భువనేశ్వర్: పూరీ – హౌరా మధ్య ప్రారంభమైన 22895/22896 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆహారం చార్జీలతో పాటు టికెటు ధర నిర్ణయించారు. రైలులో ఆహారం అవసరం లేకుంటే మినహాయింపు కల్పించి టికెటు చార్జీలు కుదిస్తారు.
టికెటు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికుడు ప్రకటించిన నిర్ణయం మేరకు ఈ సౌకర్యం కల్పిస్తారు. నో ఫుడ్ ఆప్షన్ ఎంచుకుంటే, క్యాటరింగ్ ఛార్జీలు టికెటు ధర నుంచి నుంచి మినహాయిస్తారు. హౌరా నుంచి ఈ రైలు ఆగే పలు రైల్వేస్టేషన్ల వరకు ప్రయాణ చార్జీల వివరాలు ఇలా ఉన్నాయి. దీనిలో ఏసీ చైర్ కారు (సీసీ) కేటరింగ్ చార్జీ రూ.162లు, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు (ఈసీ) కేటరింగ్ చార్జీ రూ.195లుగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment