తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ లైన్ టీబీసీ వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 84,060 మంది స్వామివారిని దర్శించుకోగా 34,985 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.01 కోట్లు సమరి్పంచారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.
ఆగమోక్తంగా మృత్యంజయస్వామికి ప్రత్యేక పూజలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మృత్యుంజయస్వామికి సోమవారం ఆగమోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గణపతిపూజ, కలశ స్థాపన పూజలు చేశారు. అనంతరం స్వామివారికి చందనం, నారికేళ, పసుపు, కుంకుమ, విభూథి వంటి వాటితోఅభిõÙకాలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులుచెల్లించుకున్నారు.
కనులపండువగా రాధాకృష్ణుల కల్యాణం
రాపూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు సమీపంలోని మద్దెలమడుగులో ఉన్న రాధాసమేతర గోపాలకృష్ణమందిరంలో సోమవారం కృష్ణాష్టమినిపురస్కరించుకుని రాధా కృష్ణుల కల్యాణం రంగరంగవైభవంగా నిర్వహించారు.
శ్రీమఠంలో గోకులాష్టమి వేడుకలు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాతి్మక కేంద్రమైన కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో గోకులాష్టమి వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. శ్రీమఠం ఊంజల మంటపంలో అక్షోభ్య మఠం ఉప పీఠాధిపతి అక్షోభ్య రామప్రియ తీర్థులు ఆశీస్సులతో వేడుకలు నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడి వేషధారణలో కనువిందు చేశారు.
శా్రస్తోక్తంగా గోపూజ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులంలో గోపూజ నిర్వహించారు. ప్రతినిత్యం ఆలయంలో ప్రాతఃకాల సమయంలో నిత్యసేవగా గోపూజ నిర్వహించబడుతున్నప్పటికీ, కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం నిత్యసేవతో పాటు విశేషంగా గోపూజ జరిపించారు.
నేడు సింహగిరిపై కృష్ణాష్టమి
సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మంగళవారం శ్రీకృష్ణాష్టమిని వైభవంగా నిర్వహించనున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ సంద«ర్భంగా సాయంత్రం 6 గంటల వరకే స్వామివారి దర్శనాలు భక్తులకు లభిస్తాయని పేర్కొన్నారు.
నేడు అష్టదళ పద్మారాధన
డాబాగార్డెన్స్ : ఉత్తరాంధ్ర కల్పవల్లి, విశాఖ వాసుల ఆరాధ్యదైవం కనక మహాలక్ష్మికి 108 స్వర్ణ పుష్పాలతో మంగళవారం అష్టదళ పద్మారాధన నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు నిర్వహించనున్న ప్రత్యేక పూజలో పాల్గొనదలచే భక్తులు రూ.1,116 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు 0891 2711725, 2566514లో సంప్రదించాలి.
నేడు ద్వారకా తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు
ద్వారకాతిరుమల: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈఓ తెలిపారు. బుధవారం క్షేత్రంలో ఉట్ల పండుగను, స్వామివారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
పంచారామ క్షేత్రంలో భక్తుల కిటకిట
సామర్లకోట: శ్రావణ మాసం సోమవారం పురస్కరించుకుని కాకినాడ జిల్లాలోని పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కిటకిటలాడారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న శివలింగానికి నీటితోను, పాలతోను స్వయంగా అభిషికాలు చేశారు. ధ్వజ స్తంభం, పెద్ద నంది, ఉప ఆలయాలు, మూల విరాట్లతో పాటు స్వామివారిని, అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment