
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్‌ను ఇవ్వనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా ప్రకటించినట్టుగానే చార్జీల పెంపునకు రంగం సిద్ధం చేసింది. దీంతో సగటు ప్రయాణికుడికి భారం తప్పేలా లేదు. ఇక పెరిగిన టికెట్ చార్జీలు నేడు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక వీటికి తోడుగా టోల్ ప్లాజా రుసుమును, జీఎస్టీ, ప్యాసింజర్ సెస్‌ను ఆర్టీసీ అదనంగా వసూలు చేయనుంది.
బస్సులను బట్టి పెరగనున్న ఆయా చార్జీల వివరాలు..
► పల్లె వెలుగు కనీస చార్జీ రూ.5 నుంచి రూ.10కు పెంపు
► సెమీ ఎక్స్‌ప్రెస్ కనీస చార్జీ రూ.10గా నిర్దారించిన అధికారులు
► ఎక్స్‌ప్రెస్ కనీస చార్జీ రూ.10 నుంచి రూ.15కి పెంపు
► డీలక్స్ కనీస చార్జీ రూ.15 నుంచి రూ.20కి పెంపు
► సూపర్ లగ్జరీ కనీస చార్జీ రూ.25
► రాజధాని, వజ్ర బస్సుల్లో కనీస చార్జీ రూ.35
► గరుడ ఏసీ లో కనీస చార్జీ రూ.35
► గరుడ ప్లస్ ఏసీలో కనీస చార్జీ రూ.35
► వెన్నెల ఏసీ స్లీపర్ లో కనీస చార్జీ రూ.70
కిలోమీటర్‌కు ఆర్టీసీ వసూలు చేసే మొత్తం..
కనీస చార్జీపై కిలోమీటర్‌కు 20 పైసలు అధికంగా వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఆయా బస్సులు కిలోమీటర్‌కు వసూలు చేసే మొత్తం..
► పల్లె వెలుగు - 83 పైసలు
► సెమీ ఎక్స్ ప్రెస్ - 95 పైసలు
► ఎక్స్‌ప్రెస్ - 107 పైసలు
► డీలక్స్ -118 పైసలు
► సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ -136 పైసలు
► రాజధాని ఏసీ, వజ్ర బస్సు - 166 పైసలు
► గరుడ ఏసీ - 191 పైసలు
► గరుడ ప్లస్ ఏసీ - 202 పైసలు
Comments
Please login to add a commentAdd a comment