![Vizag secunderabad Vande Bharat Express Resceduled Due to Attack - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/6/vande_Bharat_Attack.jpg.webp?itok=Yb1mMcIu)
విశాఖ: రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసినా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. తెలుగు రాష్ట్రాల వందే భారత్ రైలుపై మరోసారి రాళ్లదాడి జరిగింది. బుధవారం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దారిలో.. ఖమ్మం-విజయవాడ మధ్య రైలుపై రాళ్లు విసిరిన అగంతకులు.
దీంతో.. C8 కోచ్ అద్దాలు పగిలిపోయాయి. కోచ్ మరమ్మత్తుల నేపథ్యంలో ఇవాళ(గురువారం) విశాఖ నుంచి రైలు ఆలస్యంగా బయలుదేరుతోంది. విశాఖ నుంచి 5.45కు బయలుదేరి వెళ్లాల్సిన వందే భారత్ ఆలస్యం..షెడ్యూల్ కంటే ఆలస్యంగా 9-.45కి బయలుదేరనుంది.
గతంలోనూ ఈ రూట్‌లో వందే భారత్‌పై రాళ్ల దాడులు జరిగాయి. ఫిబ్రవరిలో ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో, అంతకు ముందు సైతం ఓసారి ఇలాగే దాడి జరిగింది. వరుసగా రైళ్లపై రాళ్ల దాడి జరగడంతో దక్షిణమధ్య రైల్వే సీరియస్‌గా స్పందించింది. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
రాళ్లదాడికి పాల్పడే నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. అంతేకాదు.. ఇలా నేరం చేసిన వారిపై కేసులు నమోదు చేసిన కేసుల్లో 39 మందిని అరెస్టు చేశారు కూడా.
ఇదిలా ఉంటే.. శనివారం కొత్తగా సికింద్రాబాద్-తిరుపతి రూట్‌లో వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment