సాక్షి, ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా తన ప్లాట్‌ఫాం ద్వారా భారతదేశంలో సినిమా టిక్కెట్లను కూడా విక్రయించనుంది. ఇందుకోసం ప్రముఖ టిక్కెట్ బుకింగ్ యాప్ ‘బుక్‌మైషో’తో అమెజాన్ ఇండియా ఒప్పందం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు నాన్ ప్రైమ్ వినియోగదారులకు కూడా దీని ద్వారా సినిమా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ ప్రస్తుతం యాప్ లేదా మొబైల్ సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
కస్టమర్ల జీవితాలను సాధ్యమైనంత సరళీకృతం చేయడమే లక్ష్యం, షాపింగ్ చేస్తున్నప్పుడు, బిల్లులు చెల్లించేటప్పుడు లేదా ఇతర సేవలను కోరుకునేటప్పుడు వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించే ప్రయాణంలో మరో మెట్టు అని అమెజాన్ పే డైరెక్టర్ మహేంద్ర నెరుర్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అమెజాన్లో 'మూవీ టికెట్స్' ఆప్షన్‌ను అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందని బుక్ మైషో వ్యవస్థాపకుడు సీఈవో ఆశిష్ హేమరాజని తెలిపారు.
బుకింగ్ ఎలా చేసుకోవాలి?
అమెజాన్.ఇన్ యూజర్లకోసం 'షాప్ బై కేటగిరీ' లేదా అమెజాన్ పే టాబ్ కింద 'మూవీ టిక్కెట్లు' కేటగిరీని కొత్తగా జోడించింది. దీంతో అమెజాన్ మొబైల్ యాప్‌లో ‘షాపింగ్ బై కేటగిరీ’ విభాగంలో అమెజాన్ పే టాబ్ లో ‘మూవీ టికెట్లు’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
మూవీ టికెట్లు ఆప్షన్‌ను క్లిక్ చేసి, ప్రాంతం, జోన్‌పై క్లిక్ చేసిన అనంతరం నచ్చిన సినిమాని ఎంచుకోవాలి. ఆ తర్వాత సినిమా థియేటర్, షో టైమ్ సెలక్ట్ చేసుకొని అమెజాన్ పే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్, లేదా ఇతర డిజిటల్ పద్ధతులను ద్వారా డబ్బు చెల్లించి టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు.
సినిమా టిక్కెట్లను బుక్ చేసుకోవడం మాత్రమే కాదు పోస్టర్లు, కంటెంట్, సినిమాలపై రివ్యూలు రాసి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా అమెజాన్ మూవీ టికెట్ బుకింగ్‌పై 20 శాతం(రూ.200 దాకా) క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే అందుబాటులోఉండనుంది. అలాగే డెస్క్‌టాప్ వినియోగదారుల కోసం ప్రస్తుతం మూవీ టికెట్స్ ఆప్షన్ అందుబాటులోలేదు.
Comments
Please login to add a commentAdd a comment