conducter
-
HYD: కీచక కండక్టర్.. యువతి ట్వీట్‌కు ఆర్టీసీ రి‘యాక్షన్’
సాక్షి, రంగారెడ్డి: సిటీ బస్సులో కండక్టర్ తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి వాపోయింది. మణికొండ నుంచి హిమాయత్ నగర్ వెళ్తున్న బస్సులో కండక్టర్ తనను అసభ్యంగా తాకినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. సదరు కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు టీజీఎస్ఆర్టీసీ ఎండీ, షీ టీమ్స్, హైదరాబాద్ పోలీసులకు ఎక్స్ ద్వారా ఫిర్యాదు చేసింది.‘ఈ నెల 15న (మంగళవారం)మణికొండ నుంచి హిమాయత్ నగర్ వెళ్తున్నా. ఆధార్ కార్డు లేకపోవడంతో రూ. 30 డబ్బులిచ్చి టికెట్ తీసుకున్నా. బస్సు రద్దీగా ఉండటంతో అదే అదనుగా భావించిన కండక్టర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను అనుచితంగా తాకాడు. 2 సెకన్లు ఏం జరిగిందో అర్థం కాలేదు. అంకుల్ ఏం చేస్తున్నారంటూ గట్టిగా అరవగానే వెనక్కి వెళ్లిపోయాడు. సదరు కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు.తాజాగా ఈ ఫిర్యాదుపై టీజీఎస్ఆర్టీసీ స్పందించింది. ఫరూక్ నగర్ కండక్టర్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌లో ‘ఫరూఖ్‌నగర్ డిపోకు చెందిన ఒక కండక్టర్ ప్రయాణ సమయంలో తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఒక యువతి సోషల్ మీడియా ద్వారా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖపరమైన చర్యలను సంస్థ తీసుకుంటుంది. టీజీఎస్ఆర్టీసీ మహిళా భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. ప్రతి రోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది.’ అని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఫరుఖ్‌నగర్ డిపోనకు చెందిన ఒక కండక్టర్ ప్రయాణ సమయంలో తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఒక యువతి సోషల్ మీడియా ద్వారా #TGSRTC యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖపరమైన చర్యలను సంస్థ… pic.twitter.com/pCzfcZRUz4— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) July 16, 2024 -
శోభ.. 'నిజాయితీ' కి మారుపేరు..!
మహబూబ్‌నగర్: ఆర్టీసీ బస్సులో దొరికిన బంగారు ఆభరణాల పర్సును బాధిత మహిళకు అందజేసి నిజాయితీ చాటుకుంది ఓ ప్రయాణికురాలు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పునుంతల మండలం కాంసానిపల్లికి చెందిన నెల్లోజు ప్రసన్న ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి కల్వకుర్తి నుంచి ఉప్పునుంతల వరకు అచ్చంపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఎక్కింది. ఉప్పునుంతలలో దిగి గ్రామానికి వెళ్లి హ్యాండ్‌బ్యాగ్‌లో చూడగా బంగారు ఆభరణాలు (సుమారు రూ.3 లక్షల విలువ)న్న పర్సు కనిపించలేదు. అదే బస్సులో ప్రయాణించిన సదగోడుకు చెందిన శోభకు బస్సులోనే ఆభరణాల పర్సు దొరకగా కండక్టర్ నారాయణమ్మకు అందజేసింది. సోమవారం అచ్చంపేట డిపో ఆవరణలో బాధితురాలు ప్రసన్నకు పర్సును అందజేసి నిజాయితీని చాటుకుంది. -
కిడ్నీ అమ్ముతా కొంటారా? ఫేస్బుక్లో పోస్ట్
బెంగళూరు: కరోనా ప్రభావంతో ప్రపంచమంతటా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ప్రజల స్థితిగతులు మారిపోయాయి. భారతదేశంలో ఆ ప్రభావం చిరుద్యోగులు, మధ్య తరగతి, పేదవారిపై తీవ్రంగా ప్రభావం చూపింది. దాని ప్రభావంతో ఓ వ్యక్తి ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో ‘కిడ్నీలు అమ్ముతా.. ఎవరైనా కొంటారా?’ అని ప్రకటన విడుదల చేశాడు. అంతటి కడు పరిస్థితి ఆయనకు ఏర్పడింది. ఇది చూసిన నెటిజన్లు ఆయనకు అండగా నిలుస్తున్నారు. కిడ్నీలు అమ్మొద్దు అంటూ సలహా ఇస్తున్నారు. కర్ణాటక ఆర్టీసీ ఎన్ఈకేఆర్టీసీలో కండక్టర్‌గా హనుమంత్ (38) పని చేస్తున్నాడు. లాక్డౌన్ ప్రభావంతో సంస్థ జీతాల్లో కోత విధించింది. దీంతో వచ్చే అరకొర జీతంతో కుటుంబ పోషణ భారమైంది. తీవ్రమైన ఆర్థిక సమస్యలు వచ్చిపడ్డాయి. దీంతో తన కిడ్నీని అమ్మకానికి పెడుతున్నట్లు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. జీతం తగ్గించడం వల్ల రోజూవారీ ఖర్చులను భరించలేకపోతున్నామని, అందుకే తన కిడ్నీని అమ్మాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఆయన ఫేస్బుక్లో ఈ విధంగా చెప్పాడు. ‘నేను రవాణా సంస్థలో కండక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నా. నాకు వస్తున్న కోతలతో కూడిన జీతం సరిపోవడం లేదు. రేషన్, ఇంటి అద్దెకు చెల్లించడానికి వచ్చిన జీతం సరిపోవడం లేదు. దీంతో నా కిడ్నీని అమ్మాలని నిర్ణయించుకున్నా. ఆసక్తి ఉన్నవాళ్లు నాకు ఫోన్ చేయండి.’ అంటూ హనుమంతు తన ఫోన్ నెంబర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి నార్త్ ఈస్ట్ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ సంబంధించిన ఫేస్బుక్ పేజీని ట్యాగ్‌ను జత చేశాడు. అయితే దీనిపై మీడియా ప్రశ్నించగా తన బాధనంతా చెప్పుకున్నాడు. ‘సంస్థ ఇచ్చే జీతంతో ఇంటి అద్దె చెల్లించడం, ఇంట్లో కిరాణా సామగ్రి కొనుగోలు చేయడం, పిల్లల చదువులు భారంగా మారాయి’ అని విలపిస్తూ చెప్పాడు. అతడి పోస్టుపై ఆర్టీసీ అధికారులు స్పందించారు. హనుమంతు క్రమంగా ఉద్యోగానికి రాకపోవడంతోనే అతడికి తక్కువ జీతం వస్తుందని వివరణ ఇచ్చారు. ఈ విషయమై అతడికి తాము చాలా సార్లు హెచ్చరించామని తెలిపారు. -
అందుకున్న కల
పెళ్లి, పిల్లలు కుటుంబ బాధ్యతల్లోనే మహిళ జీవనం గడిచిపోతుంది. ఉద్యోగినిగా మారితే అదనపు బాధ్యత వచ్చి చేరుతుంది. ఆ బాధ్యతలు, విధుల్లో తలమునకలుగా ఉండటంతో చిన్ననాటి కలలు ఎక్కడో మరుగున పడిపోతాయి. అయితే, స్వరాజ్వలక్ష్మి తన కలల్ని విడిచిపెట్టేయలేదు. గృహిణిగా, కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూనే పరుగుల రాణిగా తన కలను తనే అందుకున్నారు. బైరి స్వరాజ్యలక్ష్మి ఉండేది సికింద్రాబాద్‌కు చేరువలో ఉన్న మచ్చబొల్లారంలో. వయసు నాలుగు పదులు దాటింది. భర్త ధన్‌రాజ్ ప్రైవేటు ఉద్యోగి. ఒక్కగానొక్క కొడుకు. చిన్న కుటుంబం. చింతల్లేవు. ‘‘నాన్న రైల్వేలో ఉద్యోగి కావడంతో నేనూ రైల్వే కాలేజీలో చదువుకున్నాను. స్కూల్, ఇంటర్మీడియెట్ స్థాయిలో రన్నింగ్ కాంపిటిషన్లో పాల్గొనేదాన్ని. ఎప్పుడూ ఫస్ట్ వచ్చేదాన్ని. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పీటీ ఉషలా పేరుతెచ్చుకోవాలని కలలు కనేదాన్ని. అయితే ఇంటర్మీడియెట్ పూర్తికాగానే అక్కడితో చదువు ఆపేయమన్నారు అమ్మానాన్న’’ అని చెప్పారు స్వరాజ్యలక్ష్మి. చదువుతో పాటే రన్నింగ్ రేస్‌లలో పాల్గొనడమూ ఆగిపోయింది. ముగ్గురు అక్కచెల్లెళ్లు. వాళ్ల పెళ్లిళ్లు చేసి బాధ్యతలు తీర్చుకున్నారు స్వరాజ్యలక్ష్మి తల్లిదండ్రులు. గ్రౌండ్లలో రౌండ్లు ‘‘మా వారిది ప్రైవేటు ఉద్యోగం కావడంతో, చదువుకున్నది కొంత వరకే అయినా ఖాళీగా ఉండటం ఇష్టంలేకపోవడంతో ఉద్యోగం చేస్తానని చెప్పాను. తన ప్రోత్సాహంతో ఇరవై ఏళ్ల క్రితం ఆర్టీసీలో కండక్టర్ చేరాను. గృహిణిగా ఇంటి బాధ్యతలు, ఉద్యోగినిగా కండక్టర్ విధులు, తల్లిగా పిల్లాడి పనులు.. రోజులు గడిచిపోతున్నాయి. ఆ సమయంలో.. ఎనిమిదేళ్ల క్రితం.. ఆర్టీసీ తరపున స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా దేశ, అంతర్జాతీయ స్థాయిల్లో జరిగే పోటీల్లో పాల్గొనవచ్చని తెలిసింది. చదువుతో ఆగిపోయిన నా కలలకు కొత్త రెక్కలు వచ్చి చేరినట్టు అనిపించింది. రన్నింగ్.. అనే మరుగున పyì పోయిన జ్ఞాపకం తిరిగి నా కళ్లెదుటికి వచ్చింది. ఇంట్లో ఈ విషయం చెప్పడంతోనే సపోర్ట్ కూడా వచ్చింది. ఆ రోజు నుంచి నా టైమ్ టేబులే మారిపోయింది. ఉదయం 5 గంటలకల్లా డ్యూటీకి వెళతాను. మధ్యాహ్నం 2:30 కల్లా ఇంటికి వచ్చేస్తాను. ఓ అరగంట విశ్రాంతి. తర్వాత స్కూల్ నుంచి వచ్చిన బాబుకు టిఫిన్ పెట్టి, కాసేపు హోమ్ వర్క్ చేయించి, తిరిగి 5 గంటలకు బొల్లారంలోని పబ్లిక్ గ్రౌండ్‌కు వెళతాను. వారంలో ఒక్కరోజైనా ఉస్మానియా యూనివర్శిటీ గ్రౌండ్, ఇందిరా గార్డెన్‌లోనూ ప్రాక్టీస్‌కి వెళతాను. అలా ప్రాక్టీస్ చేస్తూనే.. రెండేళ్ల క్రితం ఇండోనేషియాలో జరిగిన రన్నింగ్ కాంపిటేషన్‌లో పాల్గొని బంగారు పతకంతో తిరిగి వచ్చాను. దేశీయస్థాయిలో ఢిల్లీ, రాజస్థాన్, చండీగడ్లలోనూ రన్నింగ్ పోటీల్లో పాల్గొన్నాను. 2018లో ఇండోనేషియా జకార్తాలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్ పోటీల్లో బంగారు పతకాలు, 3 కిలోమీటర్ల నడక పందెంలో కాంస్య పతకం, గతేడాది గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్రస్థాయి పరుగు పోటీల్లో 100, 400, 800 మీటర్ల విభాగంలో బంగారు పతకాలు సాధించాను. పతకాల విజేతగా నమ్మలేకపోతుంటారు ‘‘ఈ నెలలో దేశీయ స్థాయిలో హర్యానాలో పోటీలు జరుగుతున్నాయి. 8 నుంచి 11 వరకు అక్కడ జరిగే నేషనల్ కాంపిటిషన్స్కు వెళుతున్నాను. ప్రయాణ ఖర్చుల వరకు నేను పెట్టుకొని వెళతాను. మిగతా వసతి సదుపాయాలు నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. నా సహోద్యోగులు ‘మేం చేయలేనిది నువ్వు చేస్తున్నావ్, గ్రేట్’ అంటుంటారు. ‘ఈ వయసులో మాకు కాళ్ల నొప్పులు. మరి నువ్వెలా పరిగెడుతున్నావు?’ అని కొందరు అంటుంటారు. చదువుకునే రోజుల్లో ఆటలు వద్దని చెప్పిన అమ్మనాన్న, బంధువులే కాదు నాతో పాటు పెరిగిన నా చెలెళ్లు్ల కూడా ఇప్పుడు నా గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు...’’ అని నవ్వుతూ అన్నారు స్వరాజ్యలక్ష్మి. అమ్మాయిలు తమ కలగన్న జీవితాన్ని అందుకోవడానికి చాలా అడ్డంకులే ఏర్పడుతుంటాయి. వాటిని అధిగమిస్తూ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలనుకునేవారికి స్వరాజ్యలక్ష్మి పట్టుదల ఒక స్ఫూర్తి. – నిర్మలారెడ్డి -
బాలుడిని చేరదీసిన కండక్టర్
పోచమ్మమైదాను : జనగామ నుంచి మంగళవారం రాత్రి వచ్చిన బస్సులో ఒంటరిగా ఓ బాలుడు కనిపించడంతో గమనించిన కండక్టర్ 1098కి సమాచారం ఇచ్చారు. చైల్డ్‌లైను సిబ్బంది అక్కడికి చేరుకొని బాలుడిని తీసుకెళ్లి సీడబ్ల్యూసీ చైర్మను అనితారెడ్డి ఎదుట బుధవారం హాజరుపరిచారు. అనంతరం ఆ బాలుడికి బాలసదనంలో ఆశ్రయం కలి్పం చారు. బాలుడి వయస్సు 9 సంవత్సరాలు ఉంటుంది. బాలుడి పేరు మహేష్ అని, తండ్రి పేరు రవి, తల్లి పేరు బాగమ్మ అని చెబుతున్నాడు. అడ్రస్ మాత్రం చెప్పడం లేదు. కాగా అతడికి రాత్రి ఫిట్స్ రావడంతో ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడి బంధువులు ఎవరైనా ఉంటే ఆధారాలతో 1098, 9177362072 నంబర్‌కు ఫో¯ŒS చేయాలని అనితారెడ్డి కోరారు. -
టవరెక్కిన కండక్టర్
♦ డీఎం వేధిస్తున్నాడని నిరసన ♦ డీఎంను సస్పెండ్ చేయండి లేదాంటే చస్తా అని బెదిరింపు ♦ ఆర్ఎం హామీతో కిందకు దిగిన కండక్టర్ జీవీకేరెడ్డి ♦ వేదింపులకు పాల్పడలేదు డ్యూటీ చేయమన్నందుకే ఇదాంతా: డీఎం సూర్యనారాయణ వికారాబాద్ రూరల్: డీఎం ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓ కండక్టర్ డిపోలో ఉన్న హైమాస్ట్ లైట్లకు సంబంధించిన టవర్ ఎక్కి చస్తానని బెదిరించిన సంఘటన వికారాబాద్ పట్టణంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నా జీవీకేరెడ్డి గురువారం ఉయదం వస్తూ వస్తూనే డిపోలో ఉన్న టవర్ ఎక్కి డీఎంను సస్పెండ్ చేయాలి లేదాంటే ఇక్కడి నుండి దూకి చచ్చిపోతానంటూ భిష్మించుకూర్చున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వికారాబాద్ సీఐ రవి సంఘటన స్థలానికి చేరుకుని జీవీకేరెడ్డిని కిందకు దిగాలని సూచించిన వినలేదు. సుమారు గంటన్నరకుపైగా టవర్‌పైనే ఉన్న జీవీకేరెడ్డి వినేలా లేడని సీఐ రవి ఉన్నతాధికారులతో పాటు, ఆర్ఎంతో జీవీకేరెడ్డికి ఫోన్లో మాట్లాడించాడు. ఆర్ఎం ఏదైనా ఉంటే తగిన న్యాయం చేస్తానని ముందు టవర్ నుంచి కిందకు దిగాలని సూచించడంతో జీవీకేరెడ్డి కిందకు దిగాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. డీఎం సూర్యానారాయణ అనవసరంగా అందరి ముందు మర్యాద లేకుండా ప్రవర్తించి ఆయన కార్యాలయం ముందు మూడుగంటలు నిలబెట్టడం జరిగిందన్నారు. డ్యూటీలు పదే పదే వేస్తే ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లి యూనియన్ నాయకులతో సమస్యలను విన్నవించాడు. ఎలాంటి వేదింపులు చేయలేదు: డీఎం సూర్యానారాయణ నిరంతరం ఆర్టీసీ సిబ్బంది బాగుగోలు, ఆదాయం గురించి ఆలోచించడం తప్ప ఎప్పుడు ఎవరిని ఎలాంటి వేదింపులకు గురిచేయలేదు. సరిగ్గా పని చేయమన్నందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. డిపోలో ఎవరికి ఇవ్వనన్ని సెలవులు ఆయనకుఆరోగ్యం బాగు లేదంటే ఇవ్వడం జరిగింది. ఈ రోజుకు కూడా అతనికి ఆరోగ్యం బాగా లేదంటే సెలవు ఇచ్చాం. నేను రైలులో హైదరాబాద్ వెళుదామని వెళుతుంటే ఆర్ఎం ఫోన్ చేసి కండక్టర్ టవర్ ఎక్కాడు అనేంత వరకు నాకు తెలియదు. ఆరోగ్యం బాగా లేక పోతే ఇంటికి వెళ్లాలి కాని టవర్ ఎక్కి బెదింరిచడం కావాలని చేస్తున్నారన్నారు. డిపోలో ఎవరినైనా చార్ట్ ప్రకారం డ్యూటీ చేయాలని సూచించడం జరుగుతుందన్నారు. డిపోలో అందరూ బాగుండాలని తపత్రయం పడుతాం సూచనలు సలహాలు ఇవ్వాలని కాని ఇలా ప్రవర్తించకూడదు.