సాక్షి, తిరుపతి: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు భారీగా తగ్గారు. దశాబ్ద కాలంలో అత్యల్పంగా వైకుంఠ ద్వార దర్శనాలు జరిగాయి. తిరుపతి తొక్కిసలాట(Tirupati stampede)తో భక్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులను టీటీడీ(TTD) భయబ్రాంతులకు గురిచేయడంతో కూటమి ప్రభుత్వంపై భక్తుల్లో అనుమానాలు కలుగుతున్నాయి. 70 వేలు టోకెన్లు విడుదల చేయగా కేవలం 53 వేల మంది భక్తులే దర్శనాలు చేసుకున్నారు. టీటీడీ వైఫల్యంతో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు దక్కలేదు.
పోలీసులు దురుసు ప్రవర్తన
శ్రీనివాసం గెస్ట్‌హౌస్ వద్ద పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దర్శనానికి వచ్చే భక్తులపై పోలీసులు చేయి చేసుకున్నారు. భక్తుల పట్ల సంయమనం పాటించాలని చెప్పున్నా పోలీసులు వినడం లేదు. దర్శనం టికెట్లకు క్యూలైన్‌లోకి వెళ్లేవారిని అడ్డగించడంపై భక్తుడు నిలదీశాడు.
శనివారం రాత్రి నుంచి రెండో విడత టోకెన్ల జారీ ప్రారంభమైంది. భయంభయంగానే.. మొదటి విడత వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన భక్తులను కలవరపాటుకు గురిచేస్తోంది. శనివారం నుంచి రెండో విడత టోకెన్ల జారీ చేస్తుండడంతో పలువురు క్యూలైన్లోకి వెళ్దామా? వద్దా? అనే సందిగ్ధంలో పడ్డారు. తిరుపతి నగరంలో శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు నాటి చేదు ఘటన గురించే చర్చించుకుంటున్నారు. తొక్కిసలాట ఘటన విషయంలో ప్రభు త్వం, టీటీడీ తీసుకున్న చర్యలపైనా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదీ చదవండి: ఏడు చేపల కథ!
Comments
Please login to add a commentAdd a comment