Ticket charges
-
బెంగళూరు ఎకానమీ చైర్‌కార్ చార్జి రూ.1,600
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ–యశ్వంతపూర్ (బెంగళూరు) వందేభారత్ రైలు (నం.20703) టికెట్ చార్జీలను దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. కాచిగూడ నుంచి యశ్వంతపూర్ స్టేషన్‌కు ఎకానమీ చైర్ కార్లో క్యాటరింగ్ రుసుముతో కలుపుకొని రూ.1,600గా నిర్ణయించారు. క్యాటరింగ్ చార్జి లేకుండా సాధారణ ప్రయాణానికి రూ.1,255, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ కోచ్‌లో ప్రయాణానికి క్యాటరింగ్ చార్జీతో కలుపుకొని రూ. 2,915గా, కేటరింగ్ చార్జీ లేకుండా 2,515గా నిర్ధారించారు. యశ్వంతపూర్ నుంచి కాచిగూడ (నం.20704)కు ఈ ధరల్లో స్వల్ప తేడా ఉంది. ఎకానమీ చైర్ కార్లో కేటరింగ్ చార్జీలతో కలిపి రూ.1,540, కేటరింగ్ చార్జీ లేకుండా రూ.1,255, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ కోచ్‌లో కేటరింగ్ చార్జీతో కలిపి రూ.2,865, కేటరింగ్ చార్జీ లేకుండా రూ.2,515గా నిర్ణయించారు. రైల్లో అల్పాహారం, లంచ్: ఉదయం 5.30 గంటలకు కాచిగూడలో ప్రారంభమయ్యే వందేభారత్ రైలు మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది. కేటరింగ్ చార్జీతో కలిపి టికెట్ బుక్ చేసుకున్నవారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం లంచ్‌ను రైల్లో అందిస్తారు. కేటరింగ్ రుసుము చెల్లించని వారికి అవి అందవు. ఇంటి నుంచి తెచ్చుకునే భోజనాన్ని రైల్లోకి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త వందేభారత్ రైలును ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఆదివారం సాధారణ ప్రయాణికులను అనుమతించరు. సోమవారం నుంచి సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఆన్లైన్లో టికెట్ల బుకింగ్‌ను ఐఆర్సీటీసీ ప్రారంభించింది. -
తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్
హైదరాబాద్: ఎయిర్‌పోర్టు ప్రయాణికుల కోసం ఆర్టీసీ మరో బంపర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. కనీసం ముగ్గురు ప్రయాణికులు కలిసి ప్రయాణం చేస్తే టికెట్ చార్జీల్లో రాయితీ లభిస్తుంది. ముగ్గురు నుంచి ఎంతమంది ప్రయాణికులైనా సరే కలిసి ప్రయాణం చేసినప్పుడు మొత్తం చార్జీల్లో 10 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. క్యాబ్‌లు, ఇతర ప్రైవేట్ వాహనాల పోటీని ఎదుర్కొనేందుకు ఆర్టీసీ ఈ రాయితీ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు, కుటుంబాలతో కలిసి వెళ్లే ప్రయాణికులను సైతం ఆకట్టుకొనేందుకు ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు వెంకన్న చెప్పారు. ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతి రోజు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికుల ఆదరణ చూరగొనేందుకు ఆర్టీసీ ఇప్పటికే బస్సుల్లో వైఫై తదితర సదుపాయాలను ప్రవేశపెట్టింది. వివిధ మార్గాల్లో ఎయిర్‌పోర్టు వరకు కనిష్టంగా రూ.50 నుంచి గరిష్టంగా రూ.300 వరకు టికెట్ చార్జీలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు కలిసి వెళ్లినప్పుడు ప్రయాణించే దూరం, ప్రయాణికుల సంఖ్యను బట్టి రాయితీ పెద్ద మొత్తంలోనే ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రయాణికుల ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా వివిధ రూట్లలో మరిన్ని బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. త్వరలో నగరానికి రానున్న కొత్త ఎలక్ట్రికల్ ఏసీ బస్సుల్లో 20 బస్సులను ఎయిర్‌పోర్టుకు నడపనున్నట్లు ఆర్ఎం చెప్పారు. -
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కొత్త రైలు.. ఛార్జీలు ఎలా ఉన్నాయంటే?
భువనేశ్వర్: పూరీ – హౌరా మధ్య ప్రారంభమైన 22895/22896 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆహారం చార్జీలతో పాటు టికెటు ధర నిర్ణయించారు. రైలులో ఆహారం అవసరం లేకుంటే మినహాయింపు కల్పించి టికెటు చార్జీలు కుదిస్తారు. టికెటు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికుడు ప్రకటించిన నిర్ణయం మేరకు ఈ సౌకర్యం కల్పిస్తారు. నో ఫుడ్ ఆప్షన్ ఎంచుకుంటే, క్యాటరింగ్ ఛార్జీలు టికెటు ధర నుంచి నుంచి మినహాయిస్తారు. హౌరా నుంచి ఈ రైలు ఆగే పలు రైల్వేస్టేషన్ల వరకు ప్రయాణ చార్జీల వివరాలు ఇలా ఉన్నాయి. దీనిలో ఏసీ చైర్ కారు (సీసీ) కేటరింగ్ చార్జీ రూ.162లు, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు (ఈసీ) కేటరింగ్ చార్జీ రూ.195లుగా ఉంటాయి. -
ఫలించని వ్యూహాలు.. గ్రేటర్ మెట్రోకు కొత్త కష్టాలు!
సాక్షి, సిటీబ్యూరో: పీకల్లోతు ఆర్థిక నష్టాల్లో ఉన్న గ్రేటర్ మెట్రోను గట్టెక్కించేందుకు నిర్మాణ సంస్థ ఆపసోపాలు పడుతోంది. ఇందుకోసం ఐదేళ్లుగా అమలు చేస్తోన్న సరికొత్త వ్యూహాలు ఆశించినస్థాయిలో సత్ఫలితాన్నివ్వడం లేదు. తాజాగా ప్రాజెక్టులో తమ వాటాను 50 శాతం విక్రయించేందుకు ముందుకొచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మెట్రో నిర్మాణం చేపట్టేందుకు వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి సుమారు 13 వేల కోట్ల రుణాలను సేకరించింది. ఇందులో తమ వాటాను సగానికి తగ్గించుకోవడం ద్వారా రూ.7,500 కోట్లు సమీకరించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. రుణాలపై వడ్డీ భారాన్ని సైతం ఇటీవల సుమారు 2.5 శాతం తగ్గించుకున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. మరోవైపు టిక్కెట్ ఛార్జీల పెంపు ద్వారా రోజువారీగా భారంగా మారిన నిర్వహణ నష్టాల నుంచి బయటపడేందుకు ప్రయత్నినస్తుండడం గమనార్హం. ఇందుకోసం ప్రభుత్వం ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఇక మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రధాన నగరంలో ప్రభుత్వం నిర్మా ణ సంస్థకు కేటాయించిన సుమారు 69 ఎకరాల విలువైన స్థలాలను క్రమంగా లీజుకివ్వడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఆశించిన స్థాయిలో సత్ఫలితాన్నివ్వలేదు. తాజాగా రాయదుర్గంలోని 15 ఎకరాల స్థలాన్ని లీజుకు ఇవ్వడం ద్వారా మరో వెయ్యికోట్లు ఆదాయం సమకూర్చుకునేందుకు నిర్మాణ సంస్థ సిద్ధమైంది. వాటా దక్కించుకునేదెవ్వరో.. ఐదేళ్లుగా నష్టాలతో నెట్టుకొస్తున్న గ్రేటర్ మెట్రోలో నిర్మాణ సంస్థ విక్రయించాలనుకుంటున్న 50 శాతం వాటాను దక్కించుకునేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందన్న అంశం సస్పెన్స్‌గా మారింది. ఒకవైపు భయపెడుతోన్న నష్టాలు..మరోవైపు కొండలా పేరుకుపోయిన రుణాలు,వాటిపై వడ్డీ చెల్లింపులు భారంగా మారిన తరుణంలో నిర్మాణ సంస్థ వాటాల విక్రయం అంత సులభం కాదని ఆర్ధిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కోవిడ్, లాక్డౌన్ కారణంగా భారీగా నష్టపోయిన తమకు రూ.3 వేల కోట్ల మేర వడ్డీలేని సాఫ్ట్‌లోన్‌ను మంజూరు చేయాలని నిర్మాణ సంస్థ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఙప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోవడం గమనార్హం. అనుకున్నదొక్కటి... - నగరంలో ఎల్బీ నగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మూడు మార్గాల్లో 69.2 కి.మీ మేర మెట్రో అందుబాటులోకి వచ్చింది. - ప్రస్తుతం ఈ రూట్లలో నిత్యం 4 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. నిర్మాణ సంస్థ అంచనాల మేరకు ఈ మూడు రూట్లలోనిత్యం 16 లక్షలమంది జర్నీ చేస్తారని ఐదేళ్ల క్రితం అంచనా వేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రయాణికుల ఆదరణకు నోచుకోలేదు. - పార్కింగ్ కష్టాలు, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ లేకపోవడం తదితర అంశాలు మెట్రోకు శాపంగా మారాయి. నష్టాల నుంచి గట్టెక్కేందుకు కనీస ఛార్జీని ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.20కి..గరిష్ట ఛార్జీని ప్రస్తుతం ఉన్న రూ.60 నుంచి రూ.100కు పెంచేందుకు ప్రయత్నినస్తునట్లు సమాచారం. -
పెంచిన ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పల్లె వెలు గు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ చార్జీలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై భారాన్ని వేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన చార్జీలను వ్యతిరేకిస్తూ ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ నష్టాల బాట నుంచి గట్టెక్కించడానికి బడ్జెట్లో సరిపోయినన్ని నిధులు కేటాయించి సంస్థను నిలబెట్టుకోవాల్సిన ప్రభుత్వం, నేడు ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వారికి కట్టబెట్టి, ప్రయాణ టికెట్ రేట్లు పెంచి పూడ్చుకోవాలని చూస్తోందని విమర్శించారు. చినజీయర్ స్వామి ప్రజల నమ్మకాలు, ఆహారాలు, కులాలు, వృత్తులపైన బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేస్తూ అవమానపర్చడాన్ని తమ్మినేని తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
సామాన్యులపై తెలంగాణ ఆర్టీసీ చార్జీల మోత
-
విమాన చార్జీలకు రెక్కలు
న్యూఢిల్లీ: దేశీయంగా విమాన ప్రయాణాలకు సంబంధించిన చార్జీలపై కనిష్ట, గరిష్ట పరిమితులను 9.83 శాతం – 12.82 శాతం మేర పెంచుతూ కేంద్ర పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 40 నిమిషాల లోపు వ్యవధి ఉండే ఫ్లయిట్ల కనిష్ట చార్జీ పరిమితి రూ. 2,600 నుంచి రూ. 2,900కి (11.53 శాతం) పెంచింది. అలాగే గరిష్ట పరిమితిని 12.82 శాతం పెంచడంతో ఇది రూ. 8,800కి చేరింది. అలాగే 60–90 నిమిషాల వ్యవధి ఉండే ఫ్లయిట్ల కనిష్ట చార్జీ పరిమితి 12.5 శాతం పెరిగి రూ. 4,500కి, గరిష్ట చార్జీ 12.82 శాతం మేర పెరిగి రూ. 13,200కి చేరినట్లవుతుంది. మొత్తం మీద ఇకపై 90–120, 120–150, 150–180, 180–210 నిమిషాల ప్రయాణ వ్యవధి ఉండే దేశీ ఫ్లయిట్ల కనిష్ట చార్జీల పరిమితి వరుసగా రూ. 5,300, రూ. 6,700, రూ. 8,300, రూ. 9,800గాను ఉంటుంది. కరోనా వైరస్ కట్టడి కోసం గతేడాది రెండు నెలల పాటు విధించిన లాక్డౌన్ ఎత్తివేశాక మే 25 నుంచి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. సంక్షోభం లో ఉన్న ఎయిర్‌లైన్స్‌ని గట్టెక్కించే ఉద్దేశంతో ప్రభుత్వం కనిష్ట చార్జీలపైన, ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడేందుకు గరిష్ట చార్జీలపైనా కేంద్రం పరిమితులు విధించింది. -
WTC Final: ఒక్కో టికెట్ ధర 2 లక్షలు..?
సౌతాంప్టన్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు ఆకాశానంటుతున్నాయి. జూన్ 18-22 మధ్య సౌతాంప్టన్ వేదికగా జరుగబోయే ఈ మెగా పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఎగబడుతుండడమే ఇందుకు కారణం. పరిమిత సంఖ్యలో టిక్కెట్లు ఉండటంతో ఒక్కో టికెట్ ధర భారత కరెన్సీ ప్రకారం ఏకంగా రెండు లక్షల రూపాయల వరుకు పలుకుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) ఇదివరకే ప్రకటించింది. దీనికి సంబంధించి ఈసీబీ తాజాగా మరో ప్రకటన చేయడంతో టిక్కెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కు కేవలం 4 వేల మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తామని ఆతిధ్య హాంప్‌షైర్ కౌంటీ క్లబ్ ప్రకటించింది. ఇందులో ఐసీసీ స్పాన్సర్లు, వాటాదారులకు 50 శాతం టికెట్లు ఇస్తామని.. మిగిలిన 2000 టికెట్లను మాత్రమే అమ్మకానికి ఉంచుతామని హాంప్ షైర్ క్లబ్ హెడ్ రోడ్ బ్రన్స్ గ్రోవ్ తెలిపడంతో అభిమానులు టికెట్లకోసం ఎగబడుతున్నారు. కాగా, 2019 సెప్టెంబర్ తర్వాత ఇంగ్లండ్ మైదానాల్లోకి ఫ్యాన్స్‌ను అనుమతించడం ఇదే తొలిసారి కావడంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు డిమాండ్ పెరిగింది. క్రికెట్ మ్యాచ్‌లు చూసి చాలా రోజులు కావడంతో సహజంగానే అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో టిక్కెట్లు బ్లాక్ మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే, ప్రపంచ టెస్ట్ ఛాంపియషిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత జట్టు జూన్ 2న ప్రత్యేక విమానంలో యూకేకు బయల్దేరుతుంది. ఇప్పటికే జట్టు సభ్యులతో పాటు వారివారి కుటుంబ సభ్యులు, సహాయ సిబ్బంది ముంబైలో క్వారంటైన్ లో ఉన్నారు. చదవండి: పంత్‌కు క్రికెట్ దిగ్గజం వార్నింగ్.. -
బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్‌కు జరిమానా
సాక్షి, హైదరాబాద్: టికెట్ ధర కన్నా అధిక రుసుము వసూలు చేసిన బుక్‌మైషో, పీవీఆర్ సినిమాలపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ కొరడా ఝుళిపించింది. ఇంటర్నెట్ చార్జీల పేరుతో అధికంగా డబ్బులు గుంజడాన్ని సవాలు చేస్తూ విజయ్ గోపాల్ అనే వ్యక్తి వినియోగదారుల ఫోరంలో గతేడాది ఫిర్యాదు చేశాడు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు సుమారు 25 నెలల తర్వాత తుది తీర్పు వెలువరించింది. ఇంటర్నెట్ చార్జీల పేరిట పై రెండూ ప్రేక్షకుడి నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించింది. దీంతో బుక్‌మైషో, పీవీఆర్ సినిమాస్ బాధితుడికి 25 వేల రూపాయల నష్టపరిహారంతో పాటు కేసు ఖర్చుల కింద మరో 1000 రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. లీగల్ ఎయిడ్ కింద కోర్టుకు రూ.5 వేలు కట్టాలని తీర్పు చెప్పింది. చదవండి: స్క్రీన్ షాట్లు షేర్ చేసినందుకు చాలా సంతోషం: నాగ్ మహేశ్‌బాబు సరసన జాన్వీ కపూర్! -
రైళ్లలో రద్దీ నివారణకే చార్జీల పెంపు
న్యూఢిల్లీ: రైళ్లలో స్వల్ప దూరాలు ప్రయాణించే వారు గగ్గోలు పెడుతున్నారు. టిక్కెట్ చార్జీలు పెరగడమే ఇందుకు కారణం. ప్యాసింజర్, లోకల్ ట్రైన్లలో చార్జీలను రైల్వే శాఖ ఇటీవలే పెంచేసింది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అనవసర ప్రయాణాలను నివారించడానికే ప్యాసింజర్, తక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో చార్జీలను స్వల్పంగా పెంచినట్లు రైల్వే అధికారులు తాజాగా ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఈ రైళ్లలో ప్రయాణించకపోవడమే మంచిదని సూచించారు. ‘‘కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ విజృంభిస్తోంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని అరికట్టడంతోపాటు ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందకుండా నివారించే చర్యల్లో భాగంగానే చార్జీలను పెంచాల్సి వచ్చింది’’ అని రైల్వేశాఖ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. లాక్డౌన్ కారణంగా రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్ల కార్యకలాపాలు క్రమంగా పెరుగుతున్నాయి. లాక్డౌన్ ముందునాటి పరిస్థితితో పోలిస్తే ప్రస్తుతం 65 శాతం ఎక్స్‌ప్రెస్‌లు, 90 శాతానికి పైగా సబర్బన్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 1,250 మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైల్లు, 5,350 సబర్బన్ సర్వీసులు, 326 ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. -
విమాన చార్జీలకు ఇంకాస్త రెక్కలు
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో సెక్యూరిటీ ఫీజు పెరగనుండటంతో విమాన టికెట్ల చార్జీలు స్వల్పంగా పెరగనున్నాయి. దీంతో దేశీయంగా ప్రయాణించే వారు ఇకపై రూ. 150 బదులుగా రూ.160 చెల్లించాల్సి రానుంది. అలాగే అంతర్జాతీయ ప్యాసింజర్లు 3.25 డాలర్లు కాకుండా 4.85 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. టికెట్ చార్జీల్లో భాగంగా సెక్యూరిటీ ఫీజు ఉంటుంది. ప్యాసింజర్లు చెల్లించిన సెక్యూరిటీ ఫీజును విమానయాన సంస్థలు .. ప్రభుత్వానికి కడతాయి. విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్ల నిర్వహణకు ఈ నిధులను వినియోగిస్తారు. గతేడాదే దేశీ ప్రయాణాలపై సెక్యూరిటీ ఫీజును రూ. 130 నుంచి రూ. 150కి, విదేశీ ప్రయాణాల టికెట్లపై 3.25 డాలర్లకు పౌర విమానయాన శాఖ పెంచింది. ఇప్పటికే కరోనా వైరస్ పరిణామాలతో విమాన సర్వీసులు రద్దవుతూ తీవ్ర సంక్షోభంలో ఉన్న ఏవియేషన్ రంగంపై ఇది మరికాస్త భారం కానుందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. మూడు నెలల నుంచి ఫ్లయిట్లు నామమాత్రంగా నడుస్తున్నప్పటికీ.. గతేడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ప్రయాణికుల రద్దీ 82.3 శాతం తగ్గింది. జూన్‌లో దేశీయంగా ఆరు దిగ్గజ ఎయిర్‌లైన్స్‌లో అయిదు సంస్థల ఆక్యుపెన్సీ రేటు 50–60% నమోదైంది. అధికారిక గణాంకాల ప్రకారం జూలైలో స్పైస్‌జెట్ ఆక్యుపెన్సీ రేటు 70%, ఇండిగో 60.2%, గోఎయిర్ 50.5%, విస్తార 53.1%, ఎయిర్ఏషియా ఇండియా 56.2 శాతం, ఎయిరిండియా 45.5%గా ఉంది. సంక్షోభ పరిస్థితులతో కుదేలవుతున్న విమానయాన రంగ సంస్థలకు ఊరటనిచ్చే చర్యలపై పౌర విమానయాన శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 2 -
బస్సు చార్జీలు పెరిగాయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మూడున్నరేళ్ల తర్వాత బస్సు చార్జీలు పెరిగాయి. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొనడం, ఇదే సమయంలో రాష్ట్రంలో ఆర్టీసీ ఆదాయం తగ్గిపోవడం, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) భారం కావడంతో ఆర్టీసీ యాజమాన్యం చార్జీలు పెంచక తప్పలేదు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండటంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రస్తుతానికి బస్సు చార్జీల పెంపు మినహా గత్యంతరం లేదంటూ ఆర్టీసీ అధికారులు రెండేళ్లుగా చేస్తున్న విన్నపాలకు ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. దీంతో టికెట్ ధరలను ఆర్టీసీ సవరించింది. 2016 జూన్‌లో 10 శాతం మేర టికెట్ ధరలు పెంచిన ఆర్టీసీ... ఇప్పుడు కి.మీ.కు 20 పైసలు చొప్పున పెంచింది. అంటే 18.80 శాతం మేర చార్జీల మోత మోగినట్టయింది. పెరిగిన చార్జీలు మంగళవారం తెల్లవారుజామున తొలి షిఫ్ట్ నుంచి అమల్లోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చార్జీలు పెరగడం ఇది రెండోసారి. తాజా పెంపుతో ప్రజలపై సాలీనా దాదాపు రూ. 850 కోట్ల మేర భారం పడనుంది. ఆర్టీసీకి అంతేమొత్తం ఆదాయం పెరగనుంది. కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పున చార్జీలు పెంచితే వార్షిక భారం రూ. 752 కోట్ల మేర ఉంటుందని తొలుత లెక్కలేశారు. గత నెల 28న జరిగిన మంత్రివర్గ సమావేశానంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ సిటీ సర్వీసులు, పల్లె వెలుగు బస్సుల కనీస చార్జీని రెట్టింపు చేస్తూ రూ. 10కి సవరించడం, చిల్లర సమస్య ఉత్పన్నం కాకుండా స్టేజీలవారీగా మొత్తాన్ని రౌండ్ ఆఫ్ చేయడంతో కి.మీ.కు 20 పైసల కంటే ఎక్కువ మొత్తం పెరిగినట్టయింది. ఫలితంగా ప్రజలపై కనీసం రూ. 100 కోట్ల అదనపు భారం పడనుంది. దీంతో తాజా పెంపు భారం రూ. 850 కోట్లకు చేరుతుందని అంచనా. సుదీర్ఘకాలం సమ్మె తర్వాత బేషరతుగా ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడంతో వారిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దీనికితోడు ముఖ్యమంత్రి ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయడంతో పనితీరులో గణనీయ మార్పు వస్తుందన్న అంచనా ఉంది. దీనివల్ల బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని అధికారులు నమ్ముతున్నారు. ఇదే జరిగితే టికెట్ల పెంపుతో వచ్చే అదనపు ఆదాయం రూ. వెయ్యి కోట్లకు చేరుతుందన్న భావన వ్యక్తమవుతోంది. వై.ఎస్. హయాంలో పెరగని చార్జీలు... ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా బస్సు చార్జీలు పెరగలేదు. చార్జీల పెంపుతో జనంపై భారం మోపడం కంటే ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయం పెంచుకోవడంతోపాటు సిబ్బంది పనితీరు మెరుగుపరచడం, ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే పద్ధతులను అవలంబించారు. దీంతో ఆర్టీసీకి పెద్ద ఇబ్బంది లేకుండా పోయింది. అయితే ఆయన మరణానంతరం వరుసగా ఏటా టికెట్ చార్జీలు పెంచుతూ పోయారు. 2010లో ఏకంగా 28.41 శాతం పెంచి జనంపై రూ. 196 కోట్ల భారం మోపారు. 2011లో 10 శాతం పెంచారు. ఫలితంగా ప్రజల జేబుకు రూ. 221 కోట్ల మేర చిల్లు పడింది. 2012లో 12.50 శాతం, 2013లో 9.50 శాతం మేర టికెట్ చార్జీలు పెంచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి రెండున్నరేళ్లలో సర్కారు టికెట్ చార్జీల పెంపు జోలికి వెళ్లలేదు. అయితే ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి జీతాలు చెల్లించేందుకు కూడా ఇబ్బంది పడే స్థాయికి చేరడంతో వెంటనే టికెట్ చార్జీలు పెంచుకునేందుకు అనుమతించాల్సిందిగా అధికారులు ప్రభుత్వాన్ని కోరడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు 2016లో 10 శాతం చార్జీలు పెంచారు. కానీ అది ఏమాత్రం సరిపోకపోవడంతో కనీసం 15 శాతం నుంచి 20 శాతం మేర పెంచుకునేందుకు అనుమతించాలని ఆ తర్వాత నాలుగు పర్యాయాలు ఆర్టీసీ కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంతకాలం తర్వాత ఇప్పుడు మరోసారి పెంచుకునేందుకు సీఎం అనుమతించారు. దాదాపు అధికారులు కోరిన స్థాయిలోనే పెంపు జరిగింది. కనీస చార్జీలు ఇలా రూ. 10 పల్లె వెలుగు, సిటీలో రూ. 15 ఎక్స్‌ప్రెస్‌లో రూ. 20 డీలక్స్‌లో రూ. 25 సూపర్ లగ్జరీలో -
అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ భారీ బాదుడు..!
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్‌ను ఇవ్వనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా ప్రకటించినట్టుగానే చార్జీల పెంపునకు రంగం సిద్ధం చేసింది. దీంతో సగటు ప్రయాణికుడికి భారం తప్పేలా లేదు. ఇక పెరిగిన టికెట్ చార్జీలు నేడు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక వీటికి తోడుగా టోల్ ప్లాజా రుసుమును, జీఎస్టీ, ప్యాసింజర్ సెస్‌ను ఆర్టీసీ అదనంగా వసూలు చేయనుంది. బస్సులను బట్టి పెరగనున్న ఆయా చార్జీల వివరాలు.. ► పల్లె వెలుగు కనీస చార్జీ రూ.5 నుంచి రూ.10కు పెంపు ► సెమీ ఎక్స్‌ప్రెస్ కనీస చార్జీ రూ.10గా నిర్దారించిన అధికారులు ► ఎక్స్‌ప్రెస్ కనీస చార్జీ రూ.10 నుంచి రూ.15కి పెంపు ► డీలక్స్ కనీస చార్జీ రూ.15 నుంచి రూ.20కి పెంపు ► సూపర్ లగ్జరీ కనీస చార్జీ రూ.25 ► రాజధాని, వజ్ర బస్సుల్లో కనీస చార్జీ రూ.35 ► గరుడ ఏసీ లో కనీస చార్జీ రూ.35 ► గరుడ ప్లస్ ఏసీలో కనీస చార్జీ రూ.35 ► వెన్నెల ఏసీ స్లీపర్ లో కనీస చార్జీ రూ.70 కిలోమీటర్‌కు ఆర్టీసీ వసూలు చేసే మొత్తం.. కనీస చార్జీపై కిలోమీటర్‌కు 20 పైసలు అధికంగా వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఆయా బస్సులు కిలోమీటర్‌కు వసూలు చేసే మొత్తం.. ► పల్లె వెలుగు - 83 పైసలు ► సెమీ ఎక్స్ ప్రెస్ - 95 పైసలు ► ఎక్స్‌ప్రెస్ - 107 పైసలు ► డీలక్స్ -118 పైసలు ► సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ -136 పైసలు ► రాజధాని ఏసీ, వజ్ర బస్సు - 166 పైసలు ► గరుడ ఏసీ - 191 పైసలు ► గరుడ ప్లస్ ఏసీ - 202 పైసలు -
ఏదీ చార్జీల పట్టిక?
సాక్షి,సిటీబ్యూరో: సిటీ బస్సుల్లో చార్జీల పట్టిక ప్రదర్శించాలని సాక్షాత్తు రవాణాశాఖ మంత్రి ఆదేశాలు బేఖాతరయ్యాయి. గురువారం నగరంలోని ఏ బస్సులోనూ పట్టిక కనిపించకపోగా.. తాత్కాలిక సబ్బంది యథావిధిగా తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఇష్టారాజ్యంగా చార్జీల దోపిడీకి తెగబడ్డారు. బస్‌పాస్‌లను అనుమతించడం లేదు. ఆర్టీసీ నిర్వహణ తీరు అస్తవ్యస్తంగా మారింది. అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రవాణా మంత్రి ప్రకటించారు. ప్రతి బస్సులోనూ స్టేజీ నుంచి స్టేజీ వరకు చార్జీల పట్టికను ప్రదర్శించాలని చెప్పారు. కానీ ఇలాంటి చార్జీల పట్టికలు అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రయాణికులు తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లు అడిగినంత చెల్లించక తప్పడం లేదు. ఇటు సిటీ బస్సుల్లోనూ, అటు దూరప్రాంతాల నుంచి వచ్చే బస్సుల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. గత ఆరు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. స్కూల్ బస్సులు, టూరిస్టు, కాంట్రాక్ట్ బస్సులకు తాత్కాలిక పర్మిట్లను ఇచ్చారు. మ్యాక్సీ క్యాబ్‌లు, మినీ బస్సులను ప్రజారవాణా వాహనాలుగా వినియోగిస్తున్నారు. వీటితో ఆర్టీసీలోని అద్దె బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. అలాగే తాత్కాలిక ప్రాతిపదికపైన నియమితులైన కండక్టర్లు, డ్రైవర్ల సహాయంతో ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఇలా ఆర్టీసీ గ్రేటర్ జోన్లో ప్రతిరోజు సగటున 1000 నుంచి 1100 బస్సులు తిరుగుతున్నాయి. 2000 మంది ప్రైవేట్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా బస్సులను నడుపుతున్నారు. కండక్టర్‌కు రోజుకు రూ.1000, డ్రైవర్‌కు రూ.1500 చొప్పున చెల్లిస్తున్నారు. అయినప్పటికీ తాత్కాలిక సిబ్బంది టికెట్ల రూపంలో వసూలు చేసిన నగదును జేబులో వేసుకుంటున్నారు. పైగా తక్కువ దూరానికే అదనపు చార్జీ వసూలు చేస్తూ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. చార్జీల దోపిడీపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల ప్రయాణికులు నేరుగా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మరి కొన్నిచోట్ల ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. అధిక చార్జీలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతి బస్సులో చార్జీల పట్టికను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే అన్ని రకాల బస్‌పాస్‌లను అనుమతించాలని ప్రకటించారు. కానీ ఈ ఆదేశాలు ఎక్కడా అమలుకు నోచుకోలేదు. కనిపించని నియంత్రణ వ్యవస్థ గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 29 డిపోల్లో 19,903 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరంతా డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, శ్రామిక్‌లు, సూపర్వైజర్లు, చీఫ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ డిపోమేనేజర్ తదితర కేటగిరీల్లో పనిచేస్తున్నారు. కానీ సమ్మె నేపథ్యంలో ప్రస్తుతం 58 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. వీరిలో డిపో మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు, రీజనల్ మేనేజర్లు, షెడ్యూలింగ్ అధికారులు, డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంటి ఉన్నత, మధ్య శ్రేణి అధికారులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా బస్సుల నిర్వహణలో సూపర్వైజర్లు, చీఫ్ ఇన్స్పెక్టర్లు, కంట్రోలర్ వంటి ఉద్యోగులు నిర్వహించే విధులు కీలకమైనవి. అలాగే బస్సుల్లో టిమ్స్ యంత్రాల ద్వారా టిక్కెట్లు ఇవ్వడం వల్ల బస్సులో ప్రయాణం చేసిన వారు, టిక్కెట్‌పై లభించిన ఆదాయం వంటి వివరాలు లభిస్తాయి. కానీ ప్రస్తుతం ఈ యంత్రాంగం ఏదీ లేదు. కేవలం బస్సులను డిపోల్లోంచి బయటకు తీసి రోడ్డెక్కించడమే లక్ష్యంగా అధికారులు పని చేస్తున్నారు. దీంతో ప్రైవేట్ సిబ్బంది దోపిడీని నియంత్రించే వ్యవస్థ కొరవడింది. అలాగే క్షేత్రస్థాయిలో బస్సుల నిర్వహణను పర్యవేక్షించే యంత్రాంగం, నిఘా కూడా లేకపోవడంతో ఏ బస్సులో ఎంత చార్జీ వసూలు చేస్తున్నారనే లెక్కలు లేకుండా పోయాయి. మొదలైన తిరుగు ప్రయాణాలు మరోవైపు దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో రద్దీ నెలకొంటోంది. అలాగే వివిధ జిల్లాల నుంచి నగరానికి వస్తున్న ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లోనూ రద్దీ భారీగానే ఉంటోంది. రైలు దిగిన ప్రయాణికులు సకాలంలో బస్సులు లభించక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సిటీ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లుగానే ప్రైవేట్ వాహనాల్లోనూ దోపిడీ కొనసాగుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు ఆర్టీసీ బస్సులు, అటు ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులను ఎడాపెడా దోచుకోండం గమనార్హం. ఆర్టీసీకి భారీ నష్టమే.. ప్రైవేట్ సిబ్బంది తీరు వల్ల ప్రయాణికులపైన భారం పడడమే కాకుండా ఆర్టీసీకి సైతం తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బస్సులను నడుపుతున్నప్పటికీ రోజుకు రూ.20 లక్షలకు మించి ఆదాయం రావడం లేదు. అందులోనూ చాలా వరకు ప్రైవేట్ సిబ్బంది దినసరి వేతనాల చెల్లింపులకే సరిపోతుంది. ‘కొన్ని రూట్లలో బస్సులకు వినియోగించిన డీజిల్ ఖర్చు కూడా లభించడం లేద’ని ఓ డిపో మేనేజర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
దళారులకు పండగే.. పండగ
సాక్షి, సిటీబ్యూరో : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్. గురువారం మధ్యాహ్నం 3 గంటలు. ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఆగిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్. ఒక్కసారిగా ప్రయాణికుల పరుగులు. స్లీపర్ కోచ్‌లు, ఏసీ బోగీలు అన్నీ నిండిపోయాయి. జనమంతా జనరల్ బోగీల వైపు వెళ్లారు. అయితే అప్పటికే ఆ బోగీల్లోని సీట్లన్నింటినీ కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. తమవాళ్ల కోసం సీట్లను ఆపి ఉంచినట్లుగా నటిస్తూ ఆ తరువాత సీట్ల బేరానికి దిగారు. ఒక్కో సీటుకు రూ.100 నుంచి రూ.200 చొప్పున విక్రయించి తాపీగా వెళ్లారు. ఒక్క ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మాత్రమే కాదు. ప్రయాణికుల రద్దీ భారీగా ఉండే పండుగ రోజుల్లో ఇలాంటి కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. దసరా సందర్భంగా నగర వాసులు గురువారం భారీ సంఖ్యలో సొంతూళ్లకు తరలి వెళ్లడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. రిజర్వేషన్లు లభించని ప్రయాణికులంతా సాధారణ బోగీలపైనే ఆధారపడ్డారు. దీంతో రద్దీ విపరీతంగా పెరిగింది. రైళ్లు ప్లాట్‌ఫామ్ వద్దకు చేరుకోకముందే జనరల్ బోగీలను ఆక్రమించుకుంటున్న దళారులు ఈ తరహా సీట్ల బేరానికి దిగుతుండడంతో సీట్లు కొనుగోలు చేసిన వాళ్లు దర్జాగా కూర్చొని పయనిస్తుండగా ముందు వరుసలో నించున్నా సీట్లు లభించని ప్రయాణికులు నరకం చూస్తున్నారు. దీంతో కేవలం 72 సీట్లు ఉండే జనరల్ బోగీల్లో వంద లాది మంది సర్దుకుపోవాల్సి వస్తోంది. కొరవడిన నియంత్రణ.... ప్రత్యేక రోజుల్లో జనరల్ బోగీలే కాకుండా కౌంటర్లు సైతం కిటకిటలాడుతాయి. విజయవాడ, విశాఖ, బెంగళూర్ వంటి దూర ప్రయాణికులే కాకుండా వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కూడా జనరల్ బోగీలపైన ఆధారపడతారు. రిజర్వేషన్లు లభించని వారు, వెయిటింగ్‌లిస్టు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన డిమాండ్ ఉంటుంది. దీనిని సొమ్ము చేసుకొనేందుకు దళారులు రంగంలోకి దిగుతున్నారు. రైల్వే యార్డుల నుంచి ట్రైన్లు ప్లాట్‌ఫామ్‌కు వచ్చేలోపే బోగీల్లోకి దూరిపోయి దర్జాగా సీట్లను ఆక్రమిస్తున్నారు. వారిని నియంత్రించడంలో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు విఫలమవుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికితోడు జనరల్ బోగీల సంఖ్య తక్కువగా ఉండడం కూడా ఇందుకు కారణం. 24 బోగీలు ఉండే ప్రతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో కనీసం 4 జనరల్ బోగీలు ఉండాలి. అయితే లాభార్జన కోసం పాకులాడుతున్న రైల్వేశాఖ జనరల్ బోగీలను కుదించి రిజర్వేషన్ బోగీలకు మాత్రమే ప్రాధాన్యతమిస్తోంది. 4 జనరల్ బోగీలు ఉండాల్సి రైళ్లలో 2 మాత్రమే ఉంటున్నాయి. దీంతో ప్రయాణికుల రద్దీ, అనూహ్యమైన డిమాండ్ దళారుల అక్రమార్జనకు ఊతమిస్తున్నాయి. జంటనగరాల నుంచి కాజీపేట్, నల్లగొండ వైపు గుంటూరు, వాడి, గుల్బర్గా, బీదర్, నిజామాబాద్, మన్మాడ్, ముంబయి, ఢిల్లీ, తదితర రూట్లలో బయలుదేరే రైళ్లలో జనరల్ బోగీలకు అత్యధికంగా డిమాండ్ ఉంటోంది. పండగపూట నరకం... పండగపూట ప్రయాణికులకు నరకం తప్పడం లేదు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. రెండు రోజులుగా 4 లక్షల మంది ప్రయాణికులు వివిధ మార్గాల్లో అదనంగా బయలుదేరారు. నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి సాధారణ రోజుల్లో సుమారు 3 లక్షల మంది బయలుదేరుతుండగా ప్రస్తుత పండగ రద్దీ దృష్ట్యా మరో 2 లక్షల మంది అదనంగా బయలుదేరారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లోనూ రద్దీ తారస్థాయికి చేరింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే 3500 రెగ్యులర్ బస్సులతో పాటు గురువారం మరో 500 బస్సులను ఆర్టీసీ అదనంగా ఏర్పాటు చేసింది. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లతో పాటు నగర శివార్ల నుంచి కూడా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. సద్దుల బతుకమ్మ, దసరా, పర్వదినాల దృష్ట్యా ఈ నెల 20 నుంచి ఇప్పటి వరకు సుమారు 14 లక్షల మంది నగర వాసులు సొంతూళ్లకు తరలి వెళ్లినట్లు అంచనా. -
త్వరలో ఆర్టీసీ బాదుడు !
-
అర్టీసీ చార్జీల పెంపుకు రంగం సిద్ధం
-
భగ్గుమన్న ముంబై!
సాక్షి, ముంబై: రైల్వే చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నగరవ్యాప్తంగా శనివారం నిరసనలు వెల్లువెత్తాయి. ఒక్క గంట రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగినా ముంబై అతలాకుతలమవుతుంది. అంతగా రైళ్లపై ఆధారపడే ముంబైకర్లకు పెంపు నిర్ణయం మింగక తప్పని చేదు మాత్రగా మారింది. దీంతో పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలు, డబ్బావాలాలు, స్వచ్ఛంద సంస్థలు పెద్దపెట్టున ఆందోళనకు దిగాయి. రాస్తారోకోలు చేశాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్థికభారం రెట్టింపు.. పెంచిన రైల్వే చార్జీలతో ముంబైకర్లపై ఆర్థిక భారం రెట్టింపు కానుంది. దాదాపుగా అన్నిరకాల టికెట్ చార్జీలు, పాస్ చార్జీల పెరిగిన తీరు పరిశీలిస్తే ప్రస్తుతం కంటే రెట్టింపయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వీటికితోడు త్వరలో ఆటో, ట్యాక్సీల చార్జీలు కూడా పెరగనున్నాయి. దీంతో ఇంట్లోనుంచి కాలు బయట పెట్టేముందే జేబు బరువగా ఉందా? లేదా? చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంచిన రైలు చార్జీలు 25 నుంచి అమలు కానుండడంతో నగరవాసులు ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా భారం భరించేందుకు సిద్ధమవుతున్నారు. 14.2 ప్రయాణ చార్జీలకు తోడు రవాణా చార్జీలను కూడా 6.5 శాతం పెంచుతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ నుంచి ప్రకటన వెలువడిన మరుక్షణమే నగరవాసుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తడం ప్రారంభమైంది. వేతనాలు వందల్లో, ఖర్చులు వేలల్లో పెరుగుతున్నాయని, ఇన్నాళ్లూ అప్పుచేసి బతికిన తమకు ఇక కొత్త అప్పు ఎక్కడ చేయాలో కూడా తెలియని దుస్థితి దాపురించిందని నిర్మల అనే మహిళ వాపోయింది. ఇప్పటికే నిత్యావసరాలు వెక్కిరిస్తున్నాయని, ఇక ఇంధన ధరలకైతే హద్దూఅదుపూ లేకుండా పోయిందని, దీంతో ఆటో, ట్యాక్సీల చార్జీలు కూడా పెరిగాయని, త్వరలో మరింత పెరగనున్నట్లు తెలుస్తోందని, కాస్త తక్కువగా ఉన్నాయనకున్న రైలు చార్జీలు కూడా పెంచేసి ఓటు వేసినందుకు కేంద్ర ప్రభుత్వం సరైన గుణపాఠమే చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సీజన్ పాస్‌ను రెట్టింపు చేయగా త్వరలో ఆటో, ట్యాక్సీల ధరలు రూ. 2 పెంచనున్నారు. హైకోర్టు నుంచి అనుమతి రావడమే ఆలస్యం.. ఆటో, ట్యాక్సీల ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. పెంచిన రైల్వే చార్జీలతో ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేకు అదనంగా రూ.8,000 కోట్ల ఆదాయం చేకూరనుంది. దేశ ఆర్థిక పురోభివృద్ధి జరగాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. చార్జీలను పెంచే ప్రక్రియను వారం రోజులకు ముందుగానే నిర్ణయించినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అయితే నగర లైఫ్లైన్లు అయిన లోకల్ రైళ్లను రోజుకు దాదాపు 75 లక్షల మంది ప్రయాణికులు ఆశ్రయిస్తుంటారు. వీరంతా ఈ పెరిగిన భారాన్ని మోయక తప్పని పరిస్థితి ఏర్పడింది. సబర్బన్ రైళ్లను ఆశ్రయించి సీజన్ టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికులకు ప్రయాణభారం మరింత అధికం కానుంది. నెలసరి, క్వార్టర్లీ పాస్ చార్జీలను కూడా 100 శాతం పెంచారు. ఇదిలా వుండగా చర్చిగేట్ నుంచి విరార్ వరకు ‘సెకండ్ క్లాస్ నెలసరి సీజన్’ టికెట్లు ప్రస్తుతం రూ.280 ఉండగా రూ.645కు పెంచనున్నారు. ఇదే దూరంలో ఫస్ట్‌క్లాస్ నెలసరి సీజన్ టికెట్‌ను రూ.1,035 నుంచి రూ.1,960 వరకు పెంచనున్నారు. దీంతో నగరవాసుల ప్రయా ణ వ్యయం రెట్టింపు అయిందని చెబుతున్నారు. లోకల్‌రైల్ సీజన్ టికెట్ చార్జీలు రూ.లలో సెకెండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ చర్చ్‌గేట్-బోరివలి 190 480 655 1310 చర్చ్‌గేట్-విరార్ 280 645 1,035 1,960 సీఎస్టీ-ఠాణే 190 480 655 1,310 సీఎస్టీ-పన్వెల్ 335 720 1,035 1,960