సాక్షి, రంగారెడ్డి: సిటీ బస్సులో కండక్టర్ తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి వాపోయింది. మణికొండ నుంచి హిమాయత్ నగర్ వెళ్తున్న బస్సులో కండక్టర్ తనను అసభ్యంగా తాకినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. సదరు కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ, షీ టీమ్స్, హైదరాబాద్ పోలీసులకు ఎక్స్ ద్వారా ఫిర్యాదు చేసింది.
‘ఈ నెల 15న (మంగళవారం)మణికొండ నుంచి హిమాయత్ నగర్ వెళ్తున్నా. ఆధార్ కార్డు లేకపోవడంతో రూ. 30 డబ్బులిచ్చి టికెట్ తీసుకున్నా. బస్సు రద్దీగా ఉండటంతో అదే అదనుగా భావించిన కండక్టర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను అనుచితంగా తాకాడు. 2 సెకన్లు ఏం జరిగిందో అర్థం కాలేదు. అంకుల్ ఏం చేస్తున్నారంటూ గట్టిగా అరవగానే వెనక్కి వెళ్లిపోయాడు. సదరు కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు.
తాజాగా ఈ ఫిర్యాదుపై టీజీఎస్‌ఆర్టీసీ స్పందించింది. ఫరూక్ నగర్ కండక్టర్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌లో ‘ఫరూఖ్‌నగర్ డిపోకు చెందిన ఒక కండక్టర్ ప్రయాణ సమయంలో తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఒక యువతి సోషల్ మీడియా ద్వారా టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.
ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖపరమైన చర్యలను సంస్థ తీసుకుంటుంది. టీజీఎస్‌ఆర్టీసీ మహిళా భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. ప్రతి రోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది.’ అని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఫరుఖ్‌నగర్ డిపోనకు చెందిన ఒక కండక్టర్ ప్రయాణ సమయంలో తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఒక యువతి సోషల్ మీడియా ద్వారా #TGSRTC యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖపరమైన చర్యలను సంస్థ… pic.twitter.com/pCzfcZRUz4
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) July 16, 2024
Comments
Please login to add a commentAdd a comment