పోలీసుల అదుపులో ముగ్గురు
తిరుమల: ఏపీ టూరిజం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లతో మోసగిస్తున్న దళారుల ముఠాకు చెందిన ముగ్గురిని సోమవారం రాత్రి టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుమల టూటౌన్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. పాత నేరసుడు ∙అమృత యాదవ్, తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రూ.300 ఎస్‌ఈడీ టికెట్ స్కానింగ్ కౌంటర్లో పనిచేసే రుద్రసాగర్, అదే విభాగంలో గతంలో పనిచేసిన నవీన్ తేజ, నారాయణ అనే వారితో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు.
చెన్నైకి చెందిన మోహన్ రాజ్ అనే భక్తుడు సోమవారం దళారి అమృత యాదవ్‌ను టికెట్ల కోసం సంప్రదించారు. అతను 4 పాత∙టికెట్లు కలర్ జిరాక్స్ తీసి సీరియల్ నంబరు మార్చి రూ.11వేలకు విక్రయించాడు. క్యూ కాంప్లెక్స్‌లో తనిఖీల్లో ఆ టికెట్లు నకిలీవని తేలింది. స్కానింగ్ కేంద్రంలో పనిచేసే రుద్రసాగర్ నకిలీ ఎస్‌ఈడీ రూ.300 టికెట్లను స్కానింగ్ చేసినట్లు నటిస్తూ మోసగిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు రుద్రసాగర్, నవీన్ తేజ, ట్రావెల్ డ్రైవర్ పెరియస్వామిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment