కలం పట్టాడు | Manchu Vishnu son Avram Bhakta Annaprasana Ceremony | Sakshi
Sakshi News home page

కలం పట్టాడు

Published Fri, Jun 8 2018 1:00 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

Manchu Vishnu son Avram Bhakta Annaprasana Ceremony - Sakshi

అవ్రామ్‌

అన్నప్రాసన రోజు ఏది పట్టుకుంటే అది అవుతారని అనుకుంటుంటాం. హీరో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్‌ భక్త మంచు అన్నప్రాసన బుధవారం జరిగింది. మంచు వారసుడు కలం పట్టుకున్నాడట. ఈ విషయాన్ని మంచు విష్ణు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ – ‘‘ఆరు నెలల ఆరు రోజులైంది అవ్రామ్‌ పుట్టి. బుధవారం అన్నప్రాసన నిర్వహించాం. కత్తి, పుస్తకం, డబ్బు, మామిడికాయల్లో అవ్రామ్‌ కలాన్ని పట్టుకున్నాడు. అచ్చు వాళ్ల అమ్మ (విరానిక)లాగే. అప్పుడే వాళ్ల అమ్మ అడుగుజాడల్లో నడుస్తున్నాడు’’ అని పేర్కొన్నారు. అవ్రామ్‌ పట్టుకున్న ఆ పెన్ను విరానిక పెదనాన్న వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డిది కావడం విశేషం. ఈ విషయాన్ని విరానిక ట్వీటర్‌ ద్వారా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement