శ్రీవారి దర్శనానికి 18 గంటలు..
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 19 కంపార్ట్‌మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 76,772 మంది స్వామివారిని దర్శించుకోగా 30,293 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.82 కోట్లు సమరి్పంచారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.
ఆగమోక్తంగా గురుదక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు..
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురుదక్షిణామూర్తికి గురువారం ఆగమోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గురుదక్షిణామూర్తికి పలు రకాల అభిõÙక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమరి్పంచారు. భక్తులు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
అప్పన్నకు స్వర్ణ పుష్పార్చన..
సింహాచలం: సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఉదయం స్వర్ణపుష్పార్చన వైభవంగా జరిగింది. ఆలయ బేడా మండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను కొలువుదీర్చారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అషో్టత్తర శతనామావళి పూజ
నిర్వహించారు.
కనకమహాలక్షి్మకి త్రికాల పంచామృతాభిషేకం..
డాబాగార్డెన్స్: శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా విశాఖలోని బురుజుపేట కనకమహాలక్ష్మి దేవస్థానంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు గురువారం 25వ రోజుకు చేరాయి. అమ్మవారికి విశేష పూజలు, త్రికాల పంచామృతాభిషేక సేవ, విశేష హోమాలు నిర్వహించారు. విశిష్ట శ్రావణలక్ష్మీ పూజలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు.
ఘనంగా పైడితల్లి అమ్మవారి జాతర..
కిర్లంపూడి: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని జపగతినగరంలో వేంచేసిన పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఆలయం వద్ద నాట్య ప్రదర్శన, కోలాటం వంటి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించారు. పండితులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
నేటితో ముగియనున్న వరలక్ష్మీ వ్రతాలు..
సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోటలోని బాలత్రిపుర సుందరి సమేత చాళుక్య కుమార రామభీమేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న సామూహిక వరలక్ష్మీ వత్రాలు శుక్రవారంతో ముగియనున్నాయి. ఈ సామూహిక వ్రతాల్లో తమ పేర్లు నమోదు చేయించుకున్న మహిళలు ఉదయం 9 గంటలకు ఆలయానికి హాజరుకావాలన్నారు.
ఘనంగా సామూహిక సత్య దత్త వ్రతాలు..
పిఠాపురం: స్థానిక శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో శ్రావణ బహుళ ఏకాదశి సందర్భంగా గురువారం సామూహిక సత్య దత్త వ్రతాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామికి ప్రత్యేక అభిõÙకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సామూహిక సత్య దత్త వ్రతాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.
నిత్యార్జిత కల్యాణం సేవా టికెట్ పెంపు..
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమలలోని శ్రీవారి నిత్యార్జిత కల్యాణం సేవా టికెట్ రుసుము సెపె్టంబరు ఒకటో తేదీ నుంచి పెరగనుంది. ప్రస్తుతం రూ.1,500గా ఉన్న ఈ టికెట్ ధరను రూ.2 వేలకు పెంచుతున్నటుŠట్ ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు గురువారం వెల్లడించారు. స్వామివారికి జరిగే నిత్య కల్యాణానికి ఎంతో విశిష్టత ఉంది. కోరిన కోర్కెలు తీరిన భక్తులు, కోర్కెలు తీరాలని మొక్కుకున్నవారు ఈ సేవలో ఎక్కువగా పాల్గొంటారు. ప్రస్తుతం సాధారణ రోజుల్లో 70 నుంచి 100 మంది, ప్రతి శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో 230 నుంచి 250 మంది వరకు దంపతులు ఈ సేవలో పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment