
బ్రిటిష్ రాక్ బ్యాండ్ ‘కోల్డ్‌ప్లే’ షో నలికీ టికెట్లతో బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై బుక్‌మైషో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సహ వ్యవస్థాపకుడైన ఆశిష్ హేమ్రజనీ ముంబై పోలీసులు సమన్లు పంపారు. ఈయనతోపాటు కంపెనీ టెక్నికల్ హెడ్‌కు కూడా సమన్లు పంపినట్లు ఒక అధికారి తెలిపారు.
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వచ్చే ఏడాది జనవరి 19 నుండి 21 వరకు జరగనున్న కోల్డ్‌ప్లే కచేరీకి సంబంధించి బుక్‌మైషో టిక్కెట్ల బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడిందని ఆరోపిస్తూ ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదుపై ముంబై పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీ సీఈవో, టెక్నికల్ హెడ్‌లకు సమన్లు పంపిన అధికారులు వారి స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేయాల్సి ఉందని కోరారు.
కోల్డ్‌ప్లే ఇండియా టూర్ టిక్కెట్‌ల వ్యవహారానికి సంబంధించి బుక్‌మైషోపై ఫిర్యాదు చేసిన న్యాయవాది అమిత్ వ్యాస్.. రూ.2,500 ఉన్న టెకెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేసి రూ.3 లక్షల వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే అమిత్ వ్యాస్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన అధికారులు.. టికెట్ల దందాలో పాల్గొన్న పలువురు బ్రోకర్లను గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment