12 నుంచి పట్టాలెక్కనున్న ప్రత్యేక రైళ్లు  | Railways To Run New Special Trains From Sep 12th | Sakshi
Sakshi News home page

12 నుంచి పట్టాలెక్కనున్న ప్రత్యేక రైళ్లు 

Published Mon, Sep 7 2020 6:22 AM | Last Updated on Mon, Sep 7 2020 7:48 AM

Railways To Run New Special Trains From Sep 12th - Sakshi

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ప్రయాణికుల సౌకర్యార్థం మరికొన్ని స్పెషల్‌ రైళ్లు ఈ నెల 12వ తేదీ నుంచి దేశ్యవ్యాప్తంగా నడుపనున్నారు. వీటిలో ఈస్ట్‌కోస్ట్‌రైల్వే, వాల్తేర్‌ డివిజన్‌ పరిధి విశాఖ నుంచి, విశాఖ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రైల్వే బోర్డు ఇటీవల ప్రకటించింది. ఈ స్పెషల్‌ రైళ్లకు రిజర్వేషన్‌ ఈ నెల 10వ తేదీనుంచి ప్రారంభమవుతుందని వాల్తేర్‌ డివిజనల్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎ.కే.త్రిపాఠి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. (చదవండి: నన్ను కాపాడి నువ్వెళ్లిపోయావా..)

ప్రత్యేక రైళ్ల వివరాలు... 
విశాఖపట్నం–కోర్బా–విశాఖపట్నం (08518/8517) డైలీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ 12వ తేదీ నుంచి విశాఖలో ప్రారంభమై ప్రతిరోజు రాత్రి 8.05 గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో 13వ తేదీ నుంచి కోర్బాలో ప్రారంభమై  ప్రతిరోజు సాయంత్రం 4.10గంటలకు బయల్దేరుతుంది. ఈ స్పెషల్‌ రైలు రానుపోను విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, కేసింగ, టిట్లాఘడ్, కంటాబంజి, ఖరియార్‌ రోడ్, మహాసముంద్, రాయ్‌పూర్, టిల్డా నియోరా, భతపరా, బిలాస్‌పూర్, అకల్తరా, జంజ్‌గిరినైలా, చంపా స్టేషన్‌లలో ఆగుతుంది. (చదవండి: గాజువాక సీఐకి నూతన్ ‌నాయుడు ఫోన్‌..

విశాఖ మీదుగా నడిచే రైళ్లు 
తిరుచ్చిరాపల్లి–హౌరా–తిరుచ్చిరాపల్లి( 02664 / 02663) వీక్లీ స్పెషల్‌ రైలు ఈ నెల 15 నుంచి ప్రారంభమై ప్రతి మంగళ, శుక్రవారాలలో  సాయంత్రం 4.20గంటలకు తిరుచ్చిరాపల్లిలో బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో హౌరాలో  17 నుంచి ప్రారంభమై ప్రతి గురు, ఆది వారాలలో సాయంత్రం 4.10గంటలకు బయల్దేరుతుంది. ఈ స్పెషల్‌ రైలు రానుపోను విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్‌ స్టేషన్‌లలో ఆగుతుంది. 
 

గౌహతి–బెంగళూరు కంటోన్మెంట్‌–గౌహతి(02509 / 02510) ట్రై వీక్లి స్పెషల్‌ రైలు గౌహతిలో 13 నుంచి ప్రారంభమై ప్రతి ఆది, సోమ, మంగళవారాలలో ఉదయం 6.20గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు కంటోన్మెంట్‌లో 16 నుంచి ప్రారంభమై ప్రతి బుధ, గురు, శుక్రవారాలలో రాత్రి 11.40గంటలకు బయల్దేరుతుంది. ఈ స్పెషల్‌ రైలు రానుపోను రన్‌గియా, న్యూ జల్పయ్‌గురి, మాల్డా టౌన్, హౌరా, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్‌ కియోంఝర్‌ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దారోడ్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, ఇతర ముఖ్య స్టేషన్‌లలో మాత్రమే ఆగుతుంది.  
ఈ స్పెషల్‌ రైళ్లకు టికెట్స్‌ రిజర్వేషన్‌ కౌంటర్స్‌ వద్ద, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయని, కేవలం కన్ఫర్మ్‌ టికెట్స్‌ ఉన్న ప్రయాణికులను మాత్రమే రైళ్లలోకి అనుమతిస్తారని సీనియర్‌ డీసీఎం త్రిపాఠి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement