
( ఫైల్ ఫోటో )
సాక్షి, తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ఆయా రైళ్లలో జనరల్ టికెట్లను పునరుద్ధరించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే చర్యలు తీసుకున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని స్టేషన్లలోని జనరల్ కౌంటర్స్‌లో ఈనెల 21 నుంచి టికెట్లు తీసుకోవచ్చని పేర్కొన్నారు. రాయగడ–గుంటూరు(17244)ఎక్స్‌ప్రెస్ (4 కోచ్‌లు), విశాఖపట్నం–విజయవాడ(12717)రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (6 కోచ్‌లు), విశాఖపట్నం–గుంటూరు(17240)సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (6 కోచ్‌లు), విశాఖపట్నం–లింగంపల్లి(12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్(4 కోచ్‌లు)కు జనరల్ టికెట్లు ఇవ్వనున్నారని తెలిపారు. కోవిడ్ కారణంగా జనరల్ టికెట్లను రద్దు చేసి, అన్ని క్లాసులకు రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.