BookMyShow
-
నకిలీ టికెట్ల వ్యవహారం.. బుక్‌మైషో సీఈవోకు సమన్లు
బ్రిటిష్ రాక్ బ్యాండ్ ‘కోల్డ్‌ప్లే’ షో నలికీ టికెట్లతో బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై బుక్‌మైషో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సహ వ్యవస్థాపకుడైన ఆశిష్ హేమ్రజనీ ముంబై పోలీసులు సమన్లు పంపారు. ఈయనతోపాటు కంపెనీ టెక్నికల్ హెడ్‌కు కూడా సమన్లు పంపినట్లు ఒక అధికారి తెలిపారు.ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వచ్చే ఏడాది జనవరి 19 నుండి 21 వరకు జరగనున్న కోల్డ్‌ప్లే కచేరీకి సంబంధించి బుక్‌మైషో టిక్కెట్ల బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడిందని ఆరోపిస్తూ ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదుపై ముంబై పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీ సీఈవో, టెక్నికల్ హెడ్లకు సమన్లు పంపిన అధికారులు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేయాల్సి ఉందని కోరారు.కోల్డ్‌ప్లే ఇండియా టూర్ టిక్కెట్ల వ్యవహారానికి సంబంధించి బుక్‌మైషోపై ఫిర్యాదు చేసిన న్యాయవాది అమిత్ వ్యాస్.. రూ.2,500 ఉన్న టెకెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేసి రూ.3 లక్షల వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే అమిత్ వ్యాస్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన అధికారులు.. టికెట్ల దందాలో పాల్గొన్న పలువురు బ్రోకర్లను గుర్తించారు. -
'కల్కి' ఖాతాలో నెవ్వర్ బిఫోర్ రికార్డ్.. బలైపోయిన షారూఖ్
థియేటర్లలోకి వచ్చి మూడు వారాలు అవుతున్నా 'కల్కి' జోరు ఇంకా తగ్గట్లేదు. దీనికి పోటీ ఇచ్చే మరో సినిమా లేకపోవడం కూడా బాగా ప్లస్ అయింది. దీంతో జనాలు ఇంకా థియేటర్లకు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే వసూళ్లలో అద్భుతమైన రికార్డులు నెలకొల్పిన 'కల్కి'.. ఇప్పుడు మరో క్రేజీ ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా ఎవరికీ సాధ్యం కానీ విధంగా ప్రభాస్ తన కొత్త సినిమాతో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇంతకీ అదేంటంటే?ఒకప్పటితో పోలిస్తే సినిమా టికెట్లన్నీ ఆన్లైన్లోనే దాదాపుగా సేల్ అవుతున్నాయి. అలా బుక్ మై షోలో 'కల్కి' చిత్రానికి ఇప్పటివరకు 12.15 మిలియన్ల బుక్ అయ్యాయి. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే 'జవాన్' మూవీకి లైఫ్ టైమ్ వచ్చిన 12.01 మిలియన్ల మార్క్‌ని ప్రభాస్ మూవీ అధిగమించింది. తద్వారా దేశంలో ఇలా అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన మూవీగా 'కల్కి' అరుదైన ఘనత సాధించింది.ప్రస్తుతం చెప్పుకొన్నది ఆన్లైన్ వరకే. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా చోట్లు ఉన్న సింగిల్ స్క్రీన్లలో సాధారణంగా ఇచ్చే టికెట్లు కూడా లక్షల్లోనే అమ్ముడిపోయి ఉండొచ్చు. తద్వారా ఇప్పటివరకు లేని విధంగా 'కల్కి' సరికొత్త రికార్డులు సాధిస్తుండటం విశేషం. ట్రెండ్ చూస్తుంటే ఇప్పట్లో ఈ రికార్డులు ఎవరైనా అందుకుంటారా అనేది సందేహంగా మారుతోంది. -
Movie Tickets: రూ.99కే సినిమా టిక్కెట్లు!
జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 13, శుక్రవారం రోజున మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూ.99కే సినిమా టిక్కెట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫ్ర్ కేవలం ఇండియా సినిమాలకే కాకుండా ది ఎక్సార్సిస్ట్:బిలీవర్, పాపెట్రోల్ వంటి హాలీవుడ్ సినిమాలకు కూడా వర్తిస్తుందని తెలిపారు. జవాన్, గదర్2, మిషన్ రాణిగంజ్ వంటి బాలీవుడ్ సినిమాలతో సహా అన్ని నేషనల్ మూవీస్‌కు రూ.99 టిక్కెట్ అందుబాటులో ఉంటుంది. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి స్టార్లు కూడా తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కొత్త రూ.99 ఆఫర్‌ను ప్రచారం చేస్తున్నారు. #NationalCinemaDay par aap sab ke liye ek bahut khaas tohfaa, only for the love of cinema! Iss 13th October, jaiye aur dekhiye Jawan at just Rs. 99! Book your tickets now!https://t.co/fLEcPK9UQT Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/uS3LfpcTNb — Shah Rukh Khan (@iamsrk) October 12, 2023 సినిమా టిక్కెట్లను ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో లేదా బాక్సాఫీస్ వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకునే వారు మాత్రం సంబంధిత మల్టీప్లక్స్‌లు అందించే వెబ్సైట్ల్లోకి వెళ్లి ఫుడ్, బేవరేజెస్ వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది జాతీయ సినిమా దినోత్సవం రోజున రికార్డు స్థాయిలో థియేటర్లో 6.5 మిలియన్ల అడ్మిషన్లు వచ్చాయి. ఈ సంవత్సరం 4000 స్క్రీన్లలో ఈ ఆఫర్ ఉండనుంది. పీవీఆర్ ఐనాక్స్, సినోపోలీస్, మిరాజ్, సిటీప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2, మూవీటైం, వేవ్, ఎం2కే, డెలైట్ వంటి మల్టీప్లెక్స్‌ల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది. This cheer right here is why we do what we do... Thank you fans for the full houses & full hearts filled with love. Nothing matters beyond YOU. HAPPY NATIONAL CINEMA DAY. pic.twitter.com/R7h5v6xKZa — Ajay Devgn (@ajaydevgn) October 13, 2023 -
'BookMyShow'లో సినిమా టికెట్‌ను ఎలా రద్దు చేయాలి
ఒకప్పుడు సినిమా చూసేందుకు టికెట్ల కోసం థియేటర్ల ముందు క్యూలు కట్టేవారు. అయితే, కాలం మారింది. టికెట్ కొనుగోలులో అనేక మార్పులు వచ్చాయి. థియేటర్‌కి వెళ్లకుండా ఫోన్లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. కావాల్సిన సీటును ఎంచుకుని టికోట్టు కొనుక్కుంటే పని తేలిక. షో ప్రారంభానికి 5 నిమిషాల ముందు థియేటర్లోకి ప్రవేశిస్తే హాయిగా కూర్చుని నచ్చిన సినిమా చూసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు పలు కారణాల వల్ల మనం బుక్ చేసుకున్న టికెట్‌ను రద్దు చేయాల్సి వస్తుంది. అప్పుడు టికెట్ కోసం ఖర్చు చేసిన డబ్బు గురించి ఆలోచిస్తాం. ఈ విషయంలో చాలామంది టెన్షన్ పడతారు. అంత డబ్బు చెల్లించి టికెట్ బుక్ చేసుకున్నామంటే వృధా అని అనుకుంటున్నారు. కానీ చింతించకండి. ఎందుకంటే, మీరు సులభంగా టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు అంతే కాకుండా ఆ డబ్బును కూడా తిరిగి పొందవచ్చు. BookMyShowలో టికెట్‌ను రద్దు చేయడానికి: ► మీ మొబైల్లో 'BookMyShow' యాప్‌ని ఓపెన్ చేయండి.. ► మీరు లాగ్ అవుట్ అయితే లాగిన్ అయి యాప్‌ని ఓపెన్ చేయండి.. ► ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి.. ► Your Orders అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.. ► మీరు బుక్ చేసుకున్న టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.. లిస్ట్ వస్తుంది. ► సినిమాని చూడటానికి మీరు బుక్ చేసిన టిక్కెట్‌ను ఎంచుకోండి. ► ఆపై బుకింగ్ ఎంపికను రద్దు చేయి అని వస్తుంది అక్కడ క్లిక్ చేయండి. ► స్క్రీన్‌పై క్రిందికి స్క్రోల్ చేయండి ► రీఫండ్ చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి. ► వాపసు పొందండి అని వస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. 'బుక్‌మైషో' అధికారిక వెబ్సైట్లో టికెట్‌ను ఎలా రద్దు చేయాలి? బుక్‌మైషో ద్వారా టికెట్లను కొందరు మొబైల్ యాప్‌ను ఉపయోగించి చేస్తే.. మరికొందరు మాత్రం సినిమా టికెట్లను బుక్ చేసుకోవడానికి బుక్ మై షో అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తారు. వారు కూడా అధికారిక వెబ్సైట్ నుంచి సినిమా టికెట్‌ను బుక్ చేసినట్లయితే, దానిని రద్దు చేయవచ్చు. ► బుక్ మై షో అధికారిక వెబ్‌సైట్‌ను తెరవండి. ► మీ ఖాతాకు లాగిన్ చేయండి. ► కుడి వైపున మీ ప్రొఫైల్‌ని తెరవండి. ► కొనుగోలు చరిత్రను ఎంచుకోండి. టిక్కెట్‌పై క్లిక్ చేయండి. ► స్క్రీన్‌పైకి స్క్రోల్ చేయండి, రద్దు చేయి నొక్కండి. ► వాపసు చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి. ► ధృవీకరించుపై క్లిక్ చేయండి. ► గమనిక : కొన్నిసార్లు ఈ వెబ్సైట్ పనిచేయకపోవచ్చు మీరు సూపర్ స్టార్ కస్టమర్ అయితే టికెట్‌ను ఎలా రద్దు చేయాలి? Bookmyshow యాప్ తన సూపర్ స్టార్ కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఒక వ్యక్తి సూపర్ స్టార్ కస్టమర్ అయితే, టికెట్ కోసం చెల్లించిన పూర్తి మొత్తాన్ని వారు పొందుతారు. ఎవరైనా కస్టమర్ బుక్ మై షో నుంచి 1 సంవత్సరం లోపు 10 కంటే ఎక్కువ టిక్కెట్లు బుక్ చేసినట్లయితే, అతన్ని 'సూపర్ స్టార్ కస్టమర్' అంటారు. అయితే ఈ సూపర్ స్టార్ కస్టమర్ తన టికెట్‌ను ఎలా రద్దు చేయగలడు? పూర్తి వాపసు ఎలా పొందాలో తెలుసుకోండి. ► BookMyShow యాప్‌ను తెరవండి. ► మీ ప్రొఫైల్‌కి వెళ్లండి ఆపై మీ టికెట్ ఆర్డర్ల ఎంపికపై క్లిక్ చేయండి. ► టిక్కెట్‌ను ఎంచుకోండి. ► సూపర్‌స్టార్ రద్దుపై క్లిక్ చేయండి. ► అసలు చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి. ► వాపసు పొందండిపై క్లిక్ చేయండి. ► మీ టికెట్ రద్దును నిర్ధారించండి. అంతటితో మీ డబ్బు బ్యాంకు ఖాతాలోకి జమ అవుతుంది. BookMyShow టికెట్ రద్దు నియమాలు BookMyShow టికెట్‌ను రద్దు చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మనం వాటికి లోబడి క్యాన్సల్ చేయగలుగుతాం. మీరు వారు ఇచ్చిన నియమాలను పాటించి.. టికెట్లను సులభంగా రద్దు చేసి డబ్బును తిరిగి పొందవచ్చు.బుక్ మై షోలో టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే సినిమా స్టార్ట్ అయ్యే 4 గంటల ముందు చేయాలి.. తర్వాత టికెట్ క్యాన్సిల్ చేయలేరు. మీరు సరైన సమయంలో టిక్కెట్‌ను రద్దు చేయకుంటే డబ్బులో 30% తీసివేయబడుతుంది. మిగిలిన మొత్తం మీకు లభిస్తుంది. మీరు రీఫండ్ చెల్లింపు కోసం క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా నెట్-బ్యాకింగ్ పద్ధతిని ఎంచుకున్నట్లయితే, దానికి 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. చెల్లింపు మీ ఖాతాలో జమ చేయబడుతుంది. అదే బుక్‌మై షో వాలెట్‌కు కావాలని రిక్వెస్ట్ పెడితే కొన్ని గంటల్లోనే వాలెట్‌లోకి డబ్బు జమ అవుతుంది. -
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ సరికొత్త రికార్డ్
ఎవరిని కదిపినా సరే 'ఆదిపురుష్' సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చేసిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకుల్ని అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తోంది. తొలిరోజు షోలన్నీ ఇప్పటికే హౌస్ ఫుల్స్ అయిపోయాయి. ఇలాంటి టైంలో ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ రాముడిగా నటించిన 'ఆదిపురుష్'ని రామాయణం ఆధారంగా తీశారు. టీజర్ ని గతేడాది రిలీజ్ చేసిన టైంలో ఈ మూవీపై ఘోరమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో థియేటర్లలోకి వచ్చి ఈ సినిమాని ఎవరైనా చూస్తారా అని అందరూ అనుకున్నారు. కానీ ట్రైలర్స్ విడుదల చేసిన తర్వాత నెగిటివిటీ కాస్త పాజిటివ్ గా మారింది. అంతటా హైప్ ఏర్పడింది. దీంతో జనాలు 'ఆదిపురుష్'పై ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. 'ఆదిపురుష్'పై ఇష్టాన్ని చాలామంది సోషల్ మీడియాలో చూపిస్తే.. మరికొందరు టికెట్స్ అమ్మే బుక్ మై షోలో లైక్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలా ఇప్పటివరకు 1.1 మిలియన్ యూజర్స్.. ఈ టికెట్ బుకింగ్ సైట్ లో 'ఆదిపురుష్'కి లైక్ కొట్టారు. దీంతో 1 మిలియన్ మార్క్ అందుకున్న మూవీగా ఇది ఘనత సాధించింది. ఈ లిస్టులో 'ఆర్ఆర్ఆర్'.. 1.75 మిలియన్ లైక్స్ తో టాప్ లో ఉంది. మరి మీలో ఎవరైనా 'ఆదిపురుష్' చూశారా? (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' థియేటర్లో నిజంగానే ప్రత్యక్షమైన హనుమాన్!) -
మరో 10 రోజుల్లో క్రికెట్ పండుగ.. ఆన్లైన్లో టికెట్లు ఇలా బుక్ చేసుకోవచ్చు
ఐపీఎల్-2023 సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 10 రోజుల్లో క్రికెట్ పండుగ ప్రారంభంకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మార్చి 31న జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభమవుతుంది. మార్చి 31 నుంచి మే 28 వరకు జరిగే ఈ క్రికెట్ సంబరంలో మొత్తం 70 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రతి జట్టు సొంత మైదానాల్లో 7 మ్యాచ్‌లు ఆడనుండటంతో ఈసారి మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందు భారీ సంఖ్యలో అభిమానులు మైదానాలకు తరలిరావచ్చని నిర్వహకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్లకు భారీగా డిమాండ్ పెరుగనుంది. దీంతో అభిమానులు టికెట్ల కోసం ముందుగానే ఎగబడుతున్నారు. ఈ సీజన్‌కు సంబంధించి ఆన్లైన్లో బుకింగ్ సేవలను పేటీఎమ్ ఇన్సైడర్.ఇన్, బుక్ మై షో, టికెట్జీనీ సంస్థలు అందిస్తున్నాయి. ఆయా ఫ్రాంచైజీల అధికారిక వెబ్సైట్ల ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ల ధరలు రూ. 500 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది (వెన్యూని బట్టి టికెట్ ధర నిర్ణయించబడుతుంది). వెబ్సైట్ లేదా సంబంధిత యాప్‌ల ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. బుకింగ్ కన్ఫర్మేషన్ అయిన 72 గంటల తర్వాత టికెట్ హార్ఢ్ కాపీని ఆన్లైన్లోనే పొందవచ్చు. -
ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు..
కరోనా మహామ్మారి రాకతో కేంద్రప్రభుత్వం లాక్డౌన్ అమలు చేసింది. దీంతో అనేక వ్యవస్థలు కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అనేక సంస్థలతోపాటు ఎంటర్టైన్మెంట్కు మూల స్థంభాలైన థియేటర్లు కూడా మూతపడ్డాయి. లాక్డౌన్ కారణంగా ఏ ఒక్కరూ బయటకు వెళ్లకుండా ఇంట్లోనే గడపాల్సిన పరిస్థతి. అప్పుడే ప్రతీ సినీ ప్రేక్షకుడికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వినోదపు ప్లాట్ఫామ్ల్లా దర్శనమిచ్చాయి. పెద్ద హీరోల నుంచి చిన్న సినిమాలు వరకు అన్ని ఈ ఓటీటీల్లోనే రిలీజయ్యాయి. చదవండి: రిలీజైన నెలలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ఓటీటీ సిత్రాలు.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన వెబ్ సిరీస్‌లతో ఓటీటీలు కళకళలాడాయి. దీంతో మూవీ లవర్స్ అందరూ బయటకు వెళ్లే పనిలేకుండా అరచేతిలో, ఇంటి హాల్లోనే సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఆస్వాదించారు. ఇప్పటికీ కూడా థియేటర్లలో విడుదలైన పెద్ద హీరోల సినిమాలను సైతం ఒక నెలలోపే ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓటీటీలకు ఎలాంటి క్రేజ్ ఉందనేది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓటీటీల్లో మూవీ లవర్స్ కచ్చితంగా మిస్ అవ్వకూడని టాప్ 6 పర భాష చిత్రాలేంటో చూద్దాం. 1. ప్రవీణ్ తాంబే ఎవరు ?, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 2. 83, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ 3. డ్యూన్, అమెజాన్ ప్రైమ్ వీడియో 4. ఇరుది పక్కమ్ (తమిళం), అమెజాన్ ప్రైమ్ వీడియో 5. పడా (మలయాళం), అమెజాన్ ప్రైమ్ వీడియో 6. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్, బుక్ మై షో చదవండి: టాలీవుడ్ టూ హాలీవుడ్.. ఓటీటీల్లో రచ్చ చేస్తున్న సినిమాలు ఇవే -
ఓటీటీలో స్పైడర్ మ్యాన్ సినిమా, ఎప్పటినుంచంటే?
స్పైడర్ మ్యాన్ సినిమా సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్లో స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ సినిమా రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపించిన ఈ మూవీ తాజాగా ఓటీటీ బాట పట్టింది. బుక్‌మైషోలో స్పైడర్ మ్యాన్ రిలీజ్ అవుతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మార్చి 23 నుంచి బుక్ మై షో స్ట్రీమ్‌లో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. కాగా హలీవుడ్ స్టార్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ సిరీస్‌లలోనే ఇది ఉత్తమ చిత్రం అని చెప్పవచ్చు. ఎమ్సీయూలో 27వ చిత్రంగా వచ్చిన ఈ మూవీకి జాన్ వాట్స్ దర్శకత్వం వహించగా జెండీయా, బెనెడిక్ట్ కంబర్బ్యాచ్, విలియమ్ డాఫే, జేమీ ఫాక్స్, ఆల్ఫ్రెడ్ మొలీనా కీలక పాత్రలు పోషించారు. ఆండ్య్రూ గ్యారీఫీల్డ్, టోబే మాగ్వైర్లు కూడా స్పైడర్ మ్యాన్ పాత్రల్లో అలరించారు. చదవండి: బాడీ షేమింగ్ ట్రోలింగ్‌పై స్పందించిన బిగ్‌బాస్ విన్నర్ It’s a swing and a hit, right on your screens at home 🤩 Spidey is landing soon on BMS Stream. Pre-book now! . . .#spiderman #spidermannowayhome #tomholland #marvel #streaming #spidermanstream pic.twitter.com/b4Af8dYYZt — BookMyShow Stream (@BmsStream) March 10, 2022 -
BookMyShow: తప్పని కోవిడ్ కష్టాలు
వెబ్‌డెస్క్ : ఆన్లైన్ టికెట్ బుకింగ్ వెబ్సైట్ బుక్ మై షోపై కోవిడ్ ఎఫెక్ట్ పడింది. కరోనా సంక్షోభ సమయంలో ఛారిటీ సేవల్లో ముందున్న ఈ సంస్థకు కష్టాలు తప్పలేదు. చాలా రోజులుగా కంపెనీ కార్యాకలాపాలు నిలిచిపోవడంతో రెండు వందల మంది ఉద్యోగులను బయటకు పంపింది. ఈ మేరకు బుక్ మై షో ఫౌండర్, సీఈవో ఆశీష్ హేమ్రజనీ ప్రకటించారు. నైపుణ్యం కలవాళ్లు కరోనా ప్యాండమిక్ కష్టకాలంలో తామంతా కలిసికట్టుగా పని చేశామని, ఎంతో మందికి సేవలు అందించినట్టు ఆశీష్ పేర్కొన్నారు. అయితే పరిస్థితులు గాడిన పడకపోవడంతో ఎంతో కష్టంగా 200 మంది ఉద్యోగులను వదులుకున్నట్టు ఆయన చెప్పారు. కంపెనీ వదులుకున్న ఉద్యోగులంతా నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన వారని, ఎవరైనా వాళ్లకి అవకాశం ఇవ్వాలంటూ ట్విట్టర్ వేదికగా ఆశీష్ కోరారు. 15 నెలలుగా ఈ కామర్స్ రంగం మొగ్గదశలో ఉన్నప్పుడు 1999లో ఆశీష్ హేమ్రజనీ బుక్‌మైషో ను ప్రారంభించారు. అంచెలంచెలుగా దేశమంతటా తమ సర్వీసులు విస్తరించారు. అయితే కరోనా కారణంగా ఈవెంట్స్, సినిమా థియేటర్లు మూత పడటంతో బుక్ మై షో పరిస్థితి తారుమారైంది. దాదాపు 15 నెలలుగా బుక్ మై షో నామమాత్రపు సేవలు అందిస్తోంది. చదవండి: 5జీతో ఏడాదిలో రెట్టింపైన టెలికాం రంగం ఉద్యోగాలు COVID19 has taught me many lessons & I learnt another one today. As we let go of 200 of the most incredibility talented & performance driven individuals, each & everyone has messaged, thanking me for the opportunity, the love for @bookmyshow and asking me if they could help (1/4) — ashish hemrajani (@fafsters) June 10, 2021 -
బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్‌కు జరిమానా
సాక్షి, హైదరాబాద్: టికెట్ ధర కన్నా అధిక రుసుము వసూలు చేసిన బుక్‌మైషో, పీవీఆర్ సినిమాలపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ కొరడా ఝుళిపించింది. ఇంటర్నెట్ చార్జీల పేరుతో అధికంగా డబ్బులు గుంజడాన్ని సవాలు చేస్తూ విజయ్ గోపాల్ అనే వ్యక్తి వినియోగదారుల ఫోరంలో గతేడాది ఫిర్యాదు చేశాడు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు సుమారు 25 నెలల తర్వాత తుది తీర్పు వెలువరించింది. ఇంటర్నెట్ చార్జీల పేరిట పై రెండూ ప్రేక్షకుడి నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించింది. దీంతో బుక్‌మైషో, పీవీఆర్ సినిమాస్ బాధితుడికి 25 వేల రూపాయల నష్టపరిహారంతో పాటు కేసు ఖర్చుల కింద మరో 1000 రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. లీగల్ ఎయిడ్ కింద కోర్టుకు రూ.5 వేలు కట్టాలని తీర్పు చెప్పింది. చదవండి: స్క్రీన్ షాట్లు షేర్ చేసినందుకు చాలా సంతోషం: నాగ్ మహేశ్‌బాబు సరసన జాన్వీ కపూర్! -
బుక్‌మైషోలో 270 ఉద్యోగాల కోత
వైరస్ మహమ్మారి విజృంభణతో చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బుక్‌మైషో కంపెనీ కూడా ఈ జాబితాలో చేరింది. కోవిడ్-19 కారణంగా త్వరలో తమ కంపెనీలో పనిచేస్తోన్న 1,450 మంది సిబ్బందిలో 20 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు బుక్‌మైషో ప్రకటించింది. దీంతో 270 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. వైరస్ కారణంగా ఏర్పడిన ఆర్థిక అసమానతలు తగ్గించుకునేందుకు, ఈక్రమంలోనే ఖర్చులను అదుపుచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ రాబోయే నెలల్లో చేపడతామని వివరించింది. ఇప్పటికే వేతనంలేని సెలవుల్లో ఉన్నవారు, ఉద్యోగాలు కోల్పోయినవారికి ఉద్యోగ ప్రమాణాల ప్రకారం అన్ని వైద్య, బీమా ,గ్రాట్యూటీ ఇతర అలవెన్సులు అందిస్తామని బుక్‌మైషో చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆశిస్ హేమరాజని వెల్లడించారు. తద్వారా ఉద్యోగులకు ఆర్థిక సాయం అందుతున్నారు. ఇంకా కంపెనీలో కొన్ని టీమ్‌లు స్వచ్చందంగా 10 నుంచి 50 శాతం వరకు వేతనాల్లో కోత విధించుకున్నాయని, బోనస్‌లను సైతం వదులకున్నాయని తెలిపారు. కంపెనీకి సంబంధించి ఇతర రకాల ఖర్చులను తగ్గించుకున్నట్లు ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి ప్రపంచదేశాల్లో విజృంభించి అనేక రకాల పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీసింది. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు చేపట్టిన చర్యల్లో లాక్డౌన్ చాల ముఖ్యమైనది. దీని ద్వారా వైరస్ వ్యాప్తికి కొంత మేర అడ్డుకట్ట వేసినప్పటికీ.. మల్టీప్లెక్స్‌లు, థియేటర్లు, స్టేడియంలు, మాల్స్ మూతపడడం వల్ల, ఎక్కడివారు అక్కడే ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఈ వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. నష్టాలను పూడ్చుకునేందుకు, వ్యయభారాలను కొంత మేర తగ్గించుకునేందుకు ఆయా కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. గతవారంలో ఓలా, ఉబర్, జొమాటో, స్విగ్గీ, రోల్స్‌రాయిస్ వంటి కంపెనీలు వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. -
అమెజాన్‌లో మూవీ టికెట్లు
సాక్షి, ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా తన ప్లాట్‌ఫాం ద్వారా భారతదేశంలో సినిమా టిక్కెట్లను కూడా విక్రయించనుంది. ఇందుకోసం ప్రముఖ టిక్కెట్ బుకింగ్ యాప్ ‘బుక్‌మైషో’తో అమెజాన్ ఇండియా ఒప్పందం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు నాన్ ప్రైమ్ వినియోగదారులకు కూడా దీని ద్వారా సినిమా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ ప్రస్తుతం యాప్ లేదా మొబైల్ సైట్లో మాత్రమే అందుబాటులో ఉంది. కస్టమర్ల జీవితాలను సాధ్యమైనంత సరళీకృతం చేయడమే లక్ష్యం, షాపింగ్ చేస్తున్నప్పుడు, బిల్లులు చెల్లించేటప్పుడు లేదా ఇతర సేవలను కోరుకునేటప్పుడు వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించే ప్రయాణంలో మరో మెట్టు అని అమెజాన్ పే డైరెక్టర్ మహేంద్ర నెరుర్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అమెజాన్‌లో 'మూవీ టికెట్స్' ఆప్షన్‌ను అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందని బుక్ మైషో వ్యవస్థాపకుడు సీఈవో ఆశిష్ హేమరాజని తెలిపారు. బుకింగ్ ఎలా చేసుకోవాలి? అమెజాన్.ఇన్ యూజర్లకోసం 'షాప్ బై కేటగిరీ' లేదా అమెజాన్ పే టాబ్ కింద 'మూవీ టిక్కెట్లు' కేటగిరీని కొత్తగా జోడించింది. దీంతో అమెజాన్ మొబైల్ యాప్‌లో ‘షాపింగ్ బై కేటగిరీ’ విభాగంలో అమెజాన్ పే టాబ్ లో ‘మూవీ టికెట్లు’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మూవీ టికెట్లు ఆప్షన్‌ను క్లిక్ చేసి, ప్రాంతం, జోన్‌పై క్లిక్ చేసిన అనంతరం నచ్చిన సినిమాని ఎంచుకోవాలి. ఆ తర్వాత సినిమా థియేటర్, షో టైమ్ సెలక్ట్ చేసుకొని అమెజాన్ పే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్, లేదా ఇతర డిజిటల్ పద్ధతులను ద్వారా డబ్బు చెల్లించి టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. సినిమా టిక్కెట్లను బుక్ చేసుకోవడం మాత్రమే కాదు పోస్టర్లు, కంటెంట్, సినిమాలపై రివ్యూలు రాసి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. లాంచ్ ఆఫర్లో భాగంగా అమెజాన్ మూవీ టికెట్ బుకింగ్‌పై 20 శాతం(రూ.200 దాకా) క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే అందుబాటులోఉండనుంది. అలాగే డెస్క్‌టాప్ వినియోగదారుల కోసం ప్రస్తుతం మూవీ టికెట్స్ ఆప్షన్ అందుబాటులోలేదు. -
బుక్‌మైషోతో ఫ్లిప్‌కార్ట్ చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ : అలీబాబాకు చెందిన పేటీఎంకు ఆన్లైన్ టిక్కెట్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషో కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ఇది చర్చలు జరుపుతోంది. ఒకవేళ ఈ చర్చలు కనుక సఫలమైతే, బుక్‌మైషోలో మైనార్టీ వాటా ఫ్లిప్‌కార్ట్ సొంతం కాబోతుంది. దీంతో దేశంలో అతిపెద్ద ఈ-టిక్కెటింగ్ సర్వీసు అయిన బుక్‌మైషో మరింత బలోపేతమవుతోందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. మైనార్టీ వాటా అమ్మకం ద్వారా నెమ్మదించిన విక్రయ వృద్ధిని పెంచుకోవచ్చని బుక్‌మైషో చూస్తోంది. అంతేకాక ఇది ఫ్లిప్‌కార్ట్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పేకు కూడా లబ్దిచేకూరనున్నట్టు తెలుస్తోంది. ఫోన్‌పేలో 500 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ గత వారమే ప్రకటించింది కూడా. అయితే ఈ విషయంపై స్పందించడానికి ఫ్లిప్‌కార్ట్ కానీ, బుక్‌మైషో కానీ స్పందించలేదు. బుక్‌మైషో ఇండోనేషియా, శ్రీలంక, యూఏఈ, న్యూజిలాండ్ దేశాల్లో కూడా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 1999లో ఏర్పాటుచేసిన ఈ ప్లాట్‌ఫామ్‌ను, 2007లో రీలాంచ్ చేశారు. దేశవ్యాప్తంగా 350 పట్టణాలు, సిటీల్లో ఇది తన కార్యకలాపాలు సాగిస్తోంది. మూవీలకు, క్రీడలకు, లైవ్ ఈవెంట్లకు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి బుక్‌మైషో యూజర్లకు అనుమతిస్తోంది. -
బుక్‌మైషో చేతికి ఎన్‌ఫ్యూజన్
న్యూఢిల్లీ: వీడియో–ఆన్–డిమాండ్ ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తున్న ఎన్ఫ్యూజన్ను కొనుగోలు చేసినట్లు ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ టికెటింగ్ కంపెనీ బుక్‌మైషో వెల్లడించింది. పూర్తిగా నగదుతో ఈ లావాదేవీ జరిగినప్పటికీ, ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందీ బుక్‌మైషో వెల్లడించలేదు. ఎన్‌ఫ్యూజన్ టెక్నాలజీని ఉపయోగించుకుని, తమ ఆన్లైన్ ఆడియో ఎంటర్టైన్మెంట్ విభాగం జ్యూక్‌బాక్స్ ద్వారా ఆడియో ఎంటర్టైన్మెంట్ను విస్తృతం చేస్తామని బుక్‌మైషో డైరెక్టర్ పరీక్షిత్ దర్ చెప్పారు. సోహిబ్ జీఎం ఖాన్, శివగురునాథన్, ప్రభాకర్‌రెడ్డిలు 2009లో ప్రారంభించిన ఎన్‌ఫ్యూజన్...ఆన్లైన్ ద్వారా వీడియోలు స్ట్రీమ్ చేసుకునే సేవల్ని అందిస్తోంది. -
బుక్‌మైషో చేతికి బర్ప్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ టికెట్ సేవల సంస్థ బుక్‌మైషో (బీఎంఎస్) తాజాగా ముంబైకి చెందిన బర్ప్ సంస్థను కొనుగోలు చేసింది. స్థానిక రెస్టారెంట్ల సమాచార వివరాలు అందించే ఈ సంస్థను నెట్వర్క్18 నుంచి దక్కించుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ బిగ్ట్రీలో భాగమైన ఫుడ్ఫెస్టా వెల్‌కేర్ ద్వారా ఈ డీల్ పూర్తి చేస్తున్నట్లు బీఎంఎస్ తెలిపింది. నెట్వర్క్18కి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్ గ్రూప్ కాగా.. బీఎంఎస్ బిగ్‌ట్రీ నిర్వహణలో ఉంది. 2006లో ప్రారంభమైన బర్ప్లో ప్రస్తుతం 12 నగరాల్లోని 56,000 పైచిలుకు రెస్టారెంట్లు లిస్ట్ అయి ఉన్నాయి. 2016–17లో సంస్థ ఆదాయం రూ. 56.67 లక్షలు. నెట్వర్క్18 టర్నోవర్‌లో ఇది 0.69 శాతం. 2017 మార్చి ఆఖరు నాటికి బర్ప్ నికర విలువ మైనస్ రూ. 28.89 కోట్లుగా ఉంది. స్లంప్ సేల్ ప్రాతిపదికన కన్సల్టెన్సీ సంస్థ ఈవై.. బర్ప్ విలువను రూ. 6.7 లక్షలుగా లెక్కగట్టినట్లు నెట్వర్క్18 పేర్కొంది. -
ఆ సినిమా దెబ్బకు ’బుక్ మై షో’ సర్వర్ డౌన్!
మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ తాజా సినిమా ‘దంగల్’ శుక్రవారం విడుదల అవుతుండటంతో ఈ సినిమా టికెట్లను ముందస్తుగా బుక్ చేసుకోవడానికి జనం పోటెత్తారు. దీంతో ఒక దశలో బుక్ మై షో.కామ్ వెబ్సైట్ సర్వర్ డౌన్ అయి.. క్రాష్ అయినట్టు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్న సమయంలో కొంతసేపు వెబ్సైట్ సర్వర్ మొరాయించినట్టు తెలుస్తోంది. దీంతో వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన కొంతమంది వినియోగదారులకు ఎర్రర్ మెసేజ్ వచ్చింది. సినిమాలు, ప్రత్యేక షోల ఈ-టికెట్లు అడ్వాన్స్‌గా బుక్ చేసుకొనే సదుపాయన్ని బుక్‌మైషో వెబ్సైట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. రెజ్లింగ్ ఇతివృతంతో వస్తున్న ఆమిర్ తాజా చిత్రం ’దంగల్’కు సానుకూల రివ్యూలు పోటెత్తడం, మంచి మౌత్‌టాక్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ముంబై, పుణె వంటి నగరాల్లో ఇప్పటికే చాలా థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు అయిపోయాయి. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రారంభ వసూళ్లు భారీగా ఉంటాయని భావిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనూ మంచి టాక్‌తో ఈ సినిమా థియేటర్లు ఫుల్ అవుతున్నాయని తెలుస్తోంది. తెలుగులోనూ ’దంగల్’ సినిమా ’యుద్ధం’ పేరిట డబ్ అయింది.