Stone pelted
-
ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి.. ప్రయాణీకులకు గాయాలు!
పాట్నా: ఇటీవలి కాలంలో దేశంలో రైళ్లపై దాడుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొందరు ఆకతాయిలు రైలు ప్రమాదం జరిగేందుకు కుట్రలు చేస్తున్నారు. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు పెట్టడం, పట్టాలకు ఉన్న హుక్స్ తీయడం వంటివి చేస్తున్నారు. కొందరు మాత్రం రైళ్లు సమయంలో రాళ్లు విసురుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్‌లో చోటుచేసుకుంది. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు సైతం గాయాలయ్యాయి.వివరాల ప్రకారం.. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ రైలుపై గురువారం రాత్రి రాళ్ల దాడి జరిగింది. రైలు జైనగర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ముజఫర్‌పూర్ – సమస్తిపూర్ మార్గంలో సమస్తిపూర్ రైల్వే స్టేషన్ ఔటర్ సిగ్నల్ సమీపంలో రాత్రి 8:50 గంటల ప్రాంతంలో దాడి ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు రైలుపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో స్లీపర్ కోచ్, రైలు ప్యాంట్రీకార్, పక్క కోచ్‌ల అద్దాలు ధ్వంసమయ్యాయి. #BigBreaking || બિહારના સમસ્તીપુરમાં સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ પર પથ્થરમારો, અનેક લોકો ઈજાગ્રસ્ત#Bihar #Dibrugarh #Samastipur #SwatantrataSenaniExpress #TrainAttack #SwatantrataExpress pic.twitter.com/5NqENieALn— Gujarati Daily Times (@GujaratiDailyT) September 27, 2024 రైలుపై రాళ్ల దాడి ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలిసింది. వారికి హుటాహుటిన సమస్తిపూర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు రాళ్ల దాడి ఘటనపై రైల్వే పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దాడి కారణంగా రైలు 45 నిమిషాలు ఆలస్యంగా నడిచినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: వుతియా పండుగ వేడుకల్లో విషాదం.. 46 మంది మృతి -
హరియాణాలో ఆగని బుల్డోజర్ డ్రైవ్
గురుగ్రామ్: హరియాణాలోని నూహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు మరో వర్గం వ్యక్తులు చేసిన రాళ్లదాడి తదనంతర ఘటనల్లో పాల్గొన్న వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లతో సమాధానం చెబుతోంది. నూహ్ అల్లర్ల సంబంధ సీసీటీవీ వీడియోలో పోలీసులు గుర్తించిన నిందితులకు చెందిన దుకాణాలను అధికారులు బుల్డోజర్లతో నేలమట్టంచేశారు. మూడో రోజైన శనివారం సైతం ఈ బుల్డోజర్ డ్రైవ్ కొనసాగింది. అయితే, నల్హార్ వైద్య కళాశాలకు చెందిన 2.6 ఎకరాల భూమిలో కట్టిన అక్రమ నిర్మాణాలనే తాము కూల్చేశామని అధికారులు చెప్పడం గమనార్హం. నూహ్ అల్లర్ల నిందితులను లక్ష్యంగా చేసుకునే ఈ కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టారన్న ఆరోపణలను అధికారులు కొట్టిపారేశారు. అయితే నూహ్ జిల్లాలో పరిస్థితి కాస్తంత అదుపులోకి వచ్చిన నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటలదాకా కర్ఫ్యూను ఎత్తేస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ ధీరేంద్ర చెప్పారు. భయంతో తరలిపోతున్న వలసకార్మికుల్లో భరోసా కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నించింది. డెప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ సెక్టార్ 58, 70 సమీపంలోని పలు మురికివాడల్లో పర్యటించి వలసకార్మికులతో మాట్లాడారు. ఎలాంటి భయం లేకుండా పనులకు వెళ్లొచ్చని హామీ ఇచ్చారు. -
Vande Bharat: వందే భారత్‌పై దాడులు ఆగవా?
తిరువనంతపురం: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్విన అల్లరి మూకలు.. ఈ మధ్య ఎక్కడో దగ్గర ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కఠిన చర్యలు ఉంటాయని, జైలు శిక్ష తప్పదనే రైల్వే శాఖ హెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టి మరీ రైలుపై దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో దేశంలోనే సెమీ హైస్పీడ్ రైళ్లుగా పేరున్న వందే భారత్ రైళ్లపై దాడులపరంపరకు చెక్ పెట్టడం ఎలాగనే ఆలోచనలో పడిపోయింది రైల్వే శాఖ. తాజాగా.. కేరళలో కొత్తగా ప్రారంభమైన వందే భారత్‌పైనా రాళ్ల దాడి జరిగింది. ఏప్రిల్ 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి.. తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ మధ్య కేరళ తొలి వందేభారత్‌ను ప్రారంభించారు. అయితే.. తాజాగా తిరునవయా-తిరూర్ మధ్య వందే భారత్‌పై రాళ్లు రువ్వారు ఆగంతకులు. ఈ దాడిలో అద్దం పగిలిపోగా.. ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపటినట్లు వెల్లడించారు. Flagged off Kerala’s first Vande Bharat Express, which will enhance connectivity from Thiruvananthapuram to Kasaragod. pic.twitter.com/u1RqG5SoVU — Narendra Modi (@narendramodi) April 25, 2023 ఇదిలా ఉంటే.. వందేభారత్ రైళ్లపై గత కొంతకాలంగా రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంతెందుకు సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో స్వల్ప కాలవ్యవధిలోనే వందేభారత్‌పై మూడుసార్లు రాళ్ల దాడి జరిగింది. అంతకు ముందు మార్చిలో పశ్చిమ బెంగాల్ ఫన్సిదేవా వద్ద, అదే నెలలో హౌరా-న్యూ జల్పైగురి మధ్య మాల్దా సమీపంలో వందేభారత్ రైళ్ల పై రాళ్ల దాడులు జరిగాయి. మొత్తంగా దేశంలో వందే భారత్ రైళ్లు పట్టాలెక్కిన తర్వాత.. ఇలాంటి దాడుల కేసులే పాతిక దాకా నమోదు అయినట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో రైల్వే శాఖ సీఆర్పీఎఫ్ ద్వారా ఈ తరహా నేరాల కట్టడికి సమాలోచనలు చేస్తోంది. ఇదీ చదవండి: కవితక్క ఢిల్లీలో వ్యాపారం..హైదరాబాద్‌లో ఆస్తులు -
మరోసారి దాడి.. విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ఆలస్యం
విశాఖ: రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసినా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. తెలుగు రాష్ట్రాల వందే భారత్ రైలుపై మరోసారి రాళ్లదాడి జరిగింది. బుధవారం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దారిలో.. ఖమ్మం-విజయవాడ మధ్య రైలుపై రాళ్లు విసిరిన అగంతకులు. దీంతో.. C8 కోచ్ అద్దాలు పగిలిపోయాయి. కోచ్ మరమ్మత్తుల నేపథ్యంలో ఇవాళ(గురువారం) విశాఖ నుంచి రైలు ఆలస్యంగా బయలుదేరుతోంది. విశాఖ నుంచి 5.45కు బయలుదేరి వెళ్లాల్సిన వందే భారత్ ఆలస్యం..షెడ్యూల్ కంటే ఆలస్యంగా 9-.45కి బయలుదేరనుంది. గతంలోనూ ఈ రూట్లో వందే భారత్‌పై రాళ్ల దాడులు జరిగాయి. ఫిబ్రవరిలో ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో, అంతకు ముందు సైతం ఓసారి ఇలాగే దాడి జరిగింది. వరుసగా రైళ్లపై రాళ్ల దాడి జరగడంతో దక్షిణమధ్య రైల్వే సీరియస్‌గా స్పందించింది. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రాళ్లదాడికి పాల్పడే నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. అంతేకాదు.. ఇలా నేరం చేసిన వారిపై కేసులు నమోదు చేసిన కేసుల్లో 39 మందిని అరెస్టు చేశారు కూడా. ఇదిలా ఉంటే.. శనివారం కొత్తగా సికింద్రాబాద్-తిరుపతి రూట్లో వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. -
రాళ్ల దాడి.. కేంద్ర మంత్రికి నిరసన సెగ!
కోల్‌కతా: కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై శనివారం పశ్చిమ బెంగాల్లో దాడి జరిగింది. ఈ దాడిలో కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న వాహనం ముందు అద్దం ధ్వంసమైంది. ఆయన మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. బీజేపీ-టీఎంసీ కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణలోనే.. ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిసిత్ ప్రమాణిక్.. స్థానిక బీజేపీ కార్యాలయానికి వెళ్తున్నారు. ఆ సమయంలో దిన్హటాలోని బురిర్‌హాట్‌లో టీఎంసీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసనకు సిద్ధమయ్యారు. వాళ్లను బీజేపీ కార్యకర్తలు నిలువరించే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగగా.. రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ముందు అద్దం ధ్వంసమైంది. ఈ తరుణంలో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే ఇది టీఎంసీ మద్దతుదారుల పనేనని ఆయన ఆరోపించారు. ఒక మంత్రికే రక్షణ కరువైనప్పడు సామాన్యుల పరిస్థితి ఏంటని.. బెంగాల్లో ప్రజాస్వామ్యం పరిస్థితి ఇదని దాడిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. బీఎస్ఎఫ్ కాల్పుల్లో ఓ గిరిజనుడి మృతిపై.. మంత్రి నిసిత్ హోంశాఖకు సమర్పించిన నివేదికపై ఆగ్రహంతోనే ఈ దాడికి పాల్పడినట్లు స్థానికమీడియా కథనాలు ప్రచురిస్తోంది. అంతేకాదు.. పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సైతం తాజాగా నిసిత్ ప్రమాణిక్‌ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేస్తూ.. ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని, ఎక్కడికి వెళ్లినా నల్లజెండాలతో నిరసనలు చెబుతామని హెచ్చరించారు కూడా. Clashes broke out between #TMC & #BJP workers in Coochbehar #Bengal. This as MoSHome #NisithPramanik was on his way to a program & TMC workers had assembled to show him back flags.BJP workers challenged them & clashes erupted.Stones hit Nisith Pramanik’s car too but MoS is unhurt pic.twitter.com/ku3T66fYun — Tamal Saha (@Tamal0401) February 25, 2023 -
రెండేళ్ల బాలుడ్ని అమాంతం మింగేసిన నీటిగుర్రం.. చివరకు ఏమైందంటే?
ఉగాండాలో మిరాకిల్ జరిగింది. సరస్సు సమీపంలోని ఓ ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడ్ని నీటిగుర్రం(హిపోపాటమస్) అమాంతం మింగేసింది. అక్కడున్న ఓ వ్యక్తి గట్టిగా అరుస్తూ రాళ్లు విసిరేయడంతో వెంటనే బాలుడ్ని బయటకు ఉమ్మేసింది. దీంతో చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అతను క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ బాలుడి పేరు పాల్. సరస్సుకు అతి సమీపంలో వీళ్ల ఇల్లు ఉంది. డిసెంబర్ 4న సరదాగా బయటకు వెళ్లి ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. సరస్సు నుంచి వచ్చిన నీటిగుర్రం బాలుడ్ని తలపై నుంచి అమాంతం మింగేసింది. సగానికిపైగా శరీరాన్ని నోట్లోకి తీసుకుంది. ఇంతలో అటువైపు నుంచి వెళ్తున్న క్రిస్పస్ బగోంజా అనే వ్యక్తి ఇది గమనించి నీటిగుర్రంపైకి రాళ్లు విసిరాడు. దీంతో అది బాలుడ్ని వదిలేసింది. అయితే హిపోపాటమస్ పళ్లు గుచ్చుకొని చిన్నారి చేతికి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా వైద్యులు ముందు జాగ్రత్తగా రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం చికిత్స అందించారు. నీటిగుర్రాలు శాఖహారులు అయినప్పటికీ.. బాగా భయపడినప్పుడు వేగంగా దాడులు చేస్తాయి. కొన్నిసార్లు పడవలను కూడా ఎత్తిపడేస్తాయి. నీటిగుర్రాల దాడుల వల్ల ఆఫ్రికాలో ఏటా 500 మంది చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఏ ఇతర జంతువు కారణంగా ఇన్ని మరణాలు నమోదు కావడం లేదు. అత్యంత ప్రమాదకర జంతువుల్లో హిపోపాటమస్ కూడా ఒకటి. దీని దంతాలు సింహం కంటే మూడు రెట్లు ఎక్కువ బలంగా ఉంటాయి. చదవండి: 2,00,000 బలగాలతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడేందుకు రష్యా ప్లాన్! -
Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై రాయితో దాడి.. నేనేం తప్పు చేశా?
సూరత్: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పైకి ఓ వ్యక్తి రాయి విసిరాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సూరత్‌లో రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి చేశాడు. అయితే కేజ్రీవాల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ విషయంపై కేజ్రీవాల్ స్పందించారు. ప్రత్యర్థులు తన కన్ను పోగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను ఏం తప్పు చేశానని దాడి చేస్తున్నారని ప్రశ్నించారు. 27 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. స్కూళ్లు, హాస్పిటళ్లు నిర్మిస్తామని తాను హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మహిళలు, యువతలో విశేష స్పందన లభిస్తోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మొత్త 182 సీట్లకు 92 స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌పై చేసిన దాడిలో ఓ చిన్నారి గాయపడినట్లు ఆప్ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా తెలిపారు. బీజేపీ గూండాలే ఈ ఘటనకు పాల్పడినట్లు ఆరోపించారు. મારી માતા, બહેન, દિકરીઓને પ્રતિ માસ રૂ 1000 સન્માન રાશિ તરીકે આપવામાં આવશે. - @ArvindKejriwal pic.twitter.com/j9vq5vvOAY — AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 28, 2022 మరోవైపు కేజ్రీవాల్‌పై దాడి జరగలేదని గుజరాత్ పోలీస్ అధికారులు చెప్పారు. ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. జెడ్ ప్లస్ భద్రతతో రోడ్‌షో జరిగిందని పేర్కొన్నారు. అయితే సూరత్‌లో కేజ్రీవాల్ ర్యాలీ సమయంలో ఆప్, బీజేపీ కార్యకరక్తల మధ్య తోపులాట జరిగిందని పోలీసులు వెల్లడించారు. తామ వెంటనే పరిస్థితిని అదుపు చేశామన్నారు. చదవండి: ఆకాశంలో సగం.. అవకాశాలే గగనం! -
మునుగోడులో రణరంగం: ఈటల కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. కార్యకర్తల ఘర్షణ
సాక్షి, నల్లగొండ: మునుగోడు రణరంగంగా మారింది. ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈటల వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా రాళ్ల దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు ఈటల రాజేందర్. ఏం జరిగినా పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ మునుగోడు ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై దాడి జరిగిన క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తి.. పరస్పరం దాడి చేసుకున్నారు. ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బీజేపీ ప్రచార రథానికి ఉన్న బ్యానర్లను చించేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మునుగోడుకు అదనపు బలగాలను తరలించాలని అధికారులను ఆదేశించింది ఎన్నికల సంఘం. ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు -
ధోని ఇంటిపై రాళ్ల దాడి
రాంచీ: సొంత మైదానంలో నిన్న జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్ అప్పగించడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడంతో నిరాశ చెందారు. దీంతో కోపోద్రిక్తులయిన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ధోని ఇంటిపై రాళ్లు విసిరారు. స్థానిక హార్మూ హౌసింగ్ కాలనీలో ఉన్న ధోని ఇంటిపై బుధవారం రాత్రి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఇంటి కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అయితే దాడి జరిగిన సమయంలో ధోని కుటుంబ సభ్యులు జేఎస్సీఏ అంతర్జాతీయ మైదానంలో మ్యాచ్ చూస్తున్నారు. ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన నాలుగో వన్డేలో టాస్ గెలిచి ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. లక్ష్యఛేదనను ఆరంభించిన భారత్ 4.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. ధోని, కోహ్లి, ధావన్ బ్యాటింగ్ చూడాలని మ్యాచ్‌కు వచ్చామని, వర్షం కారణంగా డబ్బుతో పాటు కీలక ఆట కోల్పోయామని అభిమానులు వాపోయారు.