శ్రీశైలం డ్యాం పరిసరాల్లో విరిగిపడిన కొండచరియలు
శ్రీశైలం ప్రాజెక్టు: ఉపరితల ఆవర్తనం కారణంగా కురుస్తున్న వర్షాలతో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. లింగాలగట్టు గ్రామంలో బోద్యం శ్రీను అనే వ్యక్తి ఇంట్లో బుధవారం మధ్యాహ్నం పెద్ద బండరాయి పడింది. ఆ సమయంలో ఇంట్లోనే నిద్రిస్తున్న అతని భార్య, కుమార్తెలకు తటిలో ప్రాణాపాయం తప్పింది. అదే గ్రామంలో అక్కడక్కడ కొండ చరియలు విరిగి పడి ఇళ్ల మీద పడ్డాయి. డ్యాం పరిసర ప్రాంతాల్లోనూ రోడ్లపై కొండచరియలు విరిగి పడడంతో వాహన చోదకులు,ప్రయాణికులు, స్థానికుల భయాందోళనలకు లోనవుతున్నారు. జిల్లా అధికారులు తరచూ వర్షాకాలంలో సంభవిస్తున్న ఇలాంటి ఘటనలను నివారించేందుకు చార్ట్ క్రిటింగ్ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.