Timings Changed
-
ఎన్నికలు ఎందుకింత హాటు?
ఎండలు బాబోయ్ ఎండలు... ఏప్రిల్‌లోనే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఇక మే నెల మొదలైతే నిప్పుల కొలిమే! ఎన్నికల సిబ్బందితో పాటు దాదాపు 100 కోట్ల మంది ఓటర్లకు ఈసారి వేసవి సెగ మామూలుగా తగలడం లేదు. ఎన్నికలు ఇలా దంచికొడుతున్న ఎండల్లో జరగడానికి కారణం నూటికి నూరుపాళ్లూ రాజకీయాలే. అవును! తొలి లోక్‌సభ ఎన్నికలు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా చలికాలంలోనే జరిగాయి. 2004లో జరిగిన ముందస్తు ఎన్నికల పుణ్యమా అని 20 ఏళ్లుగా ఇదుగో, ఇలా మండే ఎండల్లో జరుగుతున్నాయి. అక్టోబర్ టు అక్టోబర్... స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా 1951–52లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఈ ప్రక్రియ సుదీర్ఘంగా నడిచింది. నెహ్రూ ప్రధానిగా తొలి లోక్‌సభ 1952 ఏప్రిల్ 17 నుంచి 1957 ఏప్రిల్ దాకా కొనసాగింది. అక్కణ్నుంచి 1980 దాకా లోక్‌సభ ఎన్నికలు జనవరి, ఫిబ్రవరి, లేదంటే మార్చిలోనే జరిగాయి. 1984లో ఇందిర హత్యానంతరం ప్రధాని అయిన రాజీవ్ గాంధీ లోక్‌సభను రద్దు చేయడంతో డిసెంబర్లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. 1989లో సెపె్టంబర్, అక్టోబర్ నెలల్లో జరిగాయి. సంకీర్ణ ప్రభుత్వాలు సరిగా నడవక చివరికి రెండేళ్లకే లోక్‌సభ రద్దయింది. దాంతో 1991 మే, జూన్ నెలల్లో ఎన్నికలు జరిగాయి. ఎండాకాలంలో జరిగిన తొలి ఎలక్షన్లు అవే. 1996లోనూ ఏప్రిల్, మే నెలల్లో ఎండల్లోనే ఎన్నికలు జరిగాయి. రెండేళ్లకే లోక్‌సభ రద్దవడంతో 1998 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. వాజ్‌పేయి సర్కారు 13 నెలలకే కుప్పకూలి 1999లో ఎన్నికలు సెపె్టంబర్, అక్టోబర్ మధ్య జరిగాయి. ఇప్పుడు మనందరినీ ఠారెత్తిస్తున్న ఎండాకాలపు ఎన్నికలకు 2004లో వాజ్‌పేయి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే కారణం. బీజేపీ ఆర్నెల్ల ముందే లోక్‌సభను రద్దు చేసి ఏప్రిల్, మే నెలల్లో మండే ఎండల్లో ఎన్నికలకు వెళ్లింది. అలా ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ మండుటెండల్లో మొదలైన సార్వత్రిక ఎన్నికల సీజన్ ఇప్పటికీ కొనసాగుతోంది. తర్వాత 2009, 2014, 2019లోనూ ఎండా కాలంలోనే ఎన్నికలు జరిగాయి. ఇలా రెండు దశాబ్దాలుగా ఏప్రిల్–జూన్ ఎన్నికల ‘వేడి’ కొనసాగుతూ వస్తోంది. మార్చడం కుదరదా? చట్టప్రకారం లోక్‌సభ గడువు తీరేలోగా ఎన్నికలు జరిగి కొత్త సభ కొలువుదీరాల్సిందే. తదనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఉదాహరణకు ప్రస్తుత 17వ లోక్‌సభ గడువు జూన్ 16తో ముగుస్తుంది. ఆలోపు ఎన్నికల తతంగమంతా పూర్తయి కొత్త సభ్యులతో 18వ లోక్‌సభ కొలువుదీరాలన్నమాట. కనుక ఎన్నికల తేదీలను మరీ ముందుకు, వెనక్కు జరపడం కుదరదు. అంటే మళ్లీ మధ్యంతరమో, ముందస్తు ఎన్నికలో వస్తే తప్ప ఈ షెడ్యూల్ మారబోదు. అప్పటిదాకా మనమంతా ఇలా ఎండల్లో ఓటెత్తకా తప్పదు!! లోక్‌సభ ఎన్నికలు జరిగిన తీరు... ఏడాది పోలింగ్ తేదీలు 1951–52 అక్టోబర్ 25 – ఫిబ్రవరి 21 1957 ఫిబ్రవరి 24 – మార్చి 14 1962 ఫిబ్రవరి 19–25 1967 ఫిబ్రవరి 17–21 1971 మార్చి 1–10 1977 మార్చి 16–20 1980 జనవరి 3–6 1984 డిసెంబర్ 24–28 1989 నవంబర్ 22–26 1991 మే 20 – జూన్ 15 1996 ఏప్రిల్ 27 – మే 7 1998 ఫిబ్రవరి 16–28 1999 సెపె్టంబర్ 5 – అక్టోబర్ 3 2004 ఏప్రిల్ 20 – మే 10 2009 ఏప్రిల్ 16 – మే 13 2014 ఏప్రిల్ 7 – మే 12 2019 ఏప్రిల్ 11 – మే 19 2024 ఏప్రిల్ 19 – జూన్ 1 – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్టేడియంలో అధికారి కుక్క వాకింగ్ కోసం.. విమర్శలు
ఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్‌పై.. సోషల్‌మీడియాలో తాజాగా కొందరు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ అధికారి తన కుక్కతో వాకింగ్ చేసేందుకు వీలుగా స్టేడియం వేళల్ని సవరించినందుకు మండిపడుతున్నారు. ఢిల్లీలో స్టేడియాల వేళల్ని పొడిగించింది కేజ్రీవాల్ సర్కార్. రాత్రి పది గంటలకు వరకు అథ్లెట్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ ఆదేశాల జారీ వెనుక ఉన్న వ్యవహారమే విమర్శలకు దారి తీస్తోంది. ఢిల్లీ త్యాగరాజ స్టేడియంలో ఓ ఐఏఎస్ అధికారి పెంపుడు కుక్కతో నిత్యం వాకింగ్‌కు వస్తున్నాడు. ఈ తరుణంలో ఆయన కోసం స్టేడియం నిర్వాహకులు.. అథ్లెట్లకు ప్రాక్టీస్ చేసుకునే సమయం తగ్గించారు. త్వరగా వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. దీంతో విమర్శలు వెల్లువెత్తగా.. రాత్రి పది గంటల వరకు స్టేడియాలను తెరిచి ఉంచాలని తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. Delhi CM Arvind Kejriwal has directed that all Delhi Govt sports facilities will stay open for sportspersons till 10pm (File pic) pic.twitter.com/a7d0IyodXH — ANI (@ANI) May 26, 2022 ఢిల్లీ రెవెన్యూ సెక్రెటరీ సంజీవ్ ఖీర్వార్ తన పెంపుడు కుక్కతో ఈ స్టేడియంలోనే వాకింగ్ చేస్తున్నారు. ఈయన కోసమే అథ్లెట్లను బయటకు పంపించి వేస్తున్నారంటూ.. ఫొటో ఆధారాలతో సహా విమర్శిస్తున్నారు కొందరు. అయితే స్టేడియం నిర్వాహకుడు అనిల్ చౌదరి మాత్రం విమర్శలను ఖండిస్తున్నారు. స్టేడియం అధికారిక టైమింగ్ రాత్రి ఏడువరకే. ఆ తర్వాత ఎవరినీ ఎవరూ బయటకు వెళ్లిపోమనట్లేదు. స్వచ్చందంగా అథ్లెట్లు వెళ్లిపోతున్నారంటూ చెప్పారు. మరి సంజీవ్ ఈ స్టేడియాన్ని ఉపయోగించుకుంటున్నారా? అనే ప్రశ్నకు మాత్రం ఆయన బదులివ్వలేదు. Delhi Staduim Dog Walk Row ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో .. ఇప్పుడు స్టేడియం వేళల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కేజ్రీవాల్. -
యాదాద్రిలో పూజవేళల్లో మార్పులు
సాక్షి, యాదగిరిగుట్ట (నల్లగొండ): నూతన సంవత్సరానికి యాదాద్రి ఆలయం లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలి పారు. యాదాద్రి కొండపైన ఉన్న తన కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జనవరి 1వ తేదీన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందన్నారు. ఇందు కోసం పూజల వేళల్లో మార్పులు చేశామని వెల్లడించారు. ఉదయం 3గంటలకు ఆలయాన్ని తెరిచి రాత్రి 9.45 గంటలకు ద్వార బంధనం చేయనున్నట్లు చెప్పా రు. భక్తుల కోసం 100 గ్రాముల లడ్డూలు, అభిషేకం లడ్డూలు మొత్తం కలిపి 60 వేలు తయారీ చేసి అందుబాటులో ఉంచుతామని వివరించారు. అలాగే 13న వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు స్వామివారిని దర్శించుకునేందు కు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అదే రోజున అధ్యయనోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. పాతగుట్టలోనూ నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశికి ఏర్పా ట్లు చేస్తామన్నారు. సమావేశంలో ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు పాల్గొన్నారు. -
Telangana: ఇంటర్ పరీక్ష గంటన్నరే!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలను నిర్వహించే దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. సెకండియర్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షల్లోని మార్కులను ప్రాతిపదికగా తీసుకొని పాస్ చేశారు. మరి ఫస్టియర్ విద్యార్థులకు ఏ ప్రాతిపదిక లేకపోవడం, 35 శాతం మార్కులు తీసుకోవడానికి కొందరు విద్యార్థులు విముఖంగా ఉండటంతో పరీక్షల నిర్వహణకే విద్యాశాఖ మొగ్గు చూపుతోంది. దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపింది. అయితే తాజాగా పరీక్షల సమయాన్ని కుదించాలని విద్యాశాఖ యోచిస్తోంది. గతంలో సమయం మూడు గంటలు ఉండగా, కరోనా నేపథ్యంలో గంటన్నరకు కుదించాలని యోచిస్తున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఫస్టియర్ విద్యార్థులకు మాత్రం పరీక్షలను రద్దు చేసి, సెకండియర్‌కు ప్రమోట్ చేశారు. ఒకవేళ ఈ ఏడాది మళ్లీ వైరస్ విజృంభించి మరోసారి పరీక్షలను రద్దు చేయాల్సి వస్తే పరిస్థితి గందరగోళంగా మారనుంది. అదీగాక వీరికి మార్కులు కేటాయించడమూ కష్టమే. అందువల్ల ప్రస్తుతం కరోనా ఉధృతి తక్కువగా ఉండటంతో సెకండియర్ విద్యార్థులకు వచ్చే నెల్లో ఫస్టియర్ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రశ్నపత్రాలను కూడా సులువుగా ఉండేలా చూడాలని భావిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష రాయడానికి మళ్లీ ఫీజులు చెల్లించనవసరం లేకుండానే, గతంలో చెల్లించిన వారికి అవకాశం ఇవ్వనున్నా రు. గతంలో ఫీజు చెల్లించని వారు ఇప్పుడు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. వీటిపై ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. -
అలర్ట్: హైదరాబాద్ మెట్రో కొత్త టైమింగ్స్ ఇవే
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు నేపథ్యంలో మెట్రో రైలు సేవల్లోనూ మార్పులు జరిగాయి. ఇక పై ప్రతీ రోజు ఉ.7గంటలకు నుంచి ఉ.11.45 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండనున్నట్లు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ప్రకటించింది. అదే క్రమంలో చివరి రైలు ఉ.11.45 కు మొదలై.. గమ్యస్థానానికి 12.45 గంటలకు చేరుతుందని పేర్కొంది. ప్రయాణికులు తప్పక మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఆర్టీసీ వేళలు పెంపు నగరంలో సిటీ బస్సు లు సోమవారం నుంచి మరింత అందుబాటులోకి రానున్నాయి. లాక్డౌన్ సడలింపు సమయాన్ని ఒంటి గంట వరకు పొడిగించడంతో ఎక్కువ సంఖ్యలో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ చర్య లు చేపట్టింది. ఇకపై మధ్యాహ్నం రెండు గంటల్లోగా గమ్యస్థానాలకు చేరుకునే విధంగా బ స్సులు నడుపనున్నారు. అలాగే ఆటోలు, క్యాబ్‌లు తదితర వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు రోడ్డుపై తిరిగిన ఆర్టీసీ బస్సులు..తాజాగా మరో మూడు గంటలకుపైగా తిరుగనున్నాయి. గ్రేటర్లో 29 డి పోల పరిధిలో 2550 సిటీ బస్సులు పూర్తిస్థాయిలో సోమవారం నుంచి రోడ్డెక్కనున్నాయి. మరో లక్షన్నర ఆటోలు, 50 వేల క్యాబ్‌లు కూ డా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అ వకాశం ఉంది. హైదరాబాద్ నుంచి తెలంగాణ లోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 1500 బస్సులకు ఊరట లభించింది. చదవండి: తెలంగాణలో మరో పదిరోజులు లాక్డౌన్ పొడిగింపు -
నైట్ కర్ఫ్యూ: మెట్రో సేవల్లో మార్పులివే..
-
నైట్ కర్ఫ్యూ: మెట్రో సేవల్లో మార్పులివే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటి నుంచే కర్ఫ్యూ నిబంధలను అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో సేవల్లో మార్పులు చేస్తున్నట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి ఉండటంతో.. రాత్రి 7.40 గంటల వరకే మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి అని తెలిపారు. ఇక ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని.. మాస్క్ లేని వారికి మెట్రోలోకి అనుమతి లేదన్నారు. కోవిడ్ 19 సేఫ్టీ గైడ్‌లైన్స్ ప్రకారం భౌతిక దూరం పాటించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు అందుబాటులో ఉంచామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నేటి నుంచి మే 1 వరకు నైట్ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. ఇక రాత్రి 8 గంటల వరకే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్స్ నిర్వహణకు అనుమతినిచ్చింది. చదవండి: తెలంగాణలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ -
ఏపీ: పాఠశాలల పనివేళల్లో మార్పులు
సాక్షి, అమరావతి: పాఠశాలల వేళలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఉన్న పాఠశాలల సమయాల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ప్రాథమిక పాఠశాలు, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నిర్వహణ సమయం మార్పు చేశారు. (చదవండి: స్కూళ్లలో పిల్లల హాజరుపై దృష్టి) మన బడి నాడు–నేడు, మధ్యాహ్న భోజన పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నిర్వహించిన సమీక్షలో రాష్ట్రంలోని పాఠశాలలన్నీ ఉదయం 9 గంటల నుంచే ప్రారంభం కావాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉదయం వేళ సాధ్యమైనంత త్వరగా స్కూళ్లలో బోధన ప్రారంభించడం మంచిదని సూచించారు. ఉదయం పూట పిల్లల్లో చురుకుదనం బాగా ఉంటుందని, వారి మెదడు కూడా విషయాలను శీఘ్రంగా గ్రహించగలుగుతుందని, ఆ సమయంలో పాఠ్యబోధన సాగిస్తే పిల్లలు ఆయా అంశాలను త్వరితంగా, లోతుగా అవగాహన చేసుకోగలుగుతారన్నారు.(చదవండి: సీఎం జగన్ ఆదేశాలు: వైద్యురాలికి చికిత్స) ప్రపంచంలో పాఠశాలలన్నీ ఉదయం 8 లేదా 8.30 గంటలకల్లా ప్రారంభమవుతున్నాయని, అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఆలస్యంగా 9.30కు ప్రారంభం కావడం వల్ల అనుకున్న ఫలితాలను సాధించడానికి వీలుండదన్న చర్చ జరిగింది. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే వాటిని పరిష్కరించుకొని రాష్ట్రంలో కనీసం 9 గంటలకల్లా స్కూళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
ప్రత్యేక రైళ్ల సమయాల్లో మార్పు..
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ఈస్ట్‌కోస్ట్‌రైల్వే పరి«ధిలో నడుస్తున్న పలు స్పెషల్ రైళ్ల వేళలు మారినట్టు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మార్పు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయన్నారు. ►రాయగడ–విశాఖపట్నం (08507) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రోజూ ఉదయం 5.45 గంటలకు రాయగడలో బయల్దేరి అదే రోజు ఉదయం 10గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08508) విశాఖపట్నంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 10.05 గంటలకు రాయగడ చేరుకుంటుంది. ఈ రైలు ఇరుమార్గాలలో సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, పార్వతీపురం టౌన్ స్టేషన్లలో ఆగుతుంది. ►పలాస–విశాఖపట్నం (08531) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు పలాసలో ఉదయం 5గంటలకు బయల్దేరి అదేరోజు ఉదయం 9.25గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08532) విశాఖలో ప్రతిరోజు సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరి రాత్రి 10గంటలకు పలాస చేరుకుంటుంది. ఈ రైలు ఇరుమార్గాలలో సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళంరోడ్డు, తిలారు, నౌపడ స్టేషన్లలో ఆగుతుంది. -
ఇక రాత్రి 11 గంటల వరకు మెట్రో
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైల్ ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి మెట్రో రైళ్లు రాత్రి 11 గంటల వ రకు నడువనున్నాయి. నగరంలో సుమారు 1000 సిటీ బస్సులను ఆర్టీసీ రద్దు చేస్తున్న నేపథ్యంలో మెట్రో రైలు వేళల్లో మార్పులు చేసినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఇక నుంచి అన్ని టెర్మినళ్ల నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి ఆఖరు స్టేషన్ కు 11.50 గంటలకు చేరుకుంటాయి. అలాగే ఉదయం 6 గంట లకు బదులుగా 6.30 గంటలకు మెట్రో రైళ్లు ప్రారంభమవుతాయని తెలిపారు. రాత్రి ఆలస్యంగా ఇళ్లకు చేరుకునే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. -
రోజుకు మరో గంట పెరుగుతుంది...
రోజుకు 24 కంటే ఎక్కువ గంటలుంటే బాగుండేదని మీకెప్పుడైనా అనిపించిందా? మీ ఆశ ఇప్పుడు కాకపోయినా ఇంకో రెండు వేల ఏళ్లకైనా నిజం కానుంది! అదేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే అంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి నుంచి జాబిల్లి నెమ్మదిగా దూరం జరగడం దీనికి కారణమవుతోందని.. భవిష్యత్తులో రోజుకు 25 గంటలు ఉంటాయన్నది వీరి అంచనా. కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిస్–మాడిసన్ పరిశోధకులు దాదాపు తొమ్మిది కోట్ల ఏళ్ల క్రితం నాటి రాళ్లను పరిశీలించినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. పురాతన కాలంలో... కచ్చితంగా చెప్పాలంటే 140 కోట్ల ఏళ్ల క్రితం రోజుకు సగటున 18 గంటలు, గంటకు 41 నిముషాలు మాత్రమే ఉండేవని తెలిసింది.. భూమండలం కక్ష్య నుంచి చందమామ నెమ్మదిగా పక్కకు జరుగుతున్న కొద్దీ రోజులో గంటలు పెరుగుతున్నాయని తేల్చారు. ఈ విధంగా చంద్రుడు దూరం జరుగుతున్న కొద్ది భూభ్రమణం కూడా నెమ్మదిస్తుందని విస్కాన్సిన్–మాడిసన్ విశ్వవిద్యాలయ జియోసైన్స్ ప్రొఫెసర్ స్టీఫెన్ మేయర్స్ వెల్లడించారు. భూమి నుంచి చందమామ ఏడాదికి 3.82 సెంటీ మీటర్ల చొప్పున దూరం జరుగుతున్నట్టు అంచనా. జాబిల్లితోపాటు అనేక ఇతర గ్రహాలు, నక్షత్రాల గురుత్వాకర్షణ శక్తి ప్రభావం భూమిపై ఉంటుందని.. ఇది కాస్తా భూభ్రమణ వేగాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. సౌరవ్యవస్థలో వచ్చే మార్పుచేర్పులకు అనుగుణంగా రోజులో పగటి వేళల్లో మార్పులు సంభవిస్తున్నాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సింహపురి రైలు వేళల్లో మార్పు
అక్టోబరు 1 నుంచి అమలు ఫలించిన ఎంపీ మేకపాటి కృషి నెల్లూరు(సెంట్రల్): జిల్లా ప్రయాణికుల సాక్యర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధుల వినతుల మేరకు సింహపురి రైలు వేళలను మార్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గతంలో సింహపురి గూడూరులో రాత్రి 10.10 గంటలకు బయలుదేరేది. నెల్లూరుకు రాత్రి 11 గంటలకు చేరుకునేది. సికింద్రాబాదుకు మరుసటి రోజు మధ్యాహానానికి చేరుకుంటుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ప్రయాణికుల వినతుల మేరకు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రైల్వే మంత్రి, జీఎంను పలుమార్లు సింహపురి వేళలను మార్చాలని కోరుతూ వచ్చారు. ఇటీవల నెల్లూరుకు వచ్చిన రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు సైతం సింహపురి వేళల మార్పు విషయాన్ని ఎంపీ మరోమారు గుర్తు చేశారు. దీంతో ఎట్టకేలకు సింహపురి వేళల్లో మార్పులను తీసుకువచ్చారు. మార్చిన వేళల ప్రకారం గూడూరులో రాత్రి 6.50 గంటలకు బయలుదేరుతుంది. నెల్లూరుకు 7.18 గంటలకు, కావలికి 7.55, ఒంగోలుకు 8.40, చీరాలకు 9.30, విజయవాడకు 11.10కు చేరుకుంటుంది. విజయవాడలో 11.20 గంటలకు బయలుదేరి సికింద్రాబాదుకు మరుసటి రోజు వేకువన 5.40 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాదు– గూడూరు రైలు వేళల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. అక్టోబరు 1 నుంచి మారిన వేళలు అమలవుతాయని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు. -
ప్రయాణికుల ‘రూట్’లో...
30 మార్గాల్లో 549 బస్సుల నిర్వహణలో మార్పులు డిపోల మధ్య సమన్వయం, బస్సుల బంచింగ్ నియంత్రణ సమయ పాలనలో మార్పులతో సత్ఫలితాలు సాక్షి, సిటీబ్యూరో: ఏబస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. ప్రయాణికులంతా ఒకవైపు పడిగాపులు కాస్తుంటే బస్సులు మరో రూట్లో పరుగులు పెడుతుంటాయి. నాలుగైదు డిపోల బస్సులు ఒకే రూట్లో... ఒకే సమయంలో బయలుదేరుతాయి. దీంతో బస్సు వెనుక బస్సు బంచింగ్. వె రసి ప్రయాణికుల నిరాదరణ. ఇలాంటి సంస్థాగత వైఫల్యాలను అధిగమించేందుకు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ చేపట్టిన రూట్ల స్థిరీకరణ సత్ఫలితాలనిస్తోంది. ఇటీవల 30 రూట్లలో చేపట్టిన స్థిరీకరణ చర్యలతో ఆ ప్రాంతంలో ఆక్యుపెన్సీ 2 శాతం పెరిగినట్లు అధికారుల అంచనా. గ్రేటర్‌లోని సుమారు 1,050 రూట్లలో 3,850 సిటీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. డిపోల మధ్య సమన్వయ లోపంతో బస్సుల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. దీనిపై సమగ్రఅధ్యయనం చేపట్టిన గ్రేటర్ ఆర్టీసీ అధికారులు అన్ని ప్రధాన మార్గాల్లో రూట్ల స్థిరీకరణకు చర్యలు చేపట్టారు. దీంతో కొన్ని మార్గాల్లో ట్రిప్పుల సంఖ్య పెరిగింది. మరి కొన్ని రూట్లలో కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇంకొన్ని రూట్లను పొడిగించారు. మొత్తంగా 30 రూట్లలో 549 బస్సుల నిర్వహణలో చేసిన మార్పులు, చేర్పులతో ఆక్యుపెన్సీ పెరగడం గమనార్హం. పెరిగిన ట్రిప్పులు రూట్ల స్థిరీకరణకు చేపట్టిన చర్యలతో కొన్ని మార్గాల్లో ట్రిప్పుల సంఖ్య పెరిగింది. ఉదాహరణకు జయపురి కాలనీ-అఫ్జల్‌గంజ్ (రూట్ 72జె) మార్గంలో 8 బస్సులు నిత్యం 60 ట్రిప్పులు తిరిగేవి. ఈ రూట్లో బస్సులు నడిపే వివిధ డిపోల మధ్య సమన్వయం వల్ల మరిన్ని బస్సులు అదనంగా నడిపేందుకు అవకాశం లభించింది. దాంతో ట్రిప్పుల సంఖ్య 70కి పెరిగింది. ప్రస్తుతం ఉదయం 6 నుంచి రాత్రి 9.08 గంటల వరకు ప్రతి 12 నిమిషాలకు ఒకటి చొప్పున బస్సులు నడుపుతున్నారు. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తమ్ నాయక్ తెలిపారు. సీతాఫల్మండి, జామై ఉస్మానియా, రాంనగర్ గుండు, నారాయణగూడ, కాచిగూడ క్రాస్‌రోడ్స్, కోఠి, అఫ్జల్‌గంజ్, పురానాఫూల్ మీదుగా జియాగూడకు వెళ్లే 86జె రూట్లో ప్రస్తుతం 16 బస్సులు తిరుగుతున్నాయి. వీటి నిర్వహణ లో వైఫల్యాలను అధిగమించడంతో ట్రిప్పుల సంఖ్య 21 నుంచి 45కు పెరిగింది. ఉదయం 6.45 నుంచి రాత్రి 8.04 గంటల వరకు ఈ రూట్లో బస్సులు తిరుగుతాయి. ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. వనస్థలిపురం, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, హబ్సిగూడ, తార్నాక మీదుగా సికింద్రాబాద్‌కు వెళ్లే హయత్ నగర్-సికింద్రాబాద్ (290) రూట్లో 33 బస్సు లు తిరుగుతున్నాయి. రూట్ల స్థిరీకరణతో ట్రిప్పుల సంఖ్య పెరిగింది.ఉదయం 4.45 నుంచి రాత్రి 10.01 గంటల వరకు బస్సులు అందుబాటులోకి వచ్చాయి. 8 రూట్లలో కొత్త బస్సులు... పటాన్చెరు-శంషాబాద్ ఎయిర్‌పోర్టు, మేడ్చెల్-వీబీఐటీ, జగద్గిరిగుట్ట-విప్రో తదితర 8 రూట్లలో 56 కొత్త సర్వీసుల ను ప్రవేశపెట్టారు. మరో 24 రూట్లలో బస్సులను పొడిగించారు. ఉదాహరణకు అల్వాల్-కోఠి మధ్య నడిచే బస్సులను అటు సుచిత్ర వరకు ఇటు అఫ్జల్‌గంజ్ వరకు పొడిగించారు. సికింద్రాబాద్-జూపార్కు మధ్య నడిచే 7జెడ్ బస్సులను ఆరాంఘర్ వరకు పొడిగించారు. ఇలా వివిధ రూట్లలో పొడిగింపుతో ప్రయాణికుల సంఖ్య కొంత మేరకు పెరిగింది. -
నేటి నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో మార్పులు
హైదరాబాద్: తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు సమయాన్ని ఆధారంగా చేసుకొని మార్పులు చేశారు. ఈ విధానం నేటి(సోమవారం) నుంచి అమలులోకి రానుంది. తత్కాల్ రిజర్వేషన్ బుకింగ్‌ను 2 కేటగిరీలుగా విభజించారు. ఏసీ, నాన్ ఏసీ కేటగీరీలుగా చేశారు. రైలు బయలు దేరే ముందురోజు ఉదయం 10 గంటల నుంచి ఏసీ టికెట్ల బుకింగ్, ఉదయం 11 గంటల నుంచి(నాన్ ఏసీ) స్లీపర్ క్లాస్ టికెట్ల బుకింగ్‌లు మొదలవుతాయని రైల్వే అధికారులు తెలిపారు.