'కల్కి' ఖాతాలో నెవ్వర్ బిఫోర్ రికార్డ్.. బలైపోయిన షారూఖ్ | Kalki 2898 AD Ticket Booking Records In Online Sales Latest | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD: 'కల్కి' పాన్ ఇండియా రికార్డ్.. ఇప్పట్లో అందుకోవడం కష్టమే!

Published Thu, Jul 18 2024 11:11 AM | Last Updated on Thu, Jul 18 2024 12:01 PM

Kalki 2898 AD Ticket Booking Records In Online Sales Latest

థియేటర్లలోకి వచ్చి మూడు వారాలు అవుతున్నా 'కల్కి' జోరు ఇంకా తగ్గట్లేదు. దీనికి పోటీ ఇచ్చే మరో సినిమా లేకపోవడం కూడా బాగా ప్లస్ అయింది. దీంతో జనాలు ఇంకా థియేటర్లకు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే వసూళ్లలో అద్భుతమైన రికార్డులు నెలకొల్పిన 'కల్కి'.. ఇప్పుడు మరో క్రేజీ ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా ఎవరికీ సాధ్యం కానీ విధంగా ప్రభాస్ తన కొత్త సినిమాతో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇంతకీ అదేంటంటే?

ఒకప్పటితో పోలిస్తే సినిమా టికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే దాదాపుగా సేల్ అవుతున్నాయి. అలా బుక్ మై షోలో 'కల్కి' చిత్రానికి ఇప్పటివరకు 12.15 మిలియన్ల బుక్ అయ్యాయి. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే 'జవాన్' మూవీకి లైఫ్ టైమ్ వచ్చిన 12.01 మిలియన్ల మార్క్‌ని ప్రభాస్ మూవీ అధిగమించింది. తద్వారా దేశంలో ఇలా అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన మూవీగా 'కల్కి' అరుదైన ఘనత సాధించింది.

ప్రస్తుతం చెప్పుకొన్నది ఆన్‌లైన్‌ వరకే. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా చోట్లు ఉన్న సింగిల్ స్క్రీన్లలో సాధారణంగా ఇచ్చే టికెట్లు కూడా లక్షల్లోనే అమ్ముడిపోయి ఉండొచ్చు. తద్వారా ఇప్పటివరకు లేని విధంగా 'కల్కి' సరికొత్త రికార్డులు సాధిస్తుండటం విశేషం. ట్రెండ్ చూస్తుంటే ఇప్పట్లో ఈ రికార్డులు ఎవరైనా అందుకుంటారా అనేది సందేహంగా మారుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement