తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శనంలో వారు స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వారికి అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ దంపతులు ఉన్నారు.