Adipurush Movie Crossed 1 Million Likes In BookMyShow Creates History, Deets Inside - Sakshi
Sakshi News home page

Adipurush BookMyShow Likes: 'ఆదిపురుష్' క్రేజీ రికార్డ్.. RRRని మాత్రం దాటలేకపోయింది!

Published Fri, Jun 16 2023 11:44 AM | Last Updated on Fri, Jun 16 2023 12:43 PM

Adipurush Likes Cross 1 Million In BookMyShow - Sakshi

ఎవరిని కదిపినా సరే 'ఆదిపురుష్' సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చేసిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకుల్ని అద్భుతంగా ఎంటర్‌టైన్ చేస‍్తోంది. తొలిరోజు షోలన్నీ ఇప్పటికే హౌస్ ఫుల్స్ అయిపోయాయి. ఇలాంటి టైంలో ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ రాముడిగా నటించిన 'ఆదిపురుష్'ని రామాయణం ఆధారంగా తీశారు. టీజర్ ని గతేడాది రిలీజ్ చేసిన టైంలో ఈ మూవీపై ఘోరమైన ట్రోల్స్ వచ‍్చాయి. దీంతో థియేటర్లలోకి వచ్చి ఈ సినిమాని ఎవరైనా చూస్తారా అని అందరూ అనుకున్నారు. కానీ ట్రైలర్స్ విడుదల చేసిన తర్వాత నెగిటివిటీ కాస్త పాజిటివ్ గా మారింది. అంతటా హైప్ ఏర్పడింది. దీంతో జనాలు 'ఆదిపురుష్'పై ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు.

'ఆదిపురుష్'పై ఇష్టాన్ని చాలామంది సోషల్ మీడియాలో చూపిస్తే.. మరికొందరు టికెట్స్ అమ్మే బుక్ మై షోలో లైక్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలా ఇప్పటివరకు 1.1 మిలియన్ యూజర్స్.. ఈ టికెట్ బుకింగ్ సైట్ లో 'ఆదిపురుష్'కి లైక్ కొట్టారు. దీంతో 1 మిలియన్ మార్క్ అందుకున్న మూవీగా ఇది ఘనత సాధించింది. ఈ లిస్టులో 'ఆర్ఆర్ఆర్'.. 1.75 మిలియన్ లైక్స్ తో టాప్ లో ఉంది. మరి మీలో ఎవరైనా 'ఆదిపురుష్' చూశారా?

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' థియేటర్‌లో నిజంగానే ప్రత్యక్షమైన హనుమాన్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement