స్పైడర్ మ్యాన్ సినిమా సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్‌లో స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ సినిమా రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపించిన ఈ మూవీ తాజాగా ఓటీటీ బాట పట్టింది. బుక్‌మైషోలో స్పైడర్ మ్యాన్ రిలీజ్ అవుతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మార్చి 23 నుంచి బుక్ మై షో స్ట్రీమ్‌లో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది.
కాగా హలీవుడ్ స్టార్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ సిరీస్‌లలోనే ఇది ఉత్తమ చిత్రం అని చెప్పవచ్చు. ఎమ్సీయూలో 27వ చిత్రంగా వచ్చిన ఈ మూవీకి జాన్ వాట్స్ దర‍్శకత్వం వహించగా జెండీయా, బెనెడిక్ట్ కంబర్‌బ‍్యాచ్, విలియమ్ డాఫే, జేమీ ఫాక్స్, ఆల్ఫ్రెడ్ మొలీనా కీలక పాత్రలు పోషించారు. ఆండ్య్రూ గ్యారీఫీల్డ్, టోబే మాగ్వైర్లు కూడా స్పైడర్ మ్యాన్ పాత్రల్లో అలరించారు.
చదవండి: బాడీ షేమింగ్ ట్రోలింగ్‌పై స్పందించిన బిగ్‌బాస్ విన్నర్
It’s a swing and a hit, right on your screens at home 🤩
— BookMyShow Stream (@BmsStream) March 10, 2022
Spidey is landing soon on BMS Stream. Pre-book now!
.
.
.#spiderman #spidermannowayhome #tomholland #marvel #streaming #spidermanstream pic.twitter.com/b4Af8dYYZt
Comments
Please login to add a commentAdd a comment