
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): గుంటూరు డివిజన్ మీదుగా విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య నడిచే వారాంతపు ప్రత్యేక రైళ్లు మార్చి నెలలోనూ కొనసాగనున్నట్లు సీనియర్ డీసీఎం నరేంద్ర వర్మ తెలిపారు.
► విశాఖపట్నం–సికింద్రాబాద్ (08579) ప్రత్యేక రైలు మార్చి 2 నుంచి 30వ తేదీ వరకు ప్రతి బుధవారం రాత్రి 7.00 గంటలకు విశాఖపట్నం స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.
► సికింద్రాబాద్–విశాఖపట్నం (08580) ప్రత్యేక రైలు మార్చి 3 నుంచి 31వ తేదీ వరకు ప్రతి గురువారం రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది.
► విశాఖపట్నం–సికింద్రాబాద్ (08585) ప్రత్యేక రైలు మార్చి 1 నుంచి 29వ తేదీ వరకు ప్రతి మంగళవారం రాత్రి 7.00 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది.
► సికింద్రాబాద్–విశాఖపట్నం (08586) ప్రత్యేక రైలు మార్చి 2 నుంచి 30వ తేదీ వరకు ప్రతి బుధవారం రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment