Fake Tickets
-
నకిలీ టికెట్ల వ్యవహారం.. బుక్‌మైషో సీఈవోకు సమన్లు
బ్రిటిష్ రాక్ బ్యాండ్ ‘కోల్డ్‌ప్లే’ షో నలికీ టికెట్లతో బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై బుక్‌మైషో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సహ వ్యవస్థాపకుడైన ఆశిష్ హేమ్రజనీ ముంబై పోలీసులు సమన్లు పంపారు. ఈయనతోపాటు కంపెనీ టెక్నికల్ హెడ్‌కు కూడా సమన్లు పంపినట్లు ఒక అధికారి తెలిపారు.ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వచ్చే ఏడాది జనవరి 19 నుండి 21 వరకు జరగనున్న కోల్డ్‌ప్లే కచేరీకి సంబంధించి బుక్‌మైషో టిక్కెట్ల బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడిందని ఆరోపిస్తూ ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదుపై ముంబై పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీ సీఈవో, టెక్నికల్ హెడ్లకు సమన్లు పంపిన అధికారులు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేయాల్సి ఉందని కోరారు.కోల్డ్‌ప్లే ఇండియా టూర్ టిక్కెట్ల వ్యవహారానికి సంబంధించి బుక్‌మైషోపై ఫిర్యాదు చేసిన న్యాయవాది అమిత్ వ్యాస్.. రూ.2,500 ఉన్న టెకెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేసి రూ.3 లక్షల వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే అమిత్ వ్యాస్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన అధికారులు.. టికెట్ల దందాలో పాల్గొన్న పలువురు బ్రోకర్లను గుర్తించారు. -
రూ.300 ఎస్ఈడీ నకిలీ టికెట్లతో మోసం
తిరుమల: ఏపీ టూరిజం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లతో మోసగిస్తున్న దళారుల ముఠాకు చెందిన ముగ్గురిని సోమవారం రాత్రి టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుమల టూటౌన్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. పాత నేరసుడు ∙అమృత యాదవ్, తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రూ.300 ఎస్ఈడీ టికెట్ స్కానింగ్ కౌంటర్లో పనిచేసే రుద్రసాగర్, అదే విభాగంలో గతంలో పనిచేసిన నవీన్ తేజ, నారాయణ అనే వారితో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. చెన్నైకి చెందిన మోహన్ రాజ్ అనే భక్తుడు సోమవారం దళారి అమృత యాదవ్‌ను టికెట్ల కోసం సంప్రదించారు. అతను 4 పాత∙టికెట్లు కలర్ జిరాక్స్ తీసి సీరియల్ నంబరు మార్చి రూ.11వేలకు విక్రయించాడు. క్యూ కాంప్లెక్స్‌లో తనిఖీల్లో ఆ టికెట్లు నకిలీవని తేలింది. స్కానింగ్ కేంద్రంలో పనిచేసే రుద్రసాగర్ నకిలీ ఎస్ఈడీ రూ.300 టికెట్లను స్కానింగ్ చేసినట్లు నటిస్తూ మోసగిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు రుద్రసాగర్, నవీన్ తేజ, ట్రావెల్ డ్రైవర్ పెరియస్వామిని అదుపులోకి తీసుకున్నారు. -
తిరుమలలో నకిలీ టిక్కెట్ల కలకలం
-
తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం
తిరుమల: తిరుమలలో నకిలీ టికెట్ల వ్యవహారం కలకలం సృష్టించింది. భక్తులకు నకిలీ టికెట్లను అంటగడుతున్న దళారులు దందా గుట్టు రట్టు అయ్యింది. హైదరాబాద్ నుంచి వెళ్లిన భక్తులకు దళారులు మార్ఫింగ్ చేసిన రెండు రూ.300 టికెట్లను రూ.4,400కు విక్రయించారు. ప్రతిరోజూ కేటాయించిన రూ.300 దర్శనం కోటా టికెట్ల కంటే ఎక్కువ మంది రోజువారీగా శ్రీవారి దర్శనం చేసుకుంటున్నట్లు టీటీడీ, విజిలెన్స్ అధికారులు అనుమానం రావడంతో అధికారులు ఈ వ్యహరంపై నిఘా పటిష్ఠం చేశారు. అయితే, హైదరాబాద్ భక్తులు నేడు శ్రీవారి దర్శనానికి రావడటంతో ఈ మొత్తం వ్యవహరం వెలుగోలోకి వచ్చింది. మార్ఫింగ్ టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. -
చురుగ్గా విచారణ
-
ఈ–టికెట్లలో గోల్మాల్!
సాక్షి, సిటీబ్యూరో: కొద్ది రోజుల క్రితం రైల్వే విజిలెన్స్ అధికారులు హబ్సిగూడలోని ఒక ఏజెంట్ ఇంటిపై దాడులు నిర్వహించారు. అందులో పట్టుబడిన రైల్వే టిక్కెట్లు చూసి అధికారులే విస్తుపోయారు. సుమారు రూ.1.5 లక్షల విలువైన టికెట్లను, వాటితో పాటు కంప్యూటర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు ఏజెంట్ బినామీ పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించి పెద్ద ఎత్తున అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఒక్క హబ్సిగూడకు చెందిన ఏజెంట్ మాత్రమే కాదు... నగరంలోని వేలాది మంది రైల్వే టికెట్ ఏజెంట్లు ఇదే తరహా దందా నిర్వహిస్తున్నారు. ఆర్పీఎఫ్ పోలీసులు, విజిలెన్స్ అధికారులు నిర్వహించే తనిఖీలు ప్రహసనంగా మారుతున్నాయి. అక్రమ దందాను అరికట్టేందుకు ఎలాంటి నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టకపోవడంతో ఏటా కోట్లాది రూపాయాల ప్రయాణికుల సొమ్ము దళారుల జేబుల్లోకి వెళ్తోంది. మరోవైపు ప్రతిఏటా దక్షిణమధ్య రైల్వే నిర్వహించే విజిలెన్స్ వారోత్సవాలు ఒక తంతుగానే మారుతున్నాయి. ఏ టు జడ్ ఐడీలు... దక్షిణమధ్య రైల్వేలో ప్రతిరోజు సుమారు లక్ష టికెట్లను విక్రయిస్తారు. వీటిలో 40వేల టికెట్లు రైల్వే స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్ల నుంచి విక్రయిస్తుండగా... 60వేల టికెట్లు ఐఆర్సీటీసీ వెబ్సైట్ నుంచి విక్రయిస్తున్నారు. ప్రయాణికులు తమ సొంత ఐడీలపైన ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆధార్‌తో పాటు నమోదైన ఐడీపైన 12 టికెట్లు, సాధారణ ఐడీలపైన 6టికెట్ల వరకు బుక్ చేసుకునేందుకు ప్రయాణికులకు వెసులుబాటు ఉంది. అలాగే నామమాత్రపు చార్జీలతో ఏజెంట్ల వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. తత్కాల్ టికెట్లను బుక్ చేసుకునేందుకు ప్రయాణికులకు ఉదయం 10గంటలకే అనుమతి లభిస్తుండగా, ఏజెంట్లకు మాత్రం అరగంట ఆలస్యంగా ఉదయం 10:30గంటలకు లభిస్తుంది. ఈ క్రమంలోనే ఏజెంట్లు అక్రమాలకు తెరలేపుతున్నారు. ఏజెంట్‌గా నమోదు చేసుకొని ఐఆర్సీటీసీ నుంచి పొందిన గుర్తింపుపై కాకుండా బినామీ పేర్లపైన సాధారణ ప్రయాణికులుగా నమోదు చేసుకున్న ఐడెంటిటీలపై తత్కాల్ టికెట్లను కొల్లగొడుతున్నారు. వాటిని ప్రయాణికులకు రెట్టింపు చార్జీలకు కట్టబెడుతున్నారు. రిజర్వేషన్లలోనూ ఇదే తరహా బినామీ దందా కొనసాగుతోంది. ‘ఇందుకోసం ఏ నుంచి జడ్ వరకు ఉన్న 26 అక్షరాలపై రకరకాల ఐడీలను సృష్టిస్తారు. ఈ ఐడీలపైనే పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేస్తారు. ఒకే కంప్యూటర్ నుంచి ఈ రకమైన బినామీ ఐడీలు వందల కొద్దీ నమోదై ఉంటాయి’ అని దక్షిణమధ్య రైల్వే విజిలెన్స్ అధికారి ఒకరు ‘సాక్షి’తో విస్మయం వ్యక్తం చేశారు. కూకట్పల్లి, సికింద్రాబాద్, బోయిన్పల్లి, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఏజెంట్ల అక్రమ దందా భారీ ఎత్తున కొనసాగుతోందని చెప్పారు. పండగలు, వరుస సెలవుల్లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు టికెట్లను రెట్టింపు చార్జీలకు కట్టబెడుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు స్లీపర్ క్లాస్ టికెట్ చార్జీ రూ.450 వరకు ఉంటే రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఏజెంట్లు రూ.1000 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నట్లు అంచనా. ఇలా ఒక్క హైదరాబాద్‌లోనే ఏటా కోట్లాది రూపాయాల అక్రమ దందా కొనసాగుతోంది. చర్యలు శూన్యం... నకిలీ ఐడీలపై బల్క్‌గా టికెట్లను బుక్ చేస్తూ ప్రయాణికుల నిలువుదోపిడీకి పాల్పడడమే కాకుండా... రైల్వేను సైతం పెద్ద ఎత్తున మోసం చేస్తోన్న ఏజెంట్ల అక్రమాలను అరికట్టేందుకు చేపడుతున్న చర్యలు మొక్కుబడిగానే ఉన్నాయి. ఏటా విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా దాడులు చేసి కేసులు నమోదు చేయడం మినహా ఈ అక్రమ దందాను అరికట్టలేకపోతున్నారు. ప్రతి రోజు వెబ్సైట్ నుంచి బుక్ అయ్యే టికెట్లు ఏ సిస్టమ్ నుంచి బుక్ అవుతున్నాయనేది నమోదవుతుంది. సాధారణ ప్రయాణికులైతే ఏ నెలకో, ఆరు నెలలకో ఒకసారి తమ అవసరాల మేరకు టికెట్లను బుక్ చేసుకుంటారు. ప్రయాణకులు ఏ కంఫ్యూటర్ నుంచి ఎన్ని టికెట్లు బుక్ చేసుకున్నదీ తెలిసిపోతుంది. అదే విధంగా ఏజెంట్లు ఒకే కంప్యూటర్ నుంచి ప్రతిరోజు రకరకాల ఐడీలపైన టికెట్లు బుక్ చేస్తున్నప్పుడు కచ్చితంగా గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. రైల్వే యాక్ట్‌లోని సెక్షన్ 143 ప్రకారం రూ.10వేల వరకు జరిమానా విధిస్తారు. ఏడాది పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. కానీ ఆర్పీఎఫ్, విజిలెన్స్ అధికారులు నిర్వహించే మొక్కుబడి దాడుల కారణంగా ఏజెంట్ల అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. -
శ్రీవారి దర్శనానికి నకిలీ టికెట్లు
సాక్షి, తిరుమల: టీటీడీ దాతల నకిలీ పాస్ పుస్తకాల కుంభకోణం మరువకముందే.. రూ.300 నకిలీ టికెట్ల ఉదంతం బయటపడింది. ముంబైకి చెందిన 192 మంది భక్తులు బుధవారం తిరుమలకు వచ్చారు. అందరూ రూ.300 దర్శనం టికెట్లతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి చేరుకున్నారు. విజిలెన్స్ స్కానింగ్ కేంద్రంలో టికెట్లపై బార్‌కోడ్‌ను తనిఖీ చేయగా.. 4 టికెట్లు మినహా మిగిలిన 188 టికెట్లు నకిలీవని తేలింది. దీంతో వారిని శ్రీవారి దర్శనానికి అనుమతించలేదు. వీరిని తీసుకొచ్చిన ముంబైకి చెందిన ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. టీటీడీ సీవీఎస్వో రవికృష్ణ మాట్లాడుతూ.. ప్రశాంత్‌పై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలిపారు. ముంబై భక్తుల తప్పేమీ లేదన్నారు. విజిలిన్స్ తనిఖీలు, బార్‌కోడింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్లే నకిలీ టికెట్లను గుర్తించగలిగామన్నారు. సమావేశంలో వీఎస్వోలు సదాలక్ష్మి, రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. 17 నుంచి సుప్రభాతం రద్దు.. శ్రీవారి ఆలయంలో పవిత్రమైన ధనుర్మాసం పూజలు ఈనెల 16 నుంచి 2018 జనవరి 14 వరకు జరగనున్నాయి. 17 నుంచి శ్రీవారికి సుప్రభాతం బదులు గోదాదేవి విరచిత తిరుప్పావై పాశురాలు పారాయణం చేయనున్నారు. రోజుకొకటి చొప్పున నెలరోజుల పాటు మొత్తం 30 పాసురాలు వేద పండితులు పారాయణం చేయనున్నారు. ఈ నెల రోజులు గర్భాలయంలో భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామి వారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. ధనుర్మాసం అంటే దివ్యప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ఆండాల్ అమ్మవారి పూజ, తిరుప్పావై పఠనం, గోదా కల్యాణం ప్రసాదాలు ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. 2018 జనవరి 15 నుంచి యథావిధిగా సుప్రభాత సేవ పునఃప్రారంభిస్తారు. -
మెట్రో స్టేషన్ల వద్ద నకిలీ టికెట్లు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో కలల మెట్రో మొదలై 24 గంటలు దాటిందో లేదో.. ప్రైవేట్ దళారీలు దోపిడీకి తెర తీశారు. మియాపూర్ - నాగోల్ మెట్రో రూట్లలో ఉన్న స్టేషన్ల వద్ద ప్రైవేటు వ్యక్తులు నకిలీ టికెట్లను అమ్ముతున్నారు. టికెట్ల అమ్మకానికి సంబంధించి ఎలాంటి అధికారిక ఆదేశాలు లేవని తెలుస్తోంది. మేజర్ స్టేషన్ల వద్ద పార్కింగ్‌కు బైక్ రూ.6, కారుకు రూ.12 అధికారిక రుసుమును వసూలు చేస్తున్నారు. మరోవైపు నగరవాసులు మెట్రో ప్రయాణానికి ఉత్సాహం చూపుతుండటంతో మెట్రో రైళ్లు రెండో రోజు కూడా కిక్కిరిసిపోయాయి. మియాపూర్ - నాగోల్ల మధ్య 14 మెట్రో రైళ్లు ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. కాగా, మెట్రో ప్రారంభమైన తొలి రోజున రెండు లక్షల మంది ప్రయాణించారు. -
మోసగాళ్ల ముఠా అరెస్టు
రైల్వే టిక్కెట్లు పేరుతో ప్రయాణికులను మోసం చేస్తున్న ముఠాను గోపాలపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ ముఠా నకిలీ రైల్వే టిక్కెట్లతో ప్రయాణికులను మోసం చేస్తున్నారు. వీరిని గోపాలపురం స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 26వేలు స్వాధీనం చేసుకున్నారు. -
సింగపూర్‌లో ఉద్యోగం పేరిట మోసం
నాగోలు: సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2 లక్షలు తీసుకుని నకిలీ టికెట్లు ఇచ్చిన ఇద్దరిపై ఎల్బీనగర్ ఠాణాలో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారానికి చెందిన పెద్దగోని మైసయ్య (48) డ్రైవర్. మార్చి 30న మల్లేపల్లిలో నిర్వహించిన ఈఎస్ఐ క్యాంప్‌కు వెళ్లగా.. అక్కడ బోరబండకు చెందిన సామ్రాట్‌తో పరిచయమైంది.ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రకాశ్‌రెడ్డిని పరిచయం చేశాడు. సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని మైసయ్యతో నమ్మబలికారు. ఎల్బీనగర్లోని సుప్రభాత్ హోటల్ వద్దకు అతడి ని పిలిచి.. ‘‘నీకు వీసా వచ్చింది, ఏప్రిల్ 29న నిజామాబాద్ వచ్చి వైద్య పరీక్షలు చేయిం చుకో’’ అన్నారు. దీంతో మైసయ్య నిజామాబాద్ వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని రూ.2,500 చెల్లించాడు. అనంతరం ఏప్రిల్ 30న సామ్రాట్, ప్రకాశ్‌రెడ్డి పని అయిపోయిందని చెప్పి రూ. లక్ష తీసుకున్నారు. అనంతరం మే 5న ఎయిర్ ఏషియా టికెట్లు చేతికి ఇచ్చి మైసయ్య వద్ద నుంచి ఒరిజినల్ ఎస్సెస్సీ మెమో, పాస్‌పోర్ట్ తీసుకొని, అదే నెల 11న సింగపూర్‌కు వెళ్లమని చెప్పి మరో రూ. లక్ష తీసుకున్నారు. 11న కుటుంబ సభ్యులతో కలిసి రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లగా..అవి నకిలీ టికెట్లని తేలింది. దీంతో మైసయ్య మోసపోయినట్లు తెలుసుకున్నాడు. ఇదిలా ఉండగా.. అదే రోజు రాత్రి మైసయ్యకు ప్రకాశ్‌రెడ్డి నుంచి ఓ ఇమెయిల్ వచ్చింది. అందులో ‘‘నేను ఒకరిని నమ్మి మోసపోయా. నీ మీద ఖర్చు చేసిన రూ.12 వేలు నా ఖాతాలో వేస్తే పాస్‌పోర్టు, ఎస్ఎస్సీ మెమో పంపిస్తానని’’ అని ఉంది. మోసపోయాయ నని బాధితుడు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.