కింగ్ నాగార్జున హీరోగా, బాలీవుడ్ నటి దియా మీర్జా హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఈ చిత్రంలో నాగార్జున సరికొత్తగా కనబడనున్నాడు. ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో అహిషోర్ సాల్మోన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా, రుద్ర ప్రదీప్ ఇతర పాత్రల్లో నటించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకానుంది.
ఈ చిత్రం ట్రైలర్‌ని ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఇటీవల మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే ఈ రోజు సాయంత్రం 4:05 నిమిషాలు మెగాస్టార్ చిరంజీవి.. ట్రైలర్ విడుదల చేయనున్నట్లు కింగ్ నాగార్జున శుక్రవారం ట్వీట్ చేశాడు. పరిశ్రమలో నాగ్-చిరులు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. నాగ్ ఇంట్లో ప్రతి కార్యక్రమానికి చిరు హజరవ్వడం, చిరు ఇంట్లో జరిగే ప్రతి వేడుకల్లో నాగ్ సందడి చేస్తుంటాడు. అంతేగాక పలు సినిమా ఫంక్షన్లకు కూడా హజరవుతూ.. నాగ్ హోస్ట్ చేసిన షోలకు చిరు, చిరు హోస్ట్ చేసిన షోలకు నాగ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యి అభిమానులను అలరిస్తుంటారు.
Very happy to share these Screenshots from my friends when they saw #WildDogTrailer#WildDogOnApril2nd@ahishor @MusicThaman @Deonidas @deespeak @SaiyamiKher @ActorAliReza @mayankparakh19 #PrakashSudarshan @onelifeitiz @pasha_always @MatineeEnt pic.twitter.com/cN0tEKKOHw
— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 12, 2021
Comments
Please login to add a commentAdd a comment