బుక్‌మైషో చేతికి బర్ప్
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ టికెట్ సేవల సంస్థ బుక్‌మైషో (బీఎంఎస్) తాజాగా ముంబైకి చెందిన బర్ప్ సంస్థను కొనుగోలు చేసింది. స్థానిక రెస్టారెంట్ల సమాచార వివరాలు అందించే ఈ సంస్థను నెట్‌వర్క్18 నుంచి దక్కించుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ బిగ్‌ట్రీలో భాగమైన ఫుడ్‌ఫెస్టా వెల్‌కేర్ ద్వారా ఈ డీల్ పూర్తి చేస్తున్నట్లు బీఎంఎస్ తెలిపింది. నెట్‌వర్క్18కి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్ గ్రూప్ కాగా.. బీఎంఎస్ బిగ్‌ట్రీ నిర్వహణలో ఉంది.
2006లో ప్రారంభమైన బర్ప్‌లో ప్రస్తుతం 12 నగరాల్లోని 56,000 పైచిలుకు రెస్టారెంట్లు లిస్ట్ అయి ఉన్నాయి. 2016–17లో సంస్థ ఆదాయం రూ. 56.67 లక్షలు. నెట్‌వర్క్18 టర్నోవర్‌లో ఇది 0.69 శాతం. 2017 మార్చి ఆఖరు నాటికి బర్ప్ నికర విలువ మైనస్ రూ. 28.89 కోట్లుగా ఉంది. స్లంప్ సేల్ ప్రాతిపదికన కన్సల్టెన్సీ సంస్థ ఈవై.. బర్ప్ విలువను రూ. 6.7 లక్షలుగా లెక్కగట్టినట్లు నెట్‌వర్క్18 పేర్కొంది.