మెట్రో పనులను పరిశీలిస్తున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రెండోదశ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను బుధవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ వరకు మొదలైన ట్రయల్ రన్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జులై చివరివారంలో అమీర్‌పేట- ఎల్బీనగర్ మార్గాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెట్రోతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయని తెలిపారు. మెట్రోతో నాంపల్లి రైల్వేస్టేషన్, ఎంజీబీఎస్‌ను అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు.
అదే విధంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా సెట్విన్ బస్సులను కూడా అనుసంధానం చేస్తామన్నారు. మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఎల్బీనగర్- అమీర్‌పేట మధ్యలో ఉన్న చారిత్రక సంపదని ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని ఎల్అండ్‌టీ కంపెనీని కోరామన్నారు. హైటెక్ సిటీ మార్గాన్ని అక్టోబర్‌లో పూర్తి చేస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు.
Inspected the metro rail stations at Lakdi-ka-Pul, Nampally & MGBS stations and asked @hmrgov to prepare by end of July for the line to be opened till LB Nagar
— KTR (@KTRTRS) June 20, 2018
Also directed @ltmhyd and @hmrgov to develop a heritage precinct between Nampally station & Rangamahal station pic.twitter.com/EnVqrliJIb
Comments
Please login to add a commentAdd a comment