సిద్ధమవుతున్న సభావేదిక
ముఖ్యమంత్రి పర్యటన ఖరారు
Published Sun, Aug 21 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం పర్యటన అధికారికంగా ఖరారయింది. సోమవారం ఉదయం 11 గంటలకు శ్రీశైలం చేరుకోనున్న ముఖ్యమంత్రి గంటన్నర పాటు ఇక్కడ ఉండనున్నారు. పర్యటనలో శ్రీశైల మల్లన్న దర్శనం లేకపోవడం గమనార్హం. లింగాలగట్టు ఘాట్‌కు వెళ్లి యాత్రికులతో ఏర్పాట్లపై ముఖాముఖి మాట్లాడటంతోనే పర్యటన ముగియనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి హెలిక్యాప్టర్‌లో సున్నిపెంట చేరుకుంటారు. 11.15 గంటలకు రోడ్డుమార్గంలో శ్రీశైలంలోని లింగాలగట్టు పుష్కరఘాట్‌కు వెళ్తారు. 12.15 వరకు ఘాట్‌లో అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తులతో ముఖాముఖి మాట్లాడుతారు. అనంతరం 12.30 గంటలకు తిరిగి సున్నిపెంటలోని హెలిప్యాడ్‌కు చేరుకొని హెలిక్యాప్టర్‌లో గుంటూరు జిల్లా గురుజాలకు బయలుదేరుతారు. అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లలో నిమగ్నమయింది.
Advertisement
Advertisement