
ప్రతీకాత్మక చిత్రం
తిరుపతి: తిరుమలలో ఆదివారం నుంచి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ప్రారంభమైంది. ఈ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని మూలవర్లతో పాటు అన్ని ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేస్తారు. మూలవిరాట్టులోని 64 కళల్లో 63 కళల్ని కంభంలోకి అర్చకులు ఆవాహన చేయనున్నారు. శ్రీవారి శక్తిని కుంభంలోకి ఆవాహన చేసిన అనంతరం బాలాలయం ప్రారంభం అవుతుంది. తిరుమల శ్రీవారిని ఆదివారం సుమారు 28 వేల మంది దర్శించుకునే అవకాశం ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment