ప్రత్యేక రైళ్ల సమయాల్లో మార్పు.. | Changes In Timings Of Special Trains | Sakshi
Sakshi News home page

ప్రత్యేక రైళ్ల సమయాల్లో మార్పు..

Published Sun, Jan 17 2021 8:03 AM | Last Updated on Sun, Jan 17 2021 9:44 AM

Changes In Timings Of Special Trains - Sakshi

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ఈస్ట్‌కోస్ట్‌రైల్వే పరి«ధిలో నడుస్తున్న పలు స్పెషల్‌ రైళ్ల వేళలు మారినట్టు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఏకే త్రిపాఠీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మార్పు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయన్నారు. 
రాయగడ–విశాఖపట్నం (08507) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రోజూ ఉదయం 5.45 గంటలకు రాయగడలో బయల్దేరి అదే రోజు ఉదయం 10గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08508) విశాఖపట్నంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 10.05 గంటలకు రాయగడ చేరుకుంటుంది. ఈ రైలు ఇరుమార్గాలలో సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, పార్వతీపురం టౌన్‌ స్టేషన్‌లలో ఆగుతుంది. 
పలాస–విశాఖపట్నం (08531) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతి రోజు పలాసలో ఉదయం 5గంటలకు బయల్దేరి అదేరోజు ఉదయం 9.25గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08532) విశాఖలో ప్రతిరోజు సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరి రాత్రి 10గంటలకు పలాస చేరుకుంటుంది. ఈ రైలు ఇరుమార్గాలలో సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళంరోడ్డు, తిలారు, నౌపడ స్టేషన్‌లలో ఆగుతుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement