హైదరాబాద్‌లోని ఓ మెట్రో స్టేషన్(ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : నగరంలో కలల మెట్రో మొదలై 24 గంటలు దాటిందో లేదో.. ప్రైవేట్ దళారీలు దోపిడీకి తెర తీశారు. మియాపూర్ - నాగోల్ మెట్రో రూట్లలో ఉన్న స్టేషన్ల వద్ద ప్రైవేటు వ్యక్తులు నకిలీ టికెట్లను అమ్ముతున్నారు. టికెట్ల అమ్మకానికి సంబంధించి ఎలాంటి అధికారిక ఆదేశాలు లేవని తెలుస్తోంది. మేజర్ స్టేషన్ల వద్ద పార్కింగ్‌కు బైక్ రూ.6, కారుకు రూ.12 అధికారిక రుసుమును వసూలు చేస్తున్నారు.
మరోవైపు నగరవాసులు మెట్రో ప్రయాణానికి ఉత్సాహం చూపుతుండటంతో మెట్రో రైళ్లు రెండో రోజు కూడా కిక్కిరిసిపోయాయి. మియాపూర్ - నాగోల్‌ల మధ్య 14 మెట్రో రైళ్లు ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. కాగా, మెట్రో ప్రారంభమైన తొలి రోజున రెండు లక్షల మంది ప్రయాణించారు.
Comments
Please login to add a commentAdd a comment