తిరుమలలో ప్రారంభమైన టీటీడీ ఉచిత అన్నప్రసాద కేంద్రం
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం అర్ధరాత్రి వరకు 75,775 మంది స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే 36,474 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో భక్తులు రూ.3.70 కోట్ల మేర కానుకలు వేశారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తీసుకురావాలని కోరారు. మరోవైపు తిరుమలలో కోవిడ్ కారణంగా మూసివేసిన టీటీడీ ఉచిత అన్నప్రసాద కేంద్రాలు తిరిగి ఆదివారం నుంచి ప్రారంభమయ్యా యి. కాగా, క్యూలైన్లలో కూడా త్వరలోనే అన్నప్రసాదం అందించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment