ఆ సినిమా దెబ్బకు ’బుక్ మై షో’ సర్వర్‌ డౌన్‌! | BookMyShow server down due to Dangal | Sakshi
Sakshi News home page

ఆ సినిమా దెబ్బకు ’బుక్ మై షో’ సర్వర్‌ డౌన్‌!

Published Fri, Dec 23 2016 1:27 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

ఆ సినిమా దెబ్బకు ’బుక్ మై షో’  సర్వర్‌ డౌన్‌!

ఆ సినిమా దెబ్బకు ’బుక్ మై షో’ సర్వర్‌ డౌన్‌!

మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ తాజా సినిమా ‘దంగల్‌’ శుక్రవారం విడుదల అవుతుండటంతో ఈ సినిమా టికెట్లను ముందస్తుగా బుక్‌ చేసుకోవడానికి జనం పోటెత్తారు. దీంతో ఒక దశలో బుక్‌ మై షో.కామ్‌ వెబ్‌సైట్‌ సర్వర్‌ డౌన్‌ అయి.. క్రాష్‌ అయినట్టు తెలుస్తోంది.

శుక్రవారం మధ్యాహ్న సమయంలో కొంతసేపు వెబ్‌సైట్‌ సర్వర్‌ మొరాయించినట్టు తెలుస్తోంది. దీంతో వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయడానికి ప్రయత్నించిన కొంతమంది వినియోగదారులకు ఎర్రర్‌ మెసేజ్‌ వచ్చింది. సినిమాలు, ప్రత్యేక షోల ఈ-టికెట్లు అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకొనే సదుపాయన్ని బుక్‌మైషో వెబ్‌సైట్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే.

రెజ్లింగ్‌ ఇతివృతంతో వస్తున్న ఆమిర్‌ తాజా చిత్రం ’దంగల్‌’కు సానుకూల రివ్యూలు పోటెత్తడం, మంచి మౌత్‌టాక్‌ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ముంబై, పుణె వంటి నగరాల్లో ఇప్పటికే చాలా థియేటర్లలో అడ్వాన్స్‌ బుకింగ్‌ టికెట్లు అయిపోయాయి. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రారంభ వసూళ్లు భారీగా ఉంటాయని భావిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలోనూ మంచి టాక్‌తో ఈ సినిమా థియేటర్లు ఫుల్‌ అవుతున్నాయని తెలుస్తోంది. తెలుగులోనూ ’దంగల్‌’ సినిమా ’యుద్ధం’ పేరిట డబ్‌ అయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement