సాక్షి, యాదగిరిగుట్ట (నల్లగొండ): నూతన సంవత్సరానికి యాదాద్రి ఆలయం లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలి పారు. యాదాద్రి కొండపైన ఉన్న తన కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జనవరి 1వ తేదీన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందన్నారు. ఇందు కోసం పూజల వేళల్లో మార్పులు చేశామని వెల్లడించారు. ఉదయం 3గంటలకు ఆలయాన్ని తెరిచి రాత్రి 9.45 గంటలకు ద్వార బంధనం చేయనున్నట్లు చెప్పా రు.
భక్తుల కోసం 100 గ్రాముల లడ్డూలు, అభిషేకం లడ్డూలు మొత్తం కలిపి 60 వేలు తయారీ చేసి అందుబాటులో ఉంచుతామని వివరించారు. అలాగే 13న వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు స్వామివారిని దర్శించుకునేందు కు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అదే రోజున అధ్యయనోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. పాతగుట్టలోనూ నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశికి ఏర్పా ట్లు చేస్తామన్నారు. సమావేశంలో ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment