Movie Tickets: రూ.99కే సినిమా టిక్కెట్లు! | National Cinema Day: Movie Tickets For Just Rs 99 | Sakshi
Sakshi News home page

Movie Tickets: రూ.99కే సినిమా టిక్కెట్లు!

Published Fri, Oct 13 2023 11:13 AM | Last Updated on Fri, Oct 13 2023 11:23 AM

Movie Tickets For Rs 99 - Sakshi

జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 13, శుక్రవారం రోజున మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూ.99కే సినిమా టిక్కెట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫ్‌ర్‌ కేవలం ఇండియా సినిమాలకే కాకుండా ది ఎక్సార్సిస్ట్:బిలీవర్, పాపెట్రోల్‌ వంటి హాలీవుడ్‌ సినిమాలకు కూడా వర్తిస్తుందని తెలిపారు. 

జవాన్, గదర్2, మిషన్ రాణిగంజ్ వంటి బాలీవుడ్ సినిమాలతో సహా అన్ని నేషనల్‌ మూవీస్‌కు రూ.99 టిక్కెట్‌ అందుబాటులో ఉంటుంది. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి స్టార్లు కూడా తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కొత్త రూ.99 ఆఫర్‌ను ప్రచారం చేస్తున్నారు.

సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల్లో లేదా బాక్సాఫీస్ వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే వారు మాత్రం సంబంధిత మల్టీప్లక్స్‌లు అందించే వెబ్‌సైట్‌ల్లోకి వెళ్లి ఫుడ్‌, బేవరేజెస్‌ వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. 

 
గత ఏడాది జాతీయ సినిమా దినోత్సవం రోజున రికార్డు స్థాయిలో థియేటర్లో 6.5 మిలియన్ల అడ్మిషన్లు వచ్చాయి. ఈ సంవత్సరం 4000 స్క్రీన్లలో ఈ ఆఫర్‌ ఉండనుంది. పీవీఆర్‌ ఐనాక్స్‌, సినోపోలీస్‌, మిరాజ్‌, సిటీప్రైడ్‌, ఏషియన్‌, ముక్తా ఏ2, మూవీటైం, వేవ్‌, ఎం2కే, డెలైట్‌ వంటి మల్టీప్లెక్స్‌ల్లో ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement