nagolu
-
నాగోలు పీఎస్ ఎస్ఐ, ఏఎస్ఐ సస్పెన్షన్
నాగోలు: నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత యువకుడిపై దాడి ఘటనలో కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఇన్స్పెక్టర్ పరశురాంపై రాచకొండ పోలీస్ కమిషనర్ బదిలీ వేటు వేశారు. దీనిలో భాగంగానే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాగోలు ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యలను కూడా సస్పెండ్ చేస్తూ ఆదివారం రాత్రి రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి చర్యలు తీసుకున్నారు. ఎల్బీనగర్లోని భరత్‌నగర్ కాలనీ చెందిన దాసరి గౌతమ్ అలియాస్ బద్దు ప్రైవేట్ ఉద్యోగి. ఇతనికి నాగోలు సాయినగర్ కాలనీలో నివాసం ఉండే వేముల మల్లేష్, అతని కుమారుడు (16) మైనర్ మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన గౌతమ్ పోలీసులను ఆశ్రయించగా వారు స్పందించలేదు. దీంతో తనపై జరిగిన దాడి ఘటన గురించి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టి ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు. -
యువకుడిపై దాడి కేసులో నిర్లక్ష్యం..
నాగోలు: దళిత యువకుడిపై దాడి కేసులో పోలీసులు స్పందించలేదు. బాధితుడు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం ఠాణాను ఆశ్రయించినా నిర్లక్ష్యం వహించిన నాగోలు ఇన్స్పెక్టర్ పరశురాంపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోసి బదిలీ వేటు వేశారు. ఇదే కేసులో నాగోలు ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యపై అధికారులు చర్య తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కాగా.. నాగోలు ఇన్చార్జి ఇన్స్పెక్టర్గా ఎల్బీనగర్ డీఐ సుధాకర్‌ను నియమించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎల్బీనగర్లోని భరత్‌నగర్ కాలనీకి చెందిన దాసరి గౌతమ్ అలియాస్ బద్దు (20) ప్రైవేట్ ఉద్యోగి. నాగోలు సాయినగర్ కాలనీలో నివాసం ఉండే వేముల మల్లేష్ అతని కుమారుడు (16), గౌతమ్‌ల మధ్య గతంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో గౌతమ్‌ను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 6న నాగోలు సాయినగర్ కాలనీలో స్నేహితుడి ఇంట్లో నిద్రస్తున్న గౌతమ్‌పై మల్లేష్, నరేష్ అనిల్, జ్యోతి, నాగరాజు, పవన్‌కుమార్, మరో ఇద్దరు మైనర్లు దాడి చేశారు. భవనం పైఅంతస్తు నుంచి కిందకు లాక్కు వచ్చి రాయి, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో గౌతమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం టెలిఫోన్ స్తంభానికి కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గౌతమ్ మృతి చెందినట్లు భావించి నిందితులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. అనంతరం గాయపడిన గౌతమ్‌ను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. బాధితుడు గౌతమ్ తనపై జరిగిన దాడిపై ఈ నెల 21న నాగోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ.. ఇన్స్పెక్టర్ పరశురాం స్పందించలేదు. దీంతో బాధితుడు తగిన ఆధారాలతో ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 22న ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు జువైనల్ అఫెండర్లను హోంకు తరలించారు.ఉప్పల్ ఎస్ఐపై కూడా.. ఉప్పల్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, పోకరీలతో అంటకాగుతున్నాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉప్పల్ ఎస్ఐ సీహెచ్ శంకర్‌పై రాచకొండ సీపీ సస్పెన్షన్ వేటు వేశారు. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్ భగాయత్ లే అవుట్లో ప్రేమ జంట ఇచి్చన ఫిర్యాదుపై ఉప్పల్ ఎస్ఐ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించాడని, ఇందుకోసం భారీగా ముడుపులు తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు శనివారం ఉప్పల్ ఎస్ఐ శంకర్‌పై విచారణకు ఆదేశించి, ఆదివారం శంకర్‌ను సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఐతో పాటు ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని రాచకొండ సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇన్చార్జి ఇన్స్పెక్టర్గా డీఐ మన్మథరావును నియమించారు. -
చిల్లర కోసం చిత్రమైన చోరీ
నాగోలు: పెద్ద నోట్ల రద్దుతో విచిత్రమైన దొంగతనాలు వెలుగుచూస్తున్నాయి. నోట్లు రద్దు తర్వాత చిల్లర కోసం ప్రజలు నానా కష్టాలు పడుతున్న నేపథ్యంలో దొంగలు ఓ వైన్‌షాపు షెట్టర్ తాళాలు పగులగొట్టి అందులోని చిల్లర నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హస్తినాపురం సంతోషిమాతా దేవాలయం సమీపంలో ఉన్న లక్ష్మీనరసింహ వైన్స్‌లో శనివారం రాత్రి చోరీ జరిగింది. మద్యం దుకాణం షెట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు గల్లాపెట్టేలోని 10, 50, 100 రూపాయల నోట్ల రూపంలో ఉన్న దాదాపు రూ.60వేలను ఎత్తుకెళ్లారు. దీంతో నిర్వాహకుడు వెంకటేష్ ఆదివారం ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సింగపూర్‌లో ఉద్యోగం పేరిట మోసం
నాగోలు: సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2 లక్షలు తీసుకుని నకిలీ టికెట్లు ఇచ్చిన ఇద్దరిపై ఎల్బీనగర్ ఠాణాలో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారానికి చెందిన పెద్దగోని మైసయ్య (48) డ్రైవర్. మార్చి 30న మల్లేపల్లిలో నిర్వహించిన ఈఎస్ఐ క్యాంప్‌కు వెళ్లగా.. అక్కడ బోరబండకు చెందిన సామ్రాట్‌తో పరిచయమైంది.ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రకాశ్‌రెడ్డిని పరిచయం చేశాడు. సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని మైసయ్యతో నమ్మబలికారు. ఎల్బీనగర్లోని సుప్రభాత్ హోటల్ వద్దకు అతడి ని పిలిచి.. ‘‘నీకు వీసా వచ్చింది, ఏప్రిల్ 29న నిజామాబాద్ వచ్చి వైద్య పరీక్షలు చేయిం చుకో’’ అన్నారు. దీంతో మైసయ్య నిజామాబాద్ వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని రూ.2,500 చెల్లించాడు. అనంతరం ఏప్రిల్ 30న సామ్రాట్, ప్రకాశ్‌రెడ్డి పని అయిపోయిందని చెప్పి రూ. లక్ష తీసుకున్నారు. అనంతరం మే 5న ఎయిర్ ఏషియా టికెట్లు చేతికి ఇచ్చి మైసయ్య వద్ద నుంచి ఒరిజినల్ ఎస్సెస్సీ మెమో, పాస్‌పోర్ట్ తీసుకొని, అదే నెల 11న సింగపూర్‌కు వెళ్లమని చెప్పి మరో రూ. లక్ష తీసుకున్నారు. 11న కుటుంబ సభ్యులతో కలిసి రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లగా..అవి నకిలీ టికెట్లని తేలింది. దీంతో మైసయ్య మోసపోయినట్లు తెలుసుకున్నాడు. ఇదిలా ఉండగా.. అదే రోజు రాత్రి మైసయ్యకు ప్రకాశ్‌రెడ్డి నుంచి ఓ ఇమెయిల్ వచ్చింది. అందులో ‘‘నేను ఒకరిని నమ్మి మోసపోయా. నీ మీద ఖర్చు చేసిన రూ.12 వేలు నా ఖాతాలో వేస్తే పాస్‌పోర్టు, ఎస్ఎస్సీ మెమో పంపిస్తానని’’ అని ఉంది. మోసపోయాయ నని బాధితుడు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గీయుల బాహాబాహీ
హైదరాబాద్ : మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసే విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గురువారం ఘర్షణ చోటుచేసుకుంది. నాగోల్ గాంధీ విగ్రహం వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పరస్పరం రాళ్లు, చెప్పులతో దాడి చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామ్మోహన్ గౌడ్ మధ్య పూలమాల వేసి విషయంపై వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.