోనూ లేదు
తిరుమల: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. స్వామివారి దయతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు సంవృద్ధిగా కురిసి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్ధించానని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో పాలకులు తప్ప, ప్రజలు సంతోషంగా లేరు..తెలంగాణ వచ్చిన సంతోషం ఓ ఒక్కరిలోనూ లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులకు తప్ప ఇతర మంత్రులకు అధికారాలు లేవని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని తెలిపారు. పార్లమెంటులో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ కూతురు కవితతో సహా టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు మద్ధతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో అభివృద్ధి కాగితాలపై తప్ప వాస్తవంగా లేదని వ్యాఖ్యానించారు. గురువారం కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు.శ్రీవారి ని దర్శించుకున్న వారిలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిథి అంబటి రాంబాబు. ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ వీరభద్రస్వామి, పీఠాధిపతులు సుగునేంద్ర తీర్ధ స్వామిజీ, రఘునేంద్ర తీర్ధ స్వామిజీలు ఉన్నారు. -
శ్రీవారి దర్శనం రద్దుపై టీటీడీ పునరాలోచన
సాక్షి, తిరుపతి: శ్రీవారి దర్శనం రద్దుపై తిరుమల తిరుపతి దేవస్థానం పునరాలోచనలో పడింది. మహా సంప్రోక్షణ సమయంలో పరిమితంగా భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించే విషయంపై చర్చకు సిద్ధమైంది. భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుని ఆ తరువాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈనెల 24న మరోసారి పాలకమండలి సమావేశం నిర్వహించి శ్రీవారి దర్శనం రద్దు విషయమై స్పష్టత ఇవ్వనున్నట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ వెళ్లడించారు. తిరుమల ఆలయంలో ఆగస్టు 11 నుంచి 15 వరకు మహా సంప్రోక్షణ సందర్భంగా భక్తులకు శ్రీవారి దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఈనెల 14న అన్నమయ్యభవన్‌లో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆలయంలో సీసీ కెమెరాలను సైతం పనిచేయకుండా ఆపేయాలనే నిర్ణయంపైనా చర్చ జరిగింది. అదే విధంగా మహా సంప్రోక్షణ సమయంలో కేవలం టీటీడీ బోర్డు సభ్యులు, వీఐపీలు, వీవీఐపీలకు ప్రత్యేక దర్శనాలు కల్పించాలని భావించినట్లు ప్రచారం జరిగింది. టీటీడీ పాలకమండలి తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రసార మాధ్యమాల్లో దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో టీటీడీ పునరాలోచనలో పడింది. టీటీడీలోని ముఖ్య అధికారి ఇచ్చిన సలహా మేరకు మొదట దర్శనం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ ఏపీ సీఎం చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. సాధ్యమైనంత మందికి శ్రీవారి దర్శనం మహాసంప్రోక్షణ సమయంలో సాధ్యమైనంత మందికి శ్రీవారి భాగ్యాన్ని కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. మంగళవారం అన్నమయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాసంప్రోక్షణ జరిగే సమయంలో సెలవు రోజులు కావడంతో ఎక్కువ మంది భక్తులు తరలివస్తే భక్తులకు ఇబ్బంది కలుగుతుందని పాలకమండలి దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించిందన్నారు. భక్తుల అభిప్రాయాలను ఈనెల 24న పాలకమండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కుదింపు సమయాల్లోనే శ్రీవారి దర్శనం అష్టబంధన బాలలయ మహాసంప్రోక్షణం ఆగస్టు 11 నుంచి 15వతేదీ వరకు జరగనుంది. ఇందులో ఆగస్టు 11వతేదీ శనివారం రోజు మొత్తంలో 9గంట ల సమయాన్ని దర్శనానికి కేటాయించామన్నారు. 12వతేదీ ఆదివారం 4 గంటల సమయం, 13వతేదీ సోమవారం 5 గంటలు సమయం, 14వతేదీ మంగళవారం 5 గంటల సమయం, 15వతేదీ బుధవారం 6 గంటల సమయం మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. ఈరోజులలో సుమారు 30 గంటల సమయంలో మాత్రమే శ్రీవారి దర్శనాలు చేయించగలుగుతామన్నారు. రోజుకు సుమారు15వేల మందికి మాత్రమే అవకాశం ఉంటుందని ఈవో పేర్కొన్నారు. శ్రీవారి ఆలయం మూసివేతపై బాబు ఆగ్రహించినట్లు లీకులు సాక్షి, అమరావతి: తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని ఆరు రోజులపాటు మూసివేయాలనే నిర్ణయంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవడంతో దానిపై తాను ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకూల మీడియాలో లీకులిప్పించారు. -
రాజన్న సన్నిధిలో లఘు దర్శనమే
సాక్షి, వేములవాడ: ఈనెల 31నుంచి ప్రారంభం కానున్న సమ్మక్క జాతరకు వెళ్లే భక్తులు ముందుగా ఎములాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకునే సంప్రదాయం ఉంది. ఈ క్రమంలో ఆదివారం 50వేల మందిపైగా భక్తులు తరలివచ్చారు. దీంతో రాజన్న క్షేత్రం కిటకిటలాడింది. భక్తుల రద్దీని గమనించిన ఆలయ అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రద్దీ మరింత పెరుగుతుండడంతో రాత్రంతా దర్శనాలను కొనసాగించనున్నట్లు మైక్ ద్వారా ప్రకటించారు. సోమవారం వీఐపీ దర్శనాలను బ్రేక్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు తలనీలాలు, కోడె మొక్కులు, ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బద్ది పోశవ్వకు బోనాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ద్వారా రూ.38 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. Appearances before the short RAJANNA -
మల్లన్న పూజా వేళల్లో మార్పు
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీకమాసం సందర్భంగా రద్దీ రోజుల్లో మల్లన్న పూజావేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఈవో నారాయణ భరత్‌గుప్త శుక్రవారం చెప్పారు. ఇందులో భాగంగా నవంబర్ 18లోపు ప్రతి కార్తీక శని, ఆది, సోమవారాలతో పాటు కార్తీక శుద్ధ ఏకాదశి, కార్తీక పౌర్ణమి, ప్రభుత్వ సెలవు రోజుల్లో ఆలయ పూజా వేళల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. ఆయా రోజుల్లో వేకువజామున 2.30 గంటలకు మంగళవాయిద్యాలు, 2.45కు సుప్రభాత సేవ, 3 గంటలకు మహామంగళ హారతి, 3.30 గంటల నుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. రద్దీ రోజుల్లో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించేందుకు స్వామి, అమ్మవార్ల సుప్రభాత, మహామంగళహారతి సేవల ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఈవో ప్రకటించారు. కార్తీకమాసం సందర్భంగా ఈ ఏడాది రద్దీ రోజుల్లోనూ ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. శ్రీశైలం ఆలయ వెబ్సైట్ www.srisailamonline.com ద్వారా ముందస్తు టికెట్లను భక్తులు కొనుగోలు చేయవచ్చని సూచించారు. -
సత్యదేవుని దర్శనానికి పోటెత్తిన భక్తులు
అన్నవరం : రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి, సెలవు దినం కావడంతో రత్నగిరి సత్యదేవుని ఆలయానికి శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తం 12 వేలమంది భక్తులు దర్శించుకోగా 1,233 వ్రతాలు జరిగాయి. సుమారు రూ.12 లక్షల ఆదాయం సమకూరింది. భక్తులతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ మెడికల్ ఆఫీసర్ కేహెచ్‌కే దొర, నేవీ డైరెక్టర్ థాకరేలు స్వామివారిని దర్శించినవారిలో ఉన్నారు. వారికి ఆలయం వద్ద ఏసీ జగన్నాథరావు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి ప్రసాదాలను బహూకరించారు. -
గంటలోపే స్వామివారి దర్శనం: ఈవో
తిరుమల: తిరుమల స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులను కంపార్టుమెంటు నుంచి విడుదల చేసిన తరువాత గంటలోగా దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈవో సాంబశివరావు వెల్లడించారు. వేసవిలో భక్తులు రద్దీని తట్టుకునేందుకు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. టీటీడీ పరిధిలో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. ప్రభుత్వం ఆధీనంలోని అటవీ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దర్శనం, వివిధ పూజల నిమిత్తం భక్తులు ఆన్ లైన్ లో పొందే టికెట్లను బార్ కోడ్ విధానంలో తనిఖీ చేస్తామన్నారు. -
తిరుమలలో కొద్దిగా పెరిగిన రద్దీ
తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో గత మూడు రోజులుగా తక్కువగా ఉన్న రద్దీ కొద్దిమేర పెరిగింది. శుక్రవారం ఉదయం సమయానికి 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 6 గంటలు, కాలినడక భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లోపే పూర్తవుతోంది. -
అన్నవరానికి భక్తుల తాకిడి
విజయవాడ వెళ్లి తిరుగు ప్రయాణంలో సత్యదేవుని దర్శనం పెరిగిన వ్యాపారం అన్నవరం : సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. సాధారణంగా ఆశ్వయుజమాసంలో భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అయితే దసరాకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లిన ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ¿¶ క్తులు తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ఆగి సత్యదేవుని దర్శించి పూజలు చేస్తున్నారు. ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వారం రోజుల్లో సుమారు 1.50 లక్షల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకోగా, 12వేల వ్రతాలు జరిగాయి. ఒక్క ఆదివారమే సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 2,203 వ్రతాలు జరిగాయి. భక్తుల రాకతో కొండ దిగువన వ్యాపారాలు పెరిగాయి. దేవస్థానానికి సుమారు రూ.రెండు కోట్లు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. కొండ దిగువన సత్యదేవుని తొలిపాంచా వద్ద పూజాద్రవ్యాలు, స్వామివారి ప్రసాదాలు, ఫ్యాన్సీ సామాన్లకు గిరాకీ పెరిగింది. కార్తీకమాస ఏర్పాట్లపై నేడు సమావేశం అన్నవరం : ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభంకానున్న కార్తీకమాస ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు రత్నగిరిపై దేవస్థానం–ప్రభుత్వ అధికారుల సమన్వయ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు, పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, ఇతర శాఖల సిబ్బంది హాజరుకానున్నారు. ఈనెల 25న చేపట్టనున్న సత్యదీక్షలు, నవంబర్ 11న జరగనున్న సత్యదేవుని తెప్సోత్సవం, 14న జరిగే గిరి ప్రదక్షిణ, 27న స్వామివారి అనివేటి మండపంలోని ధ్వజస్తంభం వద్ద జ్యోతిర్లింగార్చన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నారు. -
జై..జై.. గణేశా.. జయములివ్వు గణేశా..
-
సత్యదేవుని సన్నిధిలో ఉప లోకాయుక్త
అన్నవరం : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉప లోకాయుక్త టి.గంగిరెడ్డి కుటుంబ సమేతంగా శనివారం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం వేద పండితులు ఆశీస్సులందించి, స్వామివారి ప్రసాదాలను బహూకరించారు. ప్రత్తిపాడు సీఐ సత్యనారాయణ, ఎస్సై పార్థసారథి తదితరులు వారి వెంట ఉన్నారు. -
ముఖ్యమంత్రి పర్యటన ఖరారు
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం పర్యటన అధికారికంగా ఖరారయింది. సోమవారం ఉదయం 11 గంటలకు శ్రీశైలం చేరుకోనున్న ముఖ్యమంత్రి గంటన్నర పాటు ఇక్కడ ఉండనున్నారు. పర్యటనలో శ్రీశైల మల్లన్న దర్శనం లేకపోవడం గమనార్హం. లింగాలగట్టు ఘాట్‌కు వెళ్లి యాత్రికులతో ఏర్పాట్లపై ముఖాముఖి మాట్లాడటంతోనే పర్యటన ముగియనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి హెలిక్యాప్టర్‌లో సున్నిపెంట చేరుకుంటారు. 11.15 గంటలకు రోడ్డుమార్గంలో శ్రీశైలంలోని లింగాలగట్టు పుష్కరఘాట్‌కు వెళ్తారు. 12.15 వరకు ఘాట్‌లో అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తులతో ముఖాముఖి మాట్లాడుతారు. అనంతరం 12.30 గంటలకు తిరిగి సున్నిపెంటలోని హెలిప్యాడ్‌కు చేరుకొని హెలిక్యాప్టర్‌లో గుంటూరు జిల్లా గురుజాలకు బయలుదేరుతారు. అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లలో నిమగ్నమయింది. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి కిళ్లి కృపారాణి ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రాష్ర్ట మంత్రి కిమిడి మృణాళిని, కన్నడ నటుడు సుదీప్ లు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరు ఉదయం వీఐపీ ప్రారంభదర్శనంలో స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం సుదీప్ మాట్లాడుతూ.. శ్రీవారి సన్నిధిలో ఎంతో ప్రశాంతత ఉంటుందని అన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శనంలో వారు స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వారికి అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ దంపతులు ఉన్నారు. -
శ్రీవారి సేవలో శిల్పాశెట్టి
-
శ్రీవారి సేవలో శిల్పాశెట్టి
తిరుమల: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం కాంగ్రెస్ నేత టి.సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీరెడ్డితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం కల్యాణం విరామ సమయంలో వారు స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం శిల్పాశెట్టి, పింకీరెడ్డి లు ఆలయం వెలుపల సెల్ఫీలు తీసుకున్నారు. -
దేవదేవుడు.. కొందరివాడు!
నిరుపేదలకు దూరదర్శనం రూ.50 టిక్కెట్ తీసుకుంటేనే స్వామి సన్నిధికి.. వీరికే హారతి, తీర్థప్రసాదం రూ.10 భక్తులకు కనిపించని స్వామి నిరాశతో వెనుదిరుగుతున్న భక్తులు ఆళ్లగడ్డ టౌన్ : దేవుని దృష్టిలో అందరూ సమానమే. దూర దర్శనం.. సర్వదర్శనం.. ప్రత్యేక దర్శనం.. ఇలాంటివెన్ని ఉన్నా.. స్వామి వద్దకు వచ్చే సరికి అందరినీ ఒకేలా చూడాల్సి ఉంది. అయితే కర్నూలు జిల్లా అహోబిల క్షేత్రంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. పేద, ధనిక భక్తులను రెండుగా విభజించి మనోభావాలను దెబ్బతీయడం చర్చనీయాంశమవుతోంది. నిరుపేదలు కనీసం గర్భగుడి గడప తాకేందుకు కూడా అవకాశం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ తేడా పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న భక్తులు పలువురు ఆలయ అధికారుల తీరును నిరసించారు. వీఐపీ టిక్కెట్ తీసుకున్నా.. క్యూలో నిల్చోకుండా నేరుగా స్వామి వద్దకు పంపుతారే తప్ప, ఇలా డబ్బు ఎక్కువగా ఇచ్చిన వారిని మాత్రమే స్వామి సన్నిధికి తీసుకెళ్లడం ఏమిటని వారు ప్రశ్నించారు. పైగా వీరికి మాత్రమే అర్చన, హారతి, తీర్థం, శఠగోపంతో ఆశీర్వదించడం వివాదాస్పదమవుతోంది. రూ.10 టిక్కెట్ తీసుకున్న సామాన్య భక్తులను చాలా దూరం నుంచి లోపలకు వెళ్లిన వెంటనే క్షణాల్లో బయటకు పంపేయడం విమర్శలకు తావిస్తోంది. వీరికి మూలవిరాట్ లక్ష్మీనరసింహ స్వామి సరిగ్గా కనిపించకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. రూ.50 టిక్కెట్ తీసుకున్న గర్భగుడిలోకి వెళ్లిన భక్తులు స్వామికి అడ్డంగా నిల్చొని కుటుంబ సభ్యుల గోత్రాలు, నక్షత్రాలు చెప్పి అర్చన చేయించుకుంటుండటంతో సామాన్యు భక్తులకు స్వామి దర్శనభాగం లభించడం లేదు. ఈ కారణంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నరసింహ స్వామి నామస్మరణతో తమ భాగ్యం ఇంతేనని సరిపెట్టుకుంటున్నారు. ఇదిలాఉంటే ఆలయ ఆవరణలో ఏ టిక్కెట్ తీసుకుంటే.. ఎలాంటి దర్శనం కల్పిస్తారనే సమాచారం ఎక్కడా లేకపోవడం కూడా భక్తులను ఇబ్బందులకు గురిచేస్తోంది. భక్తులకు ఇబ్బంది కలగనీయం: గాయత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రూ.50 టిక్కెట్ తీసుకుంటే స్వామి సన్నిధికి తీసుకెళ్లి పూజలు చేయించడం.. రూ.10 టిక్కెట్ తీసుకున్న భక్తులకు గుడి బయట తీర్థం ఇస్తున్న విషయంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. స్వామి దృష్టిలో భక్తులంతా సమానమే. ఆ మేరకు చర్యలు చేపడతాం. -
గోవిందుడి గోపురాలకు మహర్దశ
సాక్షి, తిరుమల : తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయ గోపురాలకు మహర్దశ రానుంది. ఏడు శతాబ్దాలకు ముందు నిర్మించిన రాజ గోపురాలు ఇకపై స్వర్ణకాంతులతో దర్శనమివ్వనున్నాయి. శిలాశాసనాలు, చారిత్రక ఆధారాల ప్రకారం మహద్వార గోపురం 13వ శతాబ్దంలో నిర్మించారు. మహద్వారానికి రెండువైపులా బలిష్టమైన శిలల ‘చౌకట్టు’పై ఐదంతస్తుల్లో, నేలమట్టం నుంచి యాభై అడుగుల ఎత్తుతో దశలవారీగా నిర్మించారు. ఇక మూడంతస్తుల్లో వెండివాకిలిపై నిర్మించిన గోపురం 12వ శతాబ్దంలో ప్రారంభించి 13వ శతాబ్దంలో పూర్తి చేశారు. ఏడు శతాబ్దాలుగా కేవలం వెల్ల(తెల్లసున్నం)తో మాత్రమే కనిపించిన తిరుమల ఆలయ గోపురాలు ఇకపై స్వర్ణకాంతుల్లో దర్శనమివ్వనున్నాయి. సంప్రదాయ ఆలయ శిల్పకళారీతిలో మహద్వార గోపురానికి రంగులు అద్దనున్నారు. ఇందులో బంగారు వర్ణం, గ్రానైట్ శిల్పం రంగుతోపాటు ఇతర సంప్రదాయ రంగులు మాత్రమే వినియోగించనున్నారు. గోపురాలపై ఉన్న వివిధ దేవతా మూర్తులను జీవం ఉట్టిపడేలా రకరకాల రంగులతో తీర్చిదిద్దనున్నారు. మొదట ఐదంతస్తులతో నిర్మించిన మహద్వార గోపురానికి రంగులు అద్ది పరిశీలించనున్నారు. ఆ తర్వాత మూడంతస్తుల వెండివాకిలి గోపురానికి రంగులు వేయనున్నారు. ఈ పనులు నేడో రేపో ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆరుగంటల్లోనే శ్రీవారి దర్శనం తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆరుగంటల్లోనే శ్రీవారి దర్శనం లభిస్తోంది. వేకువజాము నుంచి సాయంత్రం 6 గంటల వరకు 20,252 మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్న భక్తులకు 6 గంటల్లో, నాలుగు కంపార్ట్మెంట్లలో ఉన్న కాలినడక భక్తులకు రెండు గంటల్లో స్వామి దర్శనం లభించింది. భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో రాత్రి వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగించారు. వీరికి గంటలోనే స్వామి దర్శనం లభించింది. భక్తులు తలనీలాలు సమర్పించటానికి, గదులు తీసుకోవటానికి కేవలం గంట సమయం మాత్రమే పట్టింది. కాగా, మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.35 కోట్లు లభించింది. -
ఇక నుంచి గంటలోపే శ్రీవారి దర్శనం