
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 76,910 మంది స్వామివారిని దర్శించుకోగా 30,320 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.26 కోట్లు సమరి్పంచారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.
బ్రహ్మోత్సవాలను జయప్రదం చేద్దాం..
కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకంలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌లు పేర్కొన్నారు. కాణిపాకం ఈవో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ద్వారకాతిరుమలలో కృష్ణాష్టమి శోభ
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న దివ్యక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మంగళవారం నేత్రపర్వంగా జరిగాయి. కొండపైన గోసంరక్షణశాలలో, అలాగే ఆలయ తూర్పు ప్రాంతంలోని సప్తగోకులంలో పెద్ద ఎత్తున భక్తులు గోవులకు పూజలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం శ్రీవారి క్షేత్రంలో ఉట్లు పండుగను వైభవంగా జరుపనున్నట్టు ఆలయ ఈఓ తెలిపారు.
అప్పన్నకు విశేషంగా గరుడసేవ
సింహాచలం: సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి మంగళవారం గరుడసేవ విశేషంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఆలయ కల్యాణ మండపంలో వెండి గరుడవాహనంపై వేంచేపుచేశారు. అషో్టత్తర శతనామావళి పూజ నిర్వహించారు. విశేష హారతులిచ్చారు.
ఘనంగా శ్రావణలక్ష్మి పూజలు
డాబాగార్డెన్స్: విశాఖ నగరంలోని బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా శ్రీలక్ష్మి పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకు శ్రీలక్ష్మి పూజలు ప్రారంభించారు.
ఆదిత్యుని హుండీ ఆదాయం రూ.70.96 లక్షలు
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ హుండీ కానుకల ద్వారా రూ.70,96,186 ఆదాయం లభించినట్లు ఈఓ డీఎల్‌వీ రమేష్‌బాబు తెలిపారు. జూన్ 10 నుంచి ఈనెల 27 వరకూ మొత్తం 77 రోజులకు గాను ఈ మేరకు ఆదాయం లభించినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment