lingalagattu
-
ఘనంగా శ్రీశైల మల్లన్న కల్యాణోత్సవం
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ పరిధిలోని లింగాలగట్టులో ఆదివారం రాత్రి శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాలలో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా లింగాలగట్టులోస్వామి అమ్మవార్ల ప్రచారరథంతో «శోభయాత్రను నిర్వహించారు. ఆ తర్వాత స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవాన్ని చేపట్టారు. లింగాలగట్టు, సున్నిపెంట, బ్రహ్మగిరి ప్రాంతాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. -
శ్రీశైలం డ్యాం పరిసరాల్లో విరిగిపడిన కొండచరియలు
శ్రీశైలం ప్రాజెక్టు: ఉపరితల ఆవర్తనం కారణంగా కురుస్తున్న వర్షాలతో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. లింగాలగట్టు గ్రామంలో బోద్యం శ్రీను అనే వ్యక్తి ఇంట్లో బుధవారం మధ్యాహ్నం పెద్ద బండరాయి పడింది. ఆ సమయంలో ఇంట్లోనే నిద్రిస్తున్న అతని భార్య, కుమార్తెలకు తటిలో ప్రాణాపాయం తప్పింది. అదే గ్రామంలో అక్కడక్కడ కొండ చరియలు విరిగి పడి ఇళ్ల మీద పడ్డాయి. డ్యాం పరిసర ప్రాంతాల్లోనూ రోడ్లపై కొండచరియలు విరిగి పడడంతో వాహన చోదకులు,ప్రయాణికులు, స్థానికుల భయాందోళనలకు లోనవుతున్నారు. జిల్లా అధికారులు తరచూ వర్షాకాలంలో సంభవిస్తున్న ఇలాంటి ఘటనలను నివారించేందుకు చార్ట్ క్రిటింగ్ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
ముఖ్యమంత్రి పర్యటన ఖరారు
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం పర్యటన అధికారికంగా ఖరారయింది. సోమవారం ఉదయం 11 గంటలకు శ్రీశైలం చేరుకోనున్న ముఖ్యమంత్రి గంటన్నర పాటు ఇక్కడ ఉండనున్నారు. పర్యటనలో శ్రీశైల మల్లన్న దర్శనం లేకపోవడం గమనార్హం. లింగాలగట్టు ఘాట్‌కు వెళ్లి యాత్రికులతో ఏర్పాట్లపై ముఖాముఖి మాట్లాడటంతోనే పర్యటన ముగియనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి హెలిక్యాప్టర్‌లో సున్నిపెంట చేరుకుంటారు. 11.15 గంటలకు రోడ్డుమార్గంలో శ్రీశైలంలోని లింగాలగట్టు పుష్కరఘాట్‌కు వెళ్తారు. 12.15 వరకు ఘాట్‌లో అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తులతో ముఖాముఖి మాట్లాడుతారు. అనంతరం 12.30 గంటలకు తిరిగి సున్నిపెంటలోని హెలిప్యాడ్‌కు చేరుకొని హెలిక్యాప్టర్‌లో గుంటూరు జిల్లా గురుజాలకు బయలుదేరుతారు. అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లలో నిమగ్నమయింది. -
భక్తులకు మెరుగైన సౌకర్యాలు
కృష్ణ పుష్కరాల్లో పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్.విజయమోహన్ అన్నారు. మంగళవారం లింగాలగట్టులోని పుష్కరఘాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏర్పాట్ల విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదన్నారు. లింగాలగట్టు లోలెవల్ ఘాటులో భక్తుల కోసం మధ్యాహ్నా భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వయంగా శిబిరంలో పుష్కర భక్తులకు భోజనాన్ని వడ్డించారు. శ్రీశైలం డ్యామ్ నుంచి విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదలవుతున్న నీటిని నిలుపుదల చేయించి లింగాలఘాటు దిగువఘాటును సోమవారం అర్ధరాత్రి కలెక్టర్ దగ్గరుండి సిబ్బంది చేత శుభ్రం చేయించారు. – శ్రీశైలం