సాక్షి, హైదరాబాద్: టికెట్ ధర కన్నా అధిక రుసుము వసూలు చేసిన బుక్‌మైషో, పీవీఆర్ సినిమాలపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ కొరడా ఝుళిపించింది. ఇంటర్నెట్ చార్జీల పేరుతో అధికంగా డబ్బులు గుంజడాన్ని సవాలు చేస్తూ విజయ్ గోపాల్ అనే వ్యక్తి వినియోగదారుల ఫోరంలో గతేడాది ఫిర్యాదు చేశాడు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు సుమారు 25 నెలల తర్వాత తుది తీర్పు వెలువరించింది.
ఇంటర్నెట్ చార్జీల పేరిట పై రెండూ ప్రేక్షకుడి నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించింది. దీంతో బుక్‌మైషో, పీవీఆర్ సినిమాస్ బాధితుడికి 25 వేల రూపాయల నష్టపరిహారంతో పాటు కేసు ఖర్చుల కింద మరో 1000 రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. లీగల్ ఎయిడ్ కింద కోర్టుకు రూ.5 వేలు కట్టాలని తీర్పు చెప్పింది.
చదవండి: స్క్రీన్ షాట్లు షేర్ చేసినందుకు చాలా సంతోషం: నాగ్
మహేశ్‌బాబు సరసన జాన్వీ కపూర్!
Comments
Please login to add a commentAdd a comment