Annaprasana program
-
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం అర్ధరాత్రి వరకు 75,775 మంది స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే 36,474 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో భక్తులు రూ.3.70 కోట్ల మేర కానుకలు వేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తీసుకురావాలని కోరారు. మరోవైపు తిరుమలలో కోవిడ్ కారణంగా మూసివేసిన టీటీడీ ఉచిత అన్నప్రసాద కేంద్రాలు తిరిగి ఆదివారం నుంచి ప్రారంభమయ్యా యి. కాగా, క్యూలైన్లలో కూడా త్వరలోనే అన్నప్రసాదం అందించనున్నట్లు సమాచారం. -
దిల్ రాజు మనవరాలి అన్నప్రసాన ఫోటోలు
-
కలం పట్టాడు
అన్నప్రాసన రోజు ఏది పట్టుకుంటే అది అవుతారని అనుకుంటుంటాం. హీరో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ భక్త మంచు అన్నప్రాసన బుధవారం జరిగింది. మంచు వారసుడు కలం పట్టుకున్నాడట. ఈ విషయాన్ని మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ – ‘‘ఆరు నెలల ఆరు రోజులైంది అవ్రామ్ పుట్టి. బుధవారం అన్నప్రాసన నిర్వహించాం. కత్తి, పుస్తకం, డబ్బు, మామిడికాయల్లో అవ్రామ్ కలాన్ని పట్టుకున్నాడు. అచ్చు వాళ్ల అమ్మ (విరానిక)లాగే. అప్పుడే వాళ్ల అమ్మ అడుగుజాడల్లో నడుస్తున్నాడు’’ అని పేర్కొన్నారు. అవ్రామ్ పట్టుకున్న ఆ పెన్ను విరానిక పెదనాన్న వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిది కావడం విశేషం. ఈ విషయాన్ని విరానిక ట్వీటర్ ద్వారా తెలిపారు. -
విద్యుత్ షాక్తో పసికందు మృతి
► మరో నలుగురికి తీవ్రగాయాలు ► ఒకరి పరిస్థితి విషమం బీకేపాలెం(కాకుమాను): విద్యుత్ షార్ట్ సర్క్వూట్ సంభవించి ఏడు నెలల పసికందు మృతి చెందిన సంఘటన మండలంలోని బీకేపాలెంలో మంగళవారం వేకువజామున సుమారు మూడుగంటల సమయంలో జరిగింది. బీకేపాలెం వీఆర్వో సుధారాణి తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన జంగా చంద్రపాల్ కూతురు హెమీమా అన్నప్రాసన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతని అక్క అరుణ తన ఇద్దరు పిల్లలతో సహా హాజరైంది. ఎప్పటిలానే ఇంటి పనులు ముగించుకుని సోమవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. ఉదయం సుమారు 3 గంటలకు ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో చిన్నారి హెమీమా, అరుణ, ఆమె కుమారుడు, సుబ్బారావు, కుమార్తె ప్రియాంక, చంద్రపాల్ తల్లి కుమారిలకు తీవ్ర గాయాలవడంతో క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ పసికందు హెమీమా మృతి చెందింది. అరుణ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యసేవల కోసం ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.