
నాగోలు: నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత యువకుడిపై దాడి ఘటనలో కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఇన్‌స్పెక్టర్ పరశురాంపై రాచకొండ పోలీస్ కమిషనర్ బదిలీ వేటు వేశారు. దీనిలో భాగంగానే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాగోలు ఎస్‌ఐ మధు, ఏఎస్‌ఐ అంజయ్యలను కూడా సస్పెండ్ చేస్తూ ఆదివారం రాత్రి రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి చర్యలు తీసుకున్నారు. ఎల్‌బీనగర్‌లోని భరత్‌నగర్ కాలనీ చెందిన దాసరి గౌతమ్ అలియాస్ బద్దు ప్రైవేట్ ఉద్యోగి.
ఇతనికి నాగోలు సాయినగర్ కాలనీలో నివాసం ఉండే వేముల మల్లేష్, అతని కుమారుడు (16) మైనర్ మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన గౌతమ్ పోలీసులను ఆశ్రయించగా వారు స్పందించలేదు. దీంతో తనపై జరిగిన దాడి ఘటన గురించి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టి ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు.