నాగోలు: సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2 లక్షలు తీసుకుని నకిలీ టికెట్లు ఇచ్చిన ఇద్దరిపై ఎల్బీనగర్ ఠాణాలో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారానికి చెందిన పెద్దగోని మైసయ్య (48) డ్రైవర్. మార్చి 30న మల్లేపల్లిలో నిర్వహించిన ఈఎస్‌ఐ క్యాంప్‌కు వెళ్లగా.. అక్కడ బోరబండకు చెందిన సామ్రాట్‌తో పరిచయమైంది.ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రకాశ్‌రెడ్డిని పరిచయం చేశాడు.
సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని మైసయ్యతో నమ్మబలికారు. ఎల్బీనగర్‌లోని సుప్రభాత్ హోటల్ వద్దకు అతడి ని పిలిచి.. ‘‘నీకు వీసా వచ్చింది, ఏప్రిల్ 29న నిజామాబాద్ వచ్చి వైద్య పరీక్షలు చేయిం చుకో’’ అన్నారు. దీంతో మైసయ్య నిజామాబాద్ వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని రూ.2,500 చెల్లించాడు. అనంతరం ఏప్రిల్ 30న సామ్రాట్, ప్రకాశ్‌రెడ్డి పని అయిపోయిందని చెప్పి రూ. లక్ష తీసుకున్నారు.
అనంతరం మే 5న ఎయిర్ ఏషియా టికెట్‌లు చేతికి ఇచ్చి మైసయ్య వద్ద నుంచి ఒరిజినల్ ఎస్సెస్సీ మెమో, పాస్‌పోర్ట్ తీసుకొని, అదే నెల 11న సింగపూర్‌కు వెళ్లమని చెప్పి మరో రూ. లక్ష తీసుకున్నారు. 11న కుటుంబ సభ్యులతో కలిసి రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లగా..అవి నకిలీ టికెట్లని తేలింది. దీంతో మైసయ్య మోసపోయినట్లు తెలుసుకున్నాడు.
ఇదిలా ఉండగా.. అదే రోజు రాత్రి మైసయ్యకు ప్రకాశ్‌రెడ్డి నుంచి ఓ ఇమెయిల్ వచ్చింది. అందులో ‘‘నేను ఒకరిని నమ్మి మోసపోయా. నీ మీద ఖర్చు చేసిన రూ.12 వేలు నా ఖాతాలో వేస్తే పాస్‌పోర్టు, ఎస్‌ఎస్‌సీ మెమో పంపిస్తానని’’ అని ఉంది. మోసపోయాయ నని బాధితుడు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సింగపూర్‌లో ఉద్యోగం పేరిట మోసం
Published Mon, Jun 27 2016 8:01 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement