సాక్షి, నల్లగొండ: మునుగోడు రణరంగంగా మారింది. ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈటల వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా రాళ్ల దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు ఈటల రాజేందర్. ఏం జరిగినా పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేశారు.
టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ
మునుగోడు ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై దాడి జరిగిన క్రమంలో టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తి.. పరస్పరం దాడి చేసుకున్నారు. ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బీజేపీ ప్రచార రథానికి ఉన్న బ్యానర్లను చించేశారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మునుగోడుకు అదనపు బలగాలను తరలించాలని అధికారులను ఆదేశించింది ఎన్నికల సంఘం.
ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు
Comments
Please login to add a commentAdd a comment