శ్రీవారి దర్శనానికి 14 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 14 కంపార్ట్‌మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 71,153 మంది స్వామివారిని దర్శించుకోగా 25,863 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.32 కోట్లు సమరి్పంచారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 14 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.
ముక్కంటి హుండీ ఆదాయం రూ.1.97 కోట్లు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయం రూ.1,97,72,140 వచి్చనట్లు ఈవో ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. ఆలయ ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీలను ఆలయంలోని గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద లెక్కించారు. బంగారు 98 గ్రాములు, వెండి 605 కిలోలు, విదేశీ కరెన్సీ నోట్లు 233 వచ్చాయి.
సింహగిరిపై రేపు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
సింహాచలం: శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈ నెల 30న సింహగిరిపై పెద్ద ఎత్తున సామూహిక వరలక్ష్మీవ్రతాలు నిర్వహించనున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి బుధవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. వ్రతాల్లో పాల్గొనే మహిళలకు పూజాసామగ్రి, ప్రతిమ, రవిక, ప్రసాదం దేవస్థానం ఉచితంగా అందిస్తుందన్నారు.
శ్రీవారి క్షేత్రంలో నేత్రపర్వంగా ఉట్ల పండుగ
ద్వారకాతిరుమల: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల చిన వెంకన్న దివ్య క్షేత్రంలో బుధవారం సాయంత్రం ఉట్ల పండుగ, స్వామివారి తిరువీధి సేవలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రాజాధిరాజ వాహనంపై ఉంచి అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి వాహనం ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. శ్రీవారి కల్యాణ మండపం వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన ఉట్టిని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు యువకులకు అందించారు. అనంతరం యువకులు దాన్ని ఉత్సహంగా కొట్టారు.
30న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ఆఖరి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈనెల 30న సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని అనివేటి మండపంలో ఆరోజు ఉదయం 9.30 గంటల నుంచి జరిగే ఈ వేడుకలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనాలని ఆయన కోరారు.
కనుల పండువగా చెన్నకేశవుని కల్యాణం
పెనగలూరు: అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం కొండూరులో నూతనంగా నిరి్మంచిన చెన్నకేశవస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. మూడు రోజులపాటు ప్రత్యేక యాగశాలలో వివిధ రకాల హోమాలు నిర్వహించి విగ్రహ ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా చెన్నకేశవ ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి వారి కల్యాణం కనుల పండువగా జరిపారు.
వైభవంగా వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ
కొత్తపేట: అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లిలో నూతనంగా నిరి్మంచిన శ్రీ, భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహాల ప్రతిష్ఠాపనను బుధవారం వైభవంగా నిర్వహించారు. తిరుపతిలో ప్రముఖ శిల్పులతో తయారుచేయించిన దేవతామూర్తుల విగ్రహాలను తీసుకువచ్చి సోమవారం నుంచి గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన నేమాని భాస్కరరామం పర్యవేక్షణలో ఆగమ శాస్త్ర పండితులు మూడు రోజుల పాటు విశేష పూజలు నిర్వహించారు.
పంచ మఠాల్లో ప్రత్యేక పూజలు
శ్రీశైలం: శ్రీశైల క్షేత్ర పరిధిలోని వీరశైవ జగద్గురు పరంపరకు సంబంధించిన పంచ మఠాల్లో ప్రతిష్టమైన లింగాలకు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చిన్న సిద్ధరామ శివాచార్య స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో క్షేత్రంలో ఉన్న ఘంటా మఠం, విభూతి, రుద్రాక్ష, భీమశంకర, సారంగధర మఠాల్లో విశేష అభిõÙకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆయా మఠాల్లో లోక కళ్యాణార్థం అభిõÙకాది అర్చనలు చేశామని స్వామి తెలిపారు.
ఆధ్యాత్మిక సమాచారం
Published Thu, Aug 29 2024 7:18 AM | Last Updated on Thu, Aug 29 2024 7:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment